‘గవర్నర్ గిరీ’ కోసం మిత్రపక్షాల వైరం …

మిత్రపక్షాల వైరం ముదిరినట్టే ఉంది. బీజేపీ- టీడీపీల మధ్య పదవుల వ్యవహారం ముదిరిపాకాన పడినట్టు కనిపిస్తోంది. ప్రస్తుతం ఖాళీగావున్న మధ్యప్రదేశ్, తమిళనాడు రాష్ర్టాలకు గవర్నర్లను నియమించే పనిలో కేంద్రం బిజీ అయ్యింది. ఈసారి రేసులో గుజరాత్ మాజీ సీఎం ఆనంది బెన్పటేల్, టీడీపీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు వున్నట్లు జాతీయ మీడియా కథనం. వినాయకచవితి తర్వాత కేంద్రం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యే అవకాశమున్నట్లు సమాచారం.
ఇంతవరకు బాగానేవున్నా.. తమిళనాడు గవర్నర్గా మోత్కుపల్లిని, మధ్యప్రదేశ్ గవర్నర్గా ఆనంది బెన్పటేల్ నియమించే ఛాన్స్ వుందంటూ ఓవైపు వార్తలు వస్తున్నాయి. ఐతే, తనకు తమిళనాడు గవర్నర్ పదవి కావాలని ఆనంది పటేల్ అధిష్టానాన్ని డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
గుజరాత్ బీజేపీ నేతల్లో ఈమె కూడా ఒకరు. పైగా ప్రధాని మోదీకి నమ్మినబంటు కూడా! ఆమెకే ఫస్ట్ ప్రయార్టీ ఇవ్వవచ్చని అంటున్నారు. ఏదైతేనేం చాన్నాళ్ల తర్వాత టీడీపీ నేత మోత్కుపల్లి నర్సింహుల ఆశలు నిజమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Related News

‘గవర్నర్ గిరీ’ కోసం మిత్రపక్షాల వైరం …
Spread the loveమిత్రపక్షాల వైరం ముదిరినట్టే ఉంది. బీజేపీ- టీడీపీల మధ్య పదవుల వ్యవహారం ముదిరిపాకాన పడినట్టు కనిపిస్తోంది. ప్రస్తుతంRead More

‘ఆవాజ్’తో సిద్ధు కొత్త ఇన్నింగ్స్…
Spread the loveక్రీడా ప్రపంచంలో పరిచయం అక్కర్లేని పేరు నవ్ జ్యోత్ సింగ్ సిధ్దు.. క్రికెట్ లాగే,అతని రాజకీయ జీవితంRead More