ఆ హీరోయిన్ రెమ్యునేషన్ 6 కోట్లు

nayan
Spread the love

ఆశ్చర్యమే అయినా సౌత్ ఇండియాలో టాప్ హీరోయిన్ గా మారుతోంది నయనతార. సీనియర్ హీరోయిన్ గా ఉన్నప్పటికీ తరగని ఇమేజ్ తో భారీ ఆఫర్లు సంపాదిస్తోంది. దానికి తగ్గట్టుగానే రెమ్యునేషన్ విషయంలోనూ రాజీ లేకుండా వ్యవహరిస్తోంది. సౌత్ లో సూపర్ స్టార్ హీరోయిన్ గా మారుతోంది.

నయనతారను గజని, బిల్లా, యారడీ, నీ మోహినీ, బాస్‌ ఎన్గిర భాస్కరన్‌, రాజారాణి వంటి చిత్రాల విజయం ఈ బ్యూటీని టాప్ హీరోయిన్‌ రేంజ్‌లో కూర్చోబెట్టాయి. మధ్యలో లవ్ ఎఫైర్లతో కెరీర్ కొంత గందరగోళంగా మారినా మళ్లీ ట్రాక్ ఎక్కడానికి ఎక్కువ సమయం పట్టలేదు. కాగా ప్రస్తుతం నటిస్తున్న ఇమైకానోడిగళ్‌ చిత్రానికి నాలుగు కోట్లు పారితోషికం పుచ్చుకుందనే టాక్‌ కోలీవుడ్‌ వర్గాల్లో ఉంది. నయనతారకు కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ మంచి క్రేజ్‌ ఉంది. శ్రీరామరాజ్యం, సింహా వంటి చిత్రాలు మంచి ఇమేజ్‌ను కట్టబెట్టాయి. తాజాగా మెగాస్టార్‌ చిరంజీవికి జంటగా నటించే అవకాశం ఈ ముద్దుగుమ్మను వరించింది. చరిత్ర వీరయోధుడి జీవిత కథతో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సైరా నరసింహారెడ్డి అనే టైటిల్‌ను నిర్ణయించారు.

ఈ సినిమాలో చిరంజీవితో పాటు, బాలీవుడ్‌ బిగ్‌ బీ, శాండిల్‌వుడ్‌ సుధీప్, కోలీవుడ్‌ యువ నటుడు విజయ్‌సేతుపతి అంటూ భారతీయ నటీనటుల మేలి కలయికలో రూపొందుతోంది. ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటించడానికి నయనతార ఆరు కోట్ల పారితోషికాన్ని డిమాండ్‌ చేసినట్లు ప్రచారం సోషల్‌ మీడియాల్లో హల్‌చల్‌ చేస్తోంది. సైరా నరసింహారెడ్డి చిత్రం తెలుగు, కన్నడం, హిందీ భాషల్లో తెరక్కుతున్న భారీ చిత్రం కావడం, కాల్‌షీట్స్‌ అవసరం అవ్వడంతో నయనతార అంతే స్థాయిలో పారితోషికం డిమాండ్‌ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. మరి ఇందులో నిజం ఎంత అన్నది ఆ చిత్ర వర్గాలకే తెలుసు.






Related News

ntr

త్రివిక్రమ్ తో ఎన్టీఆర్ తగాదా..

Spread the loveస్టార్ డైరెక్టర్ తో యంగ్ టైగర్ వ్యవహారం వీధికెక్కింది. సినిమా షూటింగ్ కూడా ప్రారంభించిన తర్వాత ఇద్దరిRead More

jeevitha_1500457625

హీరోయిన్ అవుతున్న హీరోగారమ్మాయి…

Spread the loveప్రముఖ నటుడు రాజశేఖర్‌ పెద్ద కుమార్తె శివాని హీరోయిన్ అవతారం ఎత్తనున్నారు. తమిళ చిత్ర రంగానికి శివానిRead More

  • మహేష్ 27లో మళ్లీ ఆ దర్శకుడితో…
  • సన్నీలియోన్ తో సప్తగిరి పెళ్లి..!
  • రామ్ చరణ్ కి థర్డ్ ప్లేస్
  • పొట్టిదనం జగన్ కి పేరు తెస్తుందా?
  • పవన్ తో గుడ్ కంపెనీ, గుడ్ వర్క్..
  • యనమల వియ్యంకుడికి నిరాశ..
  • జగన్ యాత్ర మళ్లీ వాయిదా వేయాల్సిందేనా?
  • ఇల్లూ బేబీ పెళ్లి…
  • Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *