Main Menu

నారా లోకేష్ ఎందుకు దూర‌మయ్యారు?

nara lokesh
Spread the love

ఇదే చ‌ర్చ సాగుతోంది. ఆస‌క్తిక‌రంగా మారుతోంది. టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఆయ‌న‌. ఏపీలో కీల‌క శాఖ‌లు నిర్వ‌హిస్తున్న మంత్రి ఆయ‌న‌. అంత‌కుమించి భూమా అఖిల‌ప్రియ‌తో స‌న్నిహితంగా మెలుగుతున్నారాయ‌న‌. అందుకే చెల్లి రంగంలో ఉంటే అన్న‌య్య దూరంగా ఎందుకుంటున్నారా అనే సందేహం వ‌స్తోంది. పార్టీ యావ‌త్తు అక్క‌డే ఉంటే ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ప‌త్తా లేక‌పోవ‌డం చ‌ర్చ‌కు దారితీస్తోంది. మంత్రులంతా నంద్యాల‌లో ఉంటే ఆయ‌న మాత్రం క‌నిపించ‌డం లేదేమిటా అనే అనుమానం వ‌స్తుంది. పార్టీ అధినేత‌గా ఉన్న తండ్రి పూర్తిగా నంద్యాల కోసం క‌స‌ర‌త్తులు చేస్తుంటే త‌న‌యుడు లోకేష్ ని ఎందుకు దూరంగా పెడుతున్నారా అనే ఆస‌క్తి ఎదుర‌వుతోంది. కార‌ణాలేమ‌యినా నంద్యాల ఉప ఎన్నిక‌ల వేడిలో చిన‌బాబుకి చోటు ద‌క్క‌క‌పోవ‌డం విశేష‌మే.

అయితే నెల రోజుల క్రితం క‌ర్నూలు జిల్లాలో నారా లోకేష్ ప‌ర్య‌ట‌న ఆయ‌న ప‌రువు తీసింది. బ‌హిరంగ‌స‌భ‌లోనే రాయ‌ల‌సీమ‌కు 5ల‌క్ష‌ల ఉద్యోగాలు క‌ల్పించామ‌ని ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు దుమారం రేపాయి. స‌భ‌లోనే ప‌లువురు స్థానికులు నిల‌దీయ‌డంతో లోకేష్ నోట మాట‌రాలేదు. ఆత‌ర్వాత రోడ్డు మీద కూడా నిరుద్యోగ‌భృతి కోసం నిల‌దీసిన అనుభ‌వం ఉంది. ఇలా ప‌లువురు ఆయ‌న్ని అడ్డుకోవ‌డంతో లోకేష్ ప‌ర్య‌ట‌న లాభం క‌న్నా న‌ష్ట‌మే ఎక్కువ చేసింద‌నే అభిప్రాయం పార్టీ నేత‌ల్లో ఉంది. ఆ అనుభ‌వంతోనే ఆయ‌న్ని దూరంగా పెడుతున్నారా అనే భావ‌న క‌లుగుతోంది. దానికితోడుగా గ‌తంలో జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల అనుభ‌వం కూడా ఉంది. అప్ప‌ట్లో లోకేష్ కి బాధ్య‌త‌లు అప్ప‌గిస్తే కేవలం ఒకే ఒక్క కార్పోరేట‌ర్ సీటుతో టీడీపీ ప‌రువు మూసీ న‌ది పాల‌యిన సంగ‌తి ఎవ‌రూ మ‌ర‌చిపోలేదు. ఇలాంటి పరిస్థితుల్లో నంద్యాల‌లో ఆయ‌న‌కు అవ‌కాశం ఇస్తే అస‌లుకే ఎస‌రు వ‌స్తుంద‌నే అభిప్రాయం చివ‌ర‌కు చంద్ర‌బాబులో కూడా ఉంద‌ని చెబుతున్నారు.

ఈ నేప‌థ్యంలోనే త‌న‌ను చివ‌ర‌కు నంద్యాల ఎన్నిక‌ల స‌మీక్షా స‌మావేశాల‌కు కూడా చంద్ర‌బాబు ఆహ్వానించ‌క‌పోవ‌డంతో లోకేష్ కొంత క‌ల‌త చెందుతున్న‌ట్టు ప్ర‌చారం సాగుతోంది. 8మంది మంత్రుల‌తో నంద్యాల కోసం వేసిన స‌మ‌న్వ‌య క‌మిటీలో కూడా ఆయ‌న‌కు చోటు క‌ల్పించ‌క‌పోవ‌డం విశేషం. దాంతోనే నారా లోకేష్ స్వ‌యంగా వివిధ చానెళ్ల‌తో ప్ర‌త్యేక ఇంట‌ర్వ్యూల ప‌రంప‌ర‌కు తెర‌లేపార‌ని అంటున్నారు. నేరుగా ప్ర‌జ‌ల్లోకి వెళ్లే అవ‌కాశం ద‌క్క‌క‌పోవ‌డంతో ఇలా స్పెష‌ల్ ఇంట‌ర్వ్యూల‌తో త‌న ముద్ర చూపించుకునే ప్ర‌య‌త్నం ఆయ‌న చేసి ఉంటార‌ని అంచ‌నా వేస్తున్నారు. అదే స‌మ‌యంలో ఇప్ప‌టికే నంద్యాల‌లో అఖిల‌ప్రియ ధోర‌ణి చాలామందిని దూరం చేస్తోంది. ఇక నారా లోకేష్ కూడా తోడ‌యితే సీనియ‌ర్లకు చిక్కులు త‌ప్ప‌వ‌ని భావిస్తుండ‌డంతోనే బాధ్య‌త‌లు అప్ప‌గించి ఉండ‌క‌పోవ‌చ్చ‌ని స‌మాచారం. అయితే ఎన్నిక‌ల క్యాంపెయిన్ చివ‌రి ద‌శ‌లోన‌యినా ఆయ‌న నంద్యాల ప్ర‌చారంలో పాల్గొన‌డం ఖాయంగా చెప్ప‌వ‌చ్చు. అలాంటి అవ‌కావం కూడా ద‌క్క‌క‌పోతే అది రాజ‌కీయంగా కీల‌కాంశంగానే భావించాలి.


Related News

jd lakshminarayana

అగ‌మ్య‌గోచ‌రంగా మారిన జేడీ ప‌య‌నం

Spread the loveసీబీఐ అధికారిగా ఏపీలో మంచి ఆద‌ర‌ణ సాధించిన జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ సందిగ్ధంలో ప‌డ్డారు. త‌న రాజ‌కీయ భ‌విత‌వ్యంపైRead More

YS jagan (1)

వైసీపీకి వాళ్లంతా చేజారిన‌ట్టేనా?

Spread the loveఏపీలో ముఖాముఖీ పోరు జ‌ర‌గాల‌ని జ‌గ‌న్ ఆశించారు. దానికి త‌గ్గ‌ట్టుగా ప‌రిస్థితులు సాగిన‌ప్ప‌టికీ చివ‌రిలో ప‌లు మార్పులుRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *