Main Menu

ఆ ఉచ్చులో ప‌డ‌ని ఎన్టీఆర్

Spread the love

నంద‌మూరి తార‌క‌రామారావు పేరు, రూపు మాత్ర‌మే కాకుండా, టాలీవుడ్ లో ఆయ‌న కీర్తిని కూడా నిల‌బెట్టే స్థాయిలో జూనియ‌ర్ ఎన్టీఆర్ వ్య‌వ‌హారం ఉంటుంది. అయితే ఆయ‌న క‌న్ను మాత్రం రాజ‌కీయాల‌పైనే ఉంటుంద‌న్న‌ది కాద‌న‌లేని స‌త్యం. గ‌తంలోనే పొలిటిక‌ల్ స్క్రీన్ మీద హ‌ల్ చ‌ల్ చేసిన ఎన్టీఆర్ కొన్నేళ్ల తర్వాతైనా ఫుల్ టైమ్ పొలిటీషియ‌న్ కావాల‌న ఆకాంక్ష‌తో ఉన్న‌ట్టు ఆయ‌న తీరు చాటిచెబుతుంటుంది.

అయితే ఎన్టీఆర్ వ్య‌వ‌హార‌శైలి టీడీపీ అధినేత చంద్ర‌బాబుకి గిట్ట‌ద‌నే ప్ర‌చారం ఉంది. అంత‌కుమించి నారా లోకేష్ ఏమాత్రం స‌హించ‌లేర‌నే ప్ర‌చారం చాలాకాలంగా ఉంది. గ‌తంలో ఎన్టీఆర్ సినిమాల‌కు థియేట‌ర్ లు ఇవ్వ‌కుండా, ప్ర‌త్యేక రాయితీలు ద‌క్కకుండా ఆంధ్ర‌ప్ర‌దేశ్ వ్య‌వ‌హ‌రించిన తీరు చాలామంది మ‌ర‌చిపోలేదు. ఈ నేప‌థ్యంలోనే కూక‌ట్ ప‌ల్లి వంటి టీడీపీ బ‌ల‌హీనంగా ఉన్న నియోజ‌క‌వ‌ర్గంలో నంద‌మూరి సుహాసిని బ‌రిలో దింప‌డం ద్వారా ఎన్టీఆర్ ని కూడా ఉచ్చులో లాగాల‌ని చంద్ర‌బాబు ఎత్తులు వేసిన‌ట్టు చాలామంది భావిస్తున్నారు.

ఈ విష‌యాన్ని ఎన్నిక‌ల ప్ర‌చారంలో కేటీఆర్ ప్ర‌స్తావించారు కూడా. కేవ‌లం సుహాసిని ని బ‌లిప‌శువు చేసేందుకే చంద్ర‌బాబు బ‌రిలో దింపార‌ని ఆయ‌న విమ‌ర్శించారు. రాజ‌కీయ విమ‌ర్శ‌లు ఎలా ఉన్న‌ప్ప‌టికీ ఫ‌లితాల త‌ర్వాత ప‌రిస్థితి అదే నిజ‌మ‌ని చాటుతోంది.భారీ తేడాతో కూక‌ట్ ప‌ల్లి సీటులో సుహాసిని ఓట‌మి త‌ర్వాత ఎన్టీఆర్ ని ప్ర‌చారానికి దింపాల‌ని టీడీపీ నేత‌లు చేసిన ఒత్తిడికి త‌లొగ్గ‌కుండా నిబ‌ద్ధ‌త‌తో నిల‌బ‌డం తార‌క్ వ్యూహ‌చ‌తుర‌త‌కు నిద‌ర్శ‌నంగా భావిస్తున్నారు.

గ‌తంలో 2009 ఎన్నిక‌ల్లో బ‌రిలో దిగి చేతులు కాల్చుకున్న ఎన్టీఆర్ ఈసారి మాత్రం ఆచితూచి వ్య‌వ‌హ‌రించ‌డం ద్వారా త‌న ప‌రిణ‌తి చాటుకున్నారు. సొంత సోద‌రి అయిన‌ప్ప‌టికీ బంధుత్వం వేరు, రాజ‌కీయాలు వేరని చాటుకున్నారు. త‌ద్వారా ఆ ఉచ్చుకి చిక్క‌కుండా త‌న ప‌ర‌ప‌తి కాపాడుకున్నారు. నంద‌మూరి హ‌రికృష్ణ మీద అంత ప్రేమ ఉంటే సుహాసినికి ఏపీలో ఏదో ప‌ద‌వి క‌ట్ట‌బెట్ట‌వ‌చ్చు క‌దా అన్న ప్ర‌శ్న‌కు టీడీపీ నేత‌లు స‌మాధానం కూడా చెప్ప‌లేని పరిస్థితుల్లో ఎన్టీఆర్ మౌనం ఆయ‌న భ‌విష్య‌త్తుకి ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని అంతా చెబుతున్నారు. మొత్తంగా చిన్న ఎన్టీఆర్ పెద్ద మ‌న‌సుతో ఆలోచించి తీసుకున్న నిర్ణ‌యం టీడీపీ రాజ‌కీయాల్లో ఎప్ప‌టికైనా కీల‌కంగా మారే అవ‌కాశం లేక‌పోలేద‌ని చెప్ప‌వ‌చ్చు. ప్ర‌స్తుతం టాలీవుడ్ కెరీర్ కి, త‌ర్వాత పొలిటిక‌ల్ కెరీర్ కి త‌గ్గ‌ట్టుగా ఎన్టీఆర్ తీసుకున్న నిర్ణ‌యాన్ని ప‌లువురు అబినందిస్తున్నారు.






Related News

డైరెక్ట‌ర్ ర‌వితేజ‌..హీరో క‌ళ్యాణ్ రామ్!

Spread the loveరవితేజ కెరీర్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా ప్రారంభమైన విషయం విదితమే. హీరోగా రాణిస్తూ అగ్ర నటుల్లో ఒకరిగా నిలిచినRead More

ఆలియా కే ఆర్ఆర్ఆర్

Spread the loveబాలీవుడ్ బ్యూటీ ఎంట్రీ ఖాయం అయ్యింది. గ‌తంలోనే ప‌లు సినిమాల‌లో అనుకున్న‌ప్ప‌టికీ ఆటంకాలు వ‌చ్చాయి. కానీ ఇప్పుడుRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *