Main Menu

ఎన్టీఆర్ పై చంద్ర‌బాబు ఒత్తిడి ప‌నిచేస్తుందా..?

Spread the love

నంద‌మూరి తార‌క‌రామారావు మీద టీడీపీ ఆశ‌లు పెట్టుకుంది. అయితే ఎన్టీఆర్ మాత్రం స‌సేమీరా అంటున్నారు. సొంత సోద‌రి బ‌రిలో దిగిన‌ప్ప‌టికీ తాను మాత్రం ప్ర‌చారానికి సిద్ధం కాలేనంటూ చెప్ప‌డం విశేషంగా మారింది. ఇప్ప‌టికే టీడీపీ అధినేత కూడా ప్ర‌య‌త్నాలు చేసినా యంగ్ టైగ‌ర్ నిరాక‌రించిన‌ట్టు చెబుతున్నారు. తాజాగా సోద‌రుడి కోసం సుహాసిని కూడా ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్టు భావిస్తున్నారు. ఆమె స్వ‌యంగా ఎన్టీఆర్ కి ఫోన్ చేసి త‌న‌కు స‌హ‌క‌రించాల‌ని కోరిన‌ట్టు చెబుతున్నారు.

అయితే ఎన్టీఆర్ మాత్రం రాజ‌కీయంగా తాను ప్ర‌చారం బ‌రిలోకి దిగితే ప‌రిణామాలు ఎలా ఉంటాయా అని అంచ‌నాలు వేసుకుంటున్న‌ట్టు చెబుతున్నారు. గ‌తంలో తాను స్వ‌యంగా ఎంతోక‌ష్ట‌ప‌డి పార్టీ కోసం ప‌నిచేస్తే ఆ త‌ర్వాత త‌న‌కు తీర‌ని అన్యాయం చేసిన చంద్ర‌బాబు , ఆయ‌న త‌న‌యుడికి స‌హ‌క‌రించే విధంగా వ్య‌వ‌హ‌రిస్తే త‌ర్వాతి ప‌రిణామాలు ఎలా ఉంటాయోన‌నే అంచ‌నాకు రాలేక‌పోతున్న‌ట్టు స‌మాచారం. గ‌తంలో నాన్న‌కు ప్రేమ‌తో సినిమా విడుద‌ల సంద‌ర్భంగా కొన్ని థియేట‌ర్ల‌లో అనుమ‌తి కూడా లేకుండా చేసిన ఏపీ ప్ర‌భుత్వ పెద్ద‌ల వ్య‌వ‌హారాన్ని ఎన్టీఆర్ కూడా గుర్తు చేసుకుంటున్నార‌ని స‌మాచారం.

కెరీర్ పీక్ లో ఉన్న ద‌శ‌లో టీఆర్ఎస్ వంటి పార్టీకి వ్య‌తిరేకంగా ముందుకు సాగ‌డం భ‌విష్య‌త్ కి శుభ‌సూచికం కాద‌ని కొంద‌రు స‌న్నిహితులు ఎన్టీఆర్ కి సూచింనిట్టు తెలుస్తోంది. అదే స‌మ‌యంలో సొంత అక్క బ‌రిలో ఉండ‌డంతో త‌నతో పాటు నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ కూడా ట్వీట్స్ చేసి మ‌ద్ధ‌తు ప్ర‌క‌టించామ‌ని అంత‌కు మించి ఏమి చేయ‌గ‌ల‌మ‌న్న అంచ‌నాలో అన్న‌ద‌మ్ములు ఉన్నార‌ని భావిస్తున్నారు. పోటీకి దిగేముందు త‌మ అభిప్రాయం తెలుసుకోకుండానే చివ‌ర‌కు బాల‌కృష్ణ‌తో క‌లిసి నామినేష‌న్ ప‌త్రాలు స‌మ‌ర్పించేందుకు సిద్ధ‌మ‌యిన సోద‌రికి అన్ని ర‌కాలుగా మ‌ద్ధతు ఉంటుంద‌ని ప్ర‌క‌టించినందున అత‌కుమించి ఏం చేయ‌గ‌ల‌మ‌న్న ప్ర‌శ్న ఎన్టీఆర్ శిబిరం నుంచి వినిపిస్తోంది.

అదే స‌మ‌యంలో కూక‌ట్ ప‌ల్లి ఫ‌లితాలు ఆంద్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల‌కు నిలువుట‌ద్దంలా మారిన త‌రుణంలో టీడీపీ ప్ర‌తిష్టాత్మ‌కంగా భావిస్తోంది. ఇప్ప‌టికీ టీఆర్ఎస్ బ‌లంగా ఉన్న త‌రుణంలో కూక‌ట్ ప‌ల్లిలో టీడీపీకి వ్య‌తిరేకంగా జ‌న‌సేన‌, వైసీపీ కూడా ప్ర‌య‌త్నాలు చేస్తున్నాయి. దాంతో కూక‌ట్ ప‌ల్లిలో గెలుపు ఏపీలో టీడీపీకి అత్య‌వ‌స‌రంగా మారిన‌ట్టు అంచ‌నాలు వేస్తున్నారు. దాంతో ఎన్టీఆర్ మీద మ‌రింత ఒత్తిడి తెచ్చే ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. అయినా ప్ర‌చారం చివ‌రి అంకానికి చేరిన త‌రుణంలో వేలు పెట్ట‌డం శ్రేయ‌స్క‌రం కాద‌ని తార‌క్ భావిస్తున్నారు. చివ‌ర‌కు ఆయ‌న ఒత్తిడికి త‌లొగ్గి ఏదో ఒక‌రోజు బ‌య‌ట‌కు వ‌స్తారా లేక క‌ళ్యాణ్ రామ్ మాదిరిగా భార్య‌ను పంపించి చేతులు దులుపుకుంటారా అన్న‌ది చూడాలి.


Related News

ప్రేమ- పెళ్లి- విడాకులు- మ‌ళ్లీ పెళ్లి

Spread the loveకొంతకాలం కిందట అధికారికంగా విడిపోయిన మలైకా ఆరోరా- అర్బాజ్ ఖాన్ లు ఇప్పుడు మళ్లీ పెళ్లికి రెడీRead More

సీనియ‌ర్ నేత‌పై జ‌గ‌న్ సీరియ‌స్..!

Spread the loveవైసీపీ నేత‌ల తీరు అధిష్టానానికి ఆగ్ర‌హం క‌లిగిస్తోంది. ముఖ్యంగా కొంద‌రు సీనియ‌ర్ నేత‌ల వ్య‌వ‌హారం జ‌గ‌న్ కిRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *