Main Menu

క‌ర్ణాట‌క బ‌రిలో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌

janasena
Spread the love

దేశ‌మంతా ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న క‌ర్ణాట‌క ఎన్నిక‌ల రంగంలోకి జ‌న‌సేనాని దిగుతున్నారు. ఆయ‌న గ‌డిచిన సాధార‌ణ ఎన్నిక‌ల్లో కూడా క‌ర్ణాట‌క‌లో ప్ర‌చారం నిర్వ‌హించారు. ప‌వ‌ర్ స్టార్ కి క‌న్న‌డిగుల్లో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. ముఖ్యంగా తెలుగు ప్రభావిత జిల్లాల్లో ప‌వ‌న్ కి ఆద‌ర‌ణ ఉంది. దానికి త‌గ్గ‌ట్టుగానే ఈసారి అసెంబ్లీ ఎన్నిక‌ల బ‌రిలో కూడా దిగాల‌ని భావిస్తున్న‌ట్టు తెలుస్తోంది. కాంగ్రెస్, బీజేపీ మ‌ధ్య క‌ర్ణాట‌క గ‌డ్డ మీద పోరు హోరాహోరీగా సాగుతోంది. కాంగ్రెస్ కి చావోరేవో అన్న చందంగా ఉంది. బీజేపీ మ‌ళ్లీ ద‌క్షిణాదిలో ఉనికి చాటుకునే య‌త్నం చేస్తోంది.

ఈ నేప‌థ్యంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ అనూహ్యంగా జ‌న‌తాద‌ళ్ (ఎస్) త‌రుపున ప్ర‌చార‌ప‌ర్వానికి సిద్ద‌మ‌వుతున్నారు. గ‌తంలో జేడీఎస్ అధినేత కుమార‌స్వామి నేరుగా వ‌చ్చి ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో భేటీ అయిన సంగ‌తి తెలిసిందే. వారిద్ద‌రి స్నేహం కొన‌సాగిస్తూ ఈసారి ఎన్నిక‌ల్లో జేడీఎస్ అభ్య‌ర్థుల గెలుపుకోసం ప‌వ‌న్ క్యాంపెయిన్ చేస్తార‌ని కుమార‌స్వామి ప్ర‌క‌టించారు. గ‌డిచిన జ‌న‌ర‌ల్ ఎన్నిక‌ల్లో బీజేపీ అభ్య‌ర్థుల కోసం ప‌వ‌న్ ప్రచారం చేశారు. సానుకూల ఫ‌లితాలు కూడా వ‌చ్చాయి. ఈసారి జేడీఎస్ త‌రుపున సాగించే ప్ర‌చారంలో ఎలాంటి ఫ‌లితాలు వ‌స్తాయో చూడాలి.

అయితే కుమార స్వామి ప్ర‌క‌ట‌న‌ను జ‌న‌సేన ఖండిస్తోంది. పీకేకి అలాంటి ఆలోచ‌న లేద‌ని చెబుతోంది. అదే స‌మ‌యంలో చిక్ బళ్లాపురం, బళ్లారి ప్రాంతాల్లో ఉన్న పవన్ సన్నిహితులు కొంద‌రు స్వతంత్ర అభ్యర్థులుగా రంగంలో దిగే అవ‌కాశం ఉంది. వారి కోసం ప‌వ‌న్ క్యాంపెయిన్ చేస్తార‌నే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. జ‌న‌సేన నుంచి అధికారిక ప్ర‌క‌ట‌న రాక‌పోయిన‌ప్ప‌టికీ క‌ర్ణాట‌క‌లో మాత్రం ప‌వ‌న్ ప్ర‌చారంపై క‌థ‌నాలు వినిపిస్తుండ‌డం విశేషం.






Related News

jd lakshminarayana

అగ‌మ్య‌గోచ‌రంగా మారిన జేడీ ప‌య‌నం

Spread the loveసీబీఐ అధికారిగా ఏపీలో మంచి ఆద‌ర‌ణ సాధించిన జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ సందిగ్ధంలో ప‌డ్డారు. త‌న రాజ‌కీయ భ‌విత‌వ్యంపైRead More

YS jagan (1)

వైసీపీకి వాళ్లంతా చేజారిన‌ట్టేనా?

Spread the loveఏపీలో ముఖాముఖీ పోరు జ‌ర‌గాల‌ని జ‌గ‌న్ ఆశించారు. దానికి త‌గ్గ‌ట్టుగా ప‌రిస్థితులు సాగిన‌ప్ప‌టికీ చివ‌రిలో ప‌లు మార్పులుRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *