ఎన్టీఆర్ కి నో చెప్పిన నిత్యామీనన్

nitya menon
Spread the love

సంచలన హీరోయిన్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఎన్టీఆర్ సినిమాకు నో చెప్పేసింది. దాంతో అది టాలీవుడ్ లో హాట్ టాపిక్ అవుతోంది. అయితే ఆమె నో చెప్పింది జూనియర్ ఎన్టీఆర్ సినిమాకి మాత్రం కాదు. అది సీనియర్ ఎన్టీఆర్ బయో పిక్ కి మాత్రమే. విఖ్యాత నట స్వారభౌమ నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. తనయుడు నందమూరి బాలకృష్ణ టైటిల్ పాత్రలో ఈ సినిమా రూపుదిద్దుకుంటుంది. తేజ దర్శకుడు.

ఎన్టీఆర్ జీవితం ఓ క‌థగా చెప్పాల్సి వ‌స్తే భార్య బ‌స‌వ‌తార‌కం పాత్రకి ప్రత్యేక స్థానం ఉంది. ఇప్పుడు ఎన్టీఆర్ బ‌యోపిక్ లో బస‌వ‌తార‌కం పాత్ర‌కు గానూ చాలామంది కథానాయిక‌ల పేర్లు ప‌రిశీలిస్తున్నారు. అందులో భాగంగా చిత్ర‌బృందం నిత్య‌మీన‌న్‌ని సంప్ర‌దించిన‌ట్టు తెలుస్తోంది. అయితే ముందు ఈ క‌థ‌లో న‌టించ‌డానికి ‘ఓకే’ చెప్పేసిన నిత్య‌.. ఒక‌ట్రెండు రోజుల్లోనే త‌న నిర్ణ‌యాన్ని మార్చుకున్న‌ట్టు ప్రచారం సాగుతోంది. ఐతే దీనికి గల కారణాలు మాత్రం తెలియడం లేదు. అది చర్చనీయాంశంగా మారింది. మొదట నిత్యను అనుకున్న దర్శకుడు ఇప్పుడు నో చెప్పడంతో మరో కధానాయిక వేటలో పడ్డాడని తెలుస్తుంది. ఆ అవకాశం మరోసారి శ్రియను చేరే అవకాశం కూడా లేకపోలేదనే వాదన ఉంది.






Related News

kamineni

క‌మ‌లానికి కామినేని గుడ్ బై

Spread the loveఏపీలో బీజేపీ ఇద్ద‌రు మంత్రులు చెరోదారిలో సాగుతున్నారు. రాష్ట్రంలో బీజేపీని బ‌ద్నాం చేయ‌డానికి టీడీపీ ప్ర‌య‌త్నిస్తున్న‌ప్ప‌టికీ మంత్రిRead More

cbn

మ‌ళ్లీ చంద్ర‌బాబు వెన‌క‌డుగు…

Spread the loveఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు మ‌రోసారి వెన‌క‌డుగు వేశారు. ఆయ‌న ప్ర‌క‌టించిన దానికి భిన్నంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఏపీRead More

  • నీర‌వ్ కోసం మోడీ చేసిన మేలు తెలుసా…?
  • బీజేపీ బంధంపై టీడీపీలో విబేధాలు
  • శ్రియ పెళ్లికూతురవుతోంది..
  • ఎన్టీఆర్ కి నో చెప్పిన నిత్యామీనన్
  • టాలీవుడ్ స్టార్ ప్రేమలో రకుల్?
  • మోడి మెలిక: బాబు కినుక!
  • పోర్న్ స్టార్లపై పూనమ్ కౌర్ సంచలన వ్యాఖ్యలు
  • ప్రభాస్ సినిమా సెట్లో అనుష్క
  • Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *