ఉమ్మడి ప్రయోజనాల కోసమే కేసీఆర్, పవన్ భేటీ

pawan kcr
Spread the love

జనసేనాని స్వయంగా కేసీఆర్ దగ్గరకి వెళ్లారు. వివిధ సందర్భాల్లో బాలక్రుష్ణ సహా పలువురు సినీ రాజకీయులు వెళ్లి కలిసి వచ్చారు. కానీ కేసీఆర్ క్యాంప్ ఆఫీస్ కి పవన్ కళ్యాణ్ వెళ్లడం ఇదే ప్రధమం. అందులోనూ కేసీఆర్ మీద, ఆయన కుటుంబం మీద పలు కామెంట్స్ చేసి అప్పట్లో కలకలం రేపిన పవన్ ఇప్పుడు నేరుగా అక్కడికే వెళ్లడం ఆశ్చర్యమే. ఏకంగా విభజన రాజకీయాల మీద కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమాలో ఘాటు సెటైర్లు వేసి సంచలనం రేపిన హీరో, ఇప్పుడు తెలంగాణా ముఖ్యమంత్రి ఇంట బొకే పట్టుకుని కనబడడం ఆశ్చర్యమే గాకుండా చర్చనీయాంశం అయ్యింది.

రాజకీయంగా పవన్ కళ్యాణ్ పచ్చి కాంగ్రెస్ వ్యతిరేకి. ఆ కారణంగానే ఏపీలో జగన్ ని వ్యతిరేకించినా, కేంద్రంలో మోడీకి సహకరించినా, ఇతర అనేక నిర్ణయాలకు అదే మూలంగా ఉంటుంది. అలాంటి పవన్ కి కేసీఆర్ అవసరం కూడా ఉంది. తెలంగాణాలో కాంగ్రెస్ పుంజుకుంటుందనే వాతావరణం ఉన్న దశలో పవన్ ఫ్యాన్స్ ని తనవైపు తిప్పుకోవడానికి, లేదా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చడానికి పవన్ బాగా ఉపయోగపడతారు. కాబట్టే పవన్ తో కేసీఆర్ ప్రత్యేకంగా భేటీ అయినట్టు కనిపిస్తోందని అంచనా వేస్తున్నారు.

అదే సమయంలో పవన్ కళ్యాణ్ కి కూడా అవసరాలున్నాయి. గతంలో తన కామెంట్స్, టీఆర్ఎస్ నేతల ఘాటు కౌంటర్లు ఎలా ఉన్నా, ప్రస్తుతం తన సినిమా విడుదలకు సిద్దమయిన నేపథ్యంలో తెలంగాణా రాష్ట్రంలో ప్రభుత్వ సహకారం అవసరం ఉంటుంది. అందుకే ఓ మెట్టు దిగి వెళ్లి కేసీఆర్ తో ముచ్చట పెట్టినట్టు చెబుతున్నారు. రాజకీయ ప్రయోజనాల రీత్యా కేసీఆర్, ఆర్థిక ప్రయోజనాల రీత్యా పవన్ కళ్యాణ్ కలయికగా దీనిని అభివర్ణిస్తున్నారు. అయితే కారణాలేమయినప్పటికీ జనసేన అధినేత వెళ్లి టీఆర్ఎస్ వ్యవస్థాపకుడితో భేటీ కావడం మాత్రం రాజకీయంగా ప్రభావితం చేసే అంశంగా భావించాలి. వాగ్భాణాలు విసురుకున్న వాళ్లు పూలగుత్తులతో స్వాగతం పలకడం వెనుక ఉమ్మడి ప్రయోజనాలే లక్ష్యంగా అంగీకరించాల్సి ఉంటుంది.


Related News

Rangasthalam_5745

రంగ‌స్థ‌లం స్టోరీ లీక్..

Spread the loveమెగా ప‌వ‌ర్ స్టార్ రామ‌చ‌ర‌ణ్ లేటెస్ట్ మువీ సినిమా రిలీజ్ కి సిద్దం అయ్యింది. వ‌చ్చే వారిRead More

janasena pawan kalyan

ప‌వ‌న్ త‌డ‌బాటు..

Spread the loveజ‌న‌సేనాని త‌డ‌బ‌డుతున్నారు. త‌ప్ప‌ట‌డుగులు వేస్తూ రాజ‌కీయంగా కొంత గంద‌ర‌గోళంలో ఉన్న‌ట్టు క‌నిపిస్తున్నారు. దాంతో ప‌వ‌న్ తీరు చాలామందినిRead More

 • బాల‌య్య హీరోయిన్ పెళ్లి చేసేసుకుంది..
 • ముంద‌స్తు ముప్పు త‌ప్పంది…!
 • రాజ‌కీయాల్లో కీల‌కం కాబోతున్న హీరోయిన్
 • రాజ్య‌స‌భ కోసం బీజేపీకి వైసీపీ తాయిలాలు…!
 • మంత్రి ప‌దవుల కోసం మొద‌ల‌యిన లాబీయింగ్
 • వైసీపీ వ్యూహాత్మ‌క త‌ప్పిద‌మేనా?
 • ఎమ్మెల్యేల‌ను త‌ర‌లిస్తున్న జ‌గ‌న్
 • హాట్ ల‌వ‌ర్స్ బ్రేక‌ప్..!
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *