Main Menu

కమ్యూనిటీ ‘కిచెన్‌’లో కేజ్రీవాల్‌కు పనేంటి?

Spread the love

ఆమ్‌ ఆద్మీ పార్టీపై విమర్శల నేపద్యంలో పార్టీ కన్వీనర్‌, దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ పంజాబ్‌లోని అమృత్‌సర్‌ ఆలయానికి వచ్చారు. వాలంటరీ సేవలో భాగంగా స్వర్ణ దేవాలయంలోని కమ్యూనిటీ కిచెన్‌లో వంటపాత్రలను శుభ్రం చేశారు. అనంతరం ఆలయాన్ని దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేశారు.
పంజాబ్‌ ఎన్నికల సందర్భంగా ఇటీవల ఆమ్‌ ఆద్మీ పార్టీ యూత్‌ మేనిఫెస్టోను విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే అందులో స్వర్ణ దేవాలయం ఫొటో పక్కనే పార్టీ ఎన్నికల గుర్తును ముద్రించారు. దీంతో ఆప్‌పై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ విషయంపై క్షమాపణ చెప్పేందుకు కేజ్రీవాల్‌ నేడు పంజాబ్‌ వచ్చి ఆలయంలో సేవ చేశారు. ఆయన వెంట పార్టీ సీనియర్‌ నేతలు ఆశిష్‌ ఖేతాన్‌, హెచ్‌ఎస్‌ ఫూల్కా, భగవత్‌ మన్‌ తదితరులున్నారు.






Related News

‘గవర్నర్‌ గిరీ’ కోసం మిత్రపక్షాల వైరం …

Spread the loveమిత్రపక్షాల వైరం ముదిరినట్టే ఉంది. బీజేపీ- టీడీపీల మధ్య పదవుల వ్యవహారం ముదిరిపాకాన పడినట్టు కనిపిస్తోంది. ప్రస్తుతంRead More

‘ఆవాజ్’తో సిద్ధు కొత్త ఇన్నింగ్స్…

Spread the loveక్రీడా ప్రపంచంలో పరిచయం అక్కర్లేని పేరు నవ్ జ్యోత్ సింగ్ సిధ్దు.. క్రికెట్ లాగే,అతని రాజకీయ జీవితంRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *