Main Menu

రక్షణమంత్రితో భేటీ వెనుక..

Spread the love

భారత క్రికెట్‌ దిగ్గజం, రాజ్యసభ సభ్యుడు సచిన్‌ తెందుల్కర్‌, కేంద్ర రక్షణ శాఖ మంత్రి మనోహర్‌ పారికర్‌తో సమావేశం కావడం సంచలనం సృష్టించింది. దీనికి సంబంధించి పలు కథనాలు వినిపిస్తున్నాయి. ఉత్తరాఖండ్‌లో ముస్సోరి ప్రాంతంలోని ల్యాండొల్‌ కంటోన్మెంట్‌ ప్రాంతంలో డీఆర్‌డీవోకు చెందిన కీలక పరిశోధనా కేంద్రముంది. ఈ ప్రాంతానికి సమీపంలోని సచిన్‌ స్నేహితుడు సంజయ్‌ నారంగ్‌కు చెందిన రిసార్ట్స్‌ వున్నాయి. అయితే రిసార్ట్స్‌ యాజమాన్యం నిబంధనలను ఉల్లంఘించి పరిశోధనా కేంద్రానికి అతి దగ్గరలో రిసార్ట్స్‌ నిర్మాణాన్ని చేపట్టారు. దీంతో కంటోన్మెంట్‌ యాజమాన్యం దీనిపై చర్యలు తీసుకోవడానికి ఉపక్రమించినట్టు తెలుస్తోంది. దీనిపై సమాచారం తెలుసుకున్న ఆస్ట్రేలియాలో వున్న తెందుల్కర్‌ వెంటనే తన పర్యటనను అర్థాంతరంగా ముగించుకొని దిల్లీకి చేరుకొని రక్షణశాఖ మంత్రి మనోహర్‌ పారికర్‌తో సమావేశమైనట్టు సమాచారం. అయితే దీనిపై కేంద్ర రక్షణశాఖ వర్గాలు కానీ సచిన్‌ తెందుల్కర్‌ గానీ ఎటువంటి ప్రకటన చేయకపోవడంతో సమావేశం వివరాలు తెలియడం లేదు.






Related News

‘గవర్నర్‌ గిరీ’ కోసం మిత్రపక్షాల వైరం …

Spread the loveమిత్రపక్షాల వైరం ముదిరినట్టే ఉంది. బీజేపీ- టీడీపీల మధ్య పదవుల వ్యవహారం ముదిరిపాకాన పడినట్టు కనిపిస్తోంది. ప్రస్తుతంRead More

‘ఆవాజ్’తో సిద్ధు కొత్త ఇన్నింగ్స్…

Spread the loveక్రీడా ప్రపంచంలో పరిచయం అక్కర్లేని పేరు నవ్ జ్యోత్ సింగ్ సిధ్దు.. క్రికెట్ లాగే,అతని రాజకీయ జీవితంRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *