Main Menu

నంద్యాలపై నారా లోకేష్ క‌న్ను!

Spread the love

కర్నూలు జిల్లా రాజకీయం వేడెక్కుతోంది. నంద్యాల నియోజకవర్గం నుండి పంచాయతీరాజ్‌శాఖ మంత్రి నారా లోకేష్‌ పోటీచేస్తారనే ప్రచారం ఊపందుకుంది. ఈ వ్యవహారంపైనే ఇటీవల మంత్రి అఖిలప్రియ అలిగి భద్రతా సిబ్బందిని వెనక్కు పంపించారు. నంద్యాల ఉప ఎన్నికల సమయంలో మంత్రి లోకేష్‌ మొత్తం కార్యక్రమాన్ని సమన్వయం చేశారు. అక్కడ టిడిపి అభ్యర్థి బ్రహ్మనందరెడ్డి 25 వేల మెజార్టీ సాధించారు. నంద్యాల నియోజకవర్గంతో నేరుగా సత్సంబంధాలు ఏర్పాటు చేసుకున్నారు. దీంతో ఈ సారి అక్కడ నుండి పోటీచేయాలనే ఆలోచనతో ఉన్నట్లు తెలిసింది. అయితే లోకేష్‌ గుంటూరు జిల్లా మంగళగిరి, అనంతపురం జిల్లా హిందూపురం, సొంత నియోజకవర్గమైన కుప్పంతోపాటు నంద్యాలను ఆప్షన్‌గా పెట్టుకున్నారు. హిందూపురంలో బాలకృష్ణపై తీవ్ర వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో ఆయన్ను ఎమ్మెల్సీగా పంపించాలనే ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. లోకేష్‌ మాత్రం నంద్యాల నియోజకవర్గంపై ఎక్కువ దృష్టి సారించారనే వార్తలు వస్తున్నాయి. ఒకటీ రెండు రోజుల్లో లిస్టు తయారవుతుండటంతో ఇప్పుడు ఈ వ్యవహారం చర్చనీయాంశం అయింది. దీనిపై ఇప్పటికే ఒక విడత చర్చించిన అధిష్టానం నంద్యాలలో బ్రహ్మానందరెడ్డికి అవకాశం ఇవ్వాలా, లేదా లోకేష్‌ను పోటీచేయించాలా అనే అంశంపై ఒకటీ రెండు రోజుల్లో స్పష్టం చేసే అవకాశమున్నట్లు తెలిసింది.

దీనిపై చర్చ జరిగిన సమయంలోనే తన అన్న బ్రహ్మానందరెడ్డికి తిరిగి అవకాశం ఇవ్వాలని అఖిలప్రియ పట్టుబట్టినట్లు సమాచారం. ఆలోచించి చెబుతామని, అప్పటి వరకూ ఎవరూ దాని గురించి ఆలోచించొద్దని పార్టీ ఆదేశించినట్లు తెలిసింది. నంద్యాలలో కీలకంగా ఉన్న భూమా నాగిరెడ్డి ముఖ్య అనుచరుడు ఎ.వి.సుబ్బారెడ్డిని ఎపి సీడ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా నియమిం చడంతోపాటు చంద్రబాబు పూర్తి మద్దతు తెలిపారు. ఇది కూడా అఖిలప్రియకు నచ్చడం లేదు. సుబ్బారెడ్డి ముందుకొచ్చిన తరువాత తమను ద్వితీయస్థాయి నాయకత్వంగానే చూస్తున్నారనే అభిప్రా యం భూమా కుటుంబం నుండి వ్యక్తమవుతోంది. నంద్యాల నుండి లోకేష్‌ పోటీచేస్తారనే ప్రచారం రావడంతో అఖిలప్రియ మేనమామ, కర్నూలు ఎమ్మెల్యే ఎస్‌వి మోహన్‌రెడ్డి తెలివిగా పావులు కదుపుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ లోకేష్‌ నంధ్యాల రావడం ఖాయమని తెలిసిన తరువాత మోహన్‌రెడ్డి తన మనుసులో మాట బయటపెట్టారు. లోకేష్‌ కర్నూలు నుండి పోటీచేస్తే తాను తప్పుకుంటానని చెప్పారు.

నంద్యాల, ఆళ్లగడ్డ భూమా కుటుంబానికి సొంత నియోజకవర్గాలు కావడంతో అక్కడ నుండి భూమా కుటుంబ సభ్యులను పక్కనబెడితే రాజకీయంగా నష్టం వాటిల్లుతుందనే ఆలోచనలో ఎస్‌వి ఉన్నట్లు తెలిసింది. మరోవైపు నంద్యాల విషయంలో భూమా కుటుంబంతో పొరపొచ్చలు వచ్చిన తరువాతే లోకేష్‌ నేరుగా కోట్ల కుటుంబాన్ని రంగంలోకి తెచ్చారనే ప్రచారం జరుగుతోంది. మరోవైపు కర్నూలు విషయంలో ఎస్‌వి మోహన్‌రెడ్డికి, రాజ్యసభ సభ్యులు టి.జి.వెంకటేష్‌కు మధ్య వైరుధ్యం పెరిగింది. టిజి తన కుమారుడికి కర్నూలు సీటు ఇప్పించాలని కోరుతున్నారు. సీటు ఇప్పిస్తే పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో రెండు మూడు నియోజకవర్గాల ఖర్చు పెట్టుకుంటానని జిల్లా నాయకత్వంతో చర్చించినట్లు సమాచారం. కోట్ల కుటుంబం కూడా కర్నూలు పార్లమెంటు, అసెంబ్లీ సీటు కోరుతోంది. ఈ రూపంలో ప్రస్తుత కర్నూలు ఎమ్మెల్యేగా ఉన్న ఎస్‌వి మోహన్‌రెడ్డికి ఇంటిపోరు ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో ఒకే దెబ్బకు రెండు పిట్టలన్నట్లు ఎస్‌వి మోహన్‌రెడ్డి లోకేష్‌ అస్త్రాన్ని కర్నూలు మీద ప్రయోగించారనే ప్రచారం జరుగుతోంది.


Related News

డైరెక్ట‌ర్ ర‌వితేజ‌..హీరో క‌ళ్యాణ్ రామ్!

Spread the loveరవితేజ కెరీర్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా ప్రారంభమైన విషయం విదితమే. హీరోగా రాణిస్తూ అగ్ర నటుల్లో ఒకరిగా నిలిచినRead More

ఆలియా కే ఆర్ఆర్ఆర్

Spread the loveబాలీవుడ్ బ్యూటీ ఎంట్రీ ఖాయం అయ్యింది. గ‌తంలోనే ప‌లు సినిమాల‌లో అనుకున్న‌ప్ప‌టికీ ఆటంకాలు వ‌చ్చాయి. కానీ ఇప్పుడుRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *