మంత్రి ప‌దవుల కోసం మొద‌ల‌యిన లాబీయింగ్

625109-shah-modi-bir-bahadur
Spread the love

ఏపీకి ప్ర‌త్యేక హోదా పుణ్యాన రాజ‌కీయ ప‌రిణామాలు కూడా వేగంగా మారుతున్నాయి. కొత్త దిశ‌లో సాగుతున్నాయి. తాజాగా ఇరు ప్ర‌భుత్వాల్లోనూ మంత్రుల రాజీనామాల‌తో ప‌లు బెర్తులు ఖాళీ అయ్యాయి. దాంతో అప్పుడే లాబీయింగ్ మొద‌ల‌యిన‌ట్టు క‌నిపిస్తోంది. ముఖ్యంగా కేంద్రంలో ఏపీ నుంచి క్యాబినెట్ లో ప్రాతినిధ్య‌మే లేకుండా పోయింది. ఇప్ప‌టికే తెలంగాణా నుంచి కూడా క్యాబినెట్ ఖాళీ కావ‌డంతో ఇరు తెలుగు రాష్ట్రాల‌కు మోడీ మంత్రి వ‌ర్గంలో అవ‌కాశం క‌ల్పించాల్సిన అవ‌స‌రం ఏర్ప‌డింది. దాంతో త్వ‌ర‌లోనే బీజేపీ నేత‌ల‌కు మంత్రివ‌ర్గంలో అవ‌కాశం ద‌క్క‌వ‌చ్చ‌నే ఊహాగానాలు మొద‌ల‌య్యాయి.

అయితే ఆ సీటు ఎవ‌రికి ద‌క్కుతుంద‌నే అంశంలో విస్తృతంగా ఊహాగానాలు మొద‌ల‌య్యాయి. ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ నుంచి బీజేపీలోకి వ‌చ్చిన రామ్ మాధావ్, జీవీఎల్ న‌ర‌సింహ‌రావు గ‌ట్టి ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్టు ప్ర‌చారం సాగుతోంది. పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శులుగా ఉన్న ఇద్ద‌రునేత‌లు కీలకంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. అమ‌లాపురం ప్రాంతానికి చెందిన రాం మాధ‌వ్ ఇటీవ‌ల ఈశాన్య రాష్ట్రాల విజ‌యంలో కీల‌క భూమిక పోషించారు. జీవీఎల్ కూడా ఢిల్లీ కేంద్రంగా నిత్యం పావులు క‌దుపుతున్నారు. ద‌క్షిణాది రాష్ట్రాల వ్య‌వ‌హారాల్లో ప్ర‌ధానంగా ముందుంటున్నారు. దాంతో వారిద్ద‌రిలో ఒక‌రికి మంత్రి ప‌ద‌వి ద‌క్క‌వ‌చ్చ‌నే అంచ‌నాలు క‌నిపిస్తున్నాయి.

అదే స‌మయంలో న‌ర్సాపురం ఎంపీ, విశ్వ‌హిందూప‌రిష‌త్ నాయ‌కుడు గోక‌రాజు గంగ‌రాజు కూడా గ‌ట్టిగా ఆశిస్తున్నారు. ఆయ‌న తొలిసారిగా పార్ల‌మెంట్ కి ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు. అయిన‌ప్ప‌టికీ త‌న‌కు మంత్రి ప‌ద‌వి కేటాయించాల‌ని ఆయ‌న కోరుతున్న‌ట్టు స‌మాచారం. అదే స‌మ‌యంలో సామాజిక స‌మీక‌ర‌ణాల నేప‌థ్యంలో కీల‌క‌మైన క‌మ్మ వ‌ర్గం నుంచి త‌న‌కు అవ‌కాశం ఉంటుంద‌ని హ‌రిబాబు కూడా ఆశిస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఏపీ రాజ‌కీయాల్లో క్ష‌త్రియ వ‌ర్గానికి చెందిన గంగ‌రాజు క‌న్నా క‌మ్మ వ‌ర్గానికి చెందిన హ‌రిబాబుకే అవ‌కాశాలుండ‌వ‌చ్చ‌ని భావిస్తున్నారు. విశాఖ నుంచి విజ‌యం సాధించిన హ‌రిబాబు, ప్ర‌స్తుతం ఏపీ బీజేపీ అధ్య‌క్షుడిగా కూడా ఉన్నారు. మ‌రో కీల‌క బాధ్య‌త‌లు ఆయ‌న‌కు ద‌క్కుతాయా అన్న అనుమానం కూడా వినిపిస్తోంది. దాంతో ప్ర‌స్తుతం న‌లుగురు ప్ర‌ధానంగా ఆశిస్తున్న నేప‌థ్యంలో ఏపీ నుంచి ఎవ‌రికి ఛాన్స్ ఉంటుందోననే చ‌ర్చ మొద‌ల‌య్యింది. అదే స‌మ‌యంలో తెలంగాణా నుంచి బండారు ద‌త్తాత్రేయ మ‌రోసారి ఆశిస్తున్న‌ట్టు క‌నిపిస్తోంది. ఆయ‌క‌న్నా ముర‌ళీధ‌ర్ రావు కి మొగ్గు ఉంటుంద‌ని హ‌స్తిన క‌మ‌ల‌నేత‌ల్లో ప్రచారం సాగుతోంది. అస‌లు మోడీ క‌రుణ ఎవ‌రికి ల‌భిస్తుంద‌న్న‌ది చ‌ర్చనీయాంశం అవుతోంది.


Related News

Rangasthalam_5745

రంగ‌స్థ‌లం స్టోరీ లీక్..

Spread the love1Shareమెగా ప‌వ‌ర్ స్టార్ రామ‌చ‌ర‌ణ్ లేటెస్ట్ మువీ సినిమా రిలీజ్ కి సిద్దం అయ్యింది. వ‌చ్చే వారిRead More

janasena pawan kalyan

ప‌వ‌న్ త‌డ‌బాటు..

Spread the loveజ‌న‌సేనాని త‌డ‌బ‌డుతున్నారు. త‌ప్ప‌ట‌డుగులు వేస్తూ రాజ‌కీయంగా కొంత గంద‌ర‌గోళంలో ఉన్న‌ట్టు క‌నిపిస్తున్నారు. దాంతో ప‌వ‌న్ తీరు చాలామందినిRead More

 • బాల‌య్య హీరోయిన్ పెళ్లి చేసేసుకుంది..
 • ముంద‌స్తు ముప్పు త‌ప్పంది…!
 • రాజ‌కీయాల్లో కీల‌కం కాబోతున్న హీరోయిన్
 • రాజ్య‌స‌భ కోసం బీజేపీకి వైసీపీ తాయిలాలు…!
 • మంత్రి ప‌దవుల కోసం మొద‌ల‌యిన లాబీయింగ్
 • వైసీపీ వ్యూహాత్మ‌క త‌ప్పిద‌మేనా?
 • ఎమ్మెల్యేల‌ను త‌ర‌లిస్తున్న జ‌గ‌న్
 • హాట్ ల‌వ‌ర్స్ బ్రేక‌ప్..!
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *