Main Menu

ముర‌ళీ మోహ‌న్ అవుట్..!

Spread the love

టీడీపీ సిట్టింగు ఎంపీల‌లో ప‌లువురు మొఖం చాటేస్తున్నారు. ఇప్ప‌టికే ఆరోగ్య కార‌ణాల‌తో కాకినాడ ఎంపీ పోటీ చేసేందుకు సిద్ధంగా లేరు. అమ‌లాపురం, అనకాప‌ల్లి ఎంపీలు పార్టీ ఫిరాయించేశారు. విజ‌య‌న‌గ‌రం నుంచి అశోక్ గ‌జ‌ప‌తిరాజు ఆస‌క్తి చూప‌డం లేదు. అనంత‌పురం నుంచి జేసీ స్థానంలో త‌న‌యుడి కోసం ప‌ట్టుబ‌డుతున్నారు. చిత్తూరు శివ‌ప్ర‌సాద్ కూడా పోటీ చేసే యోచ‌న‌లో ఉన్న‌ట్టు క‌నిపించ‌డం లేదు. ఈ జాబితాలో తాజాగా రాజ‌మ‌హేంద్ర‌వ‌రం ఎంపీ కూడా చేరిపోయారు.

వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌కూడ‌ద‌ని ఆయ‌న భావిస్తున్న‌ట్టు ప్రచారం సాగుతోంది. ఆయ‌న కోడ‌లు రూపాదేవి రంగంలో ఉంటార‌ని అంతా భావించిన‌ప్ప‌టికీ ఆమె కూడా విముఖంగా ఉన్నార‌నే ప్ర‌చారం ఊపందుకుంది. దాంతో తూర్పు గోదావ‌రి జిల్లాలోని మూడు పార్ల‌మెంట్ సీట్ల‌లోనూ టీడీపీకి కొత్త నేత‌లు తెర‌మీద‌కు తీసుకురావ‌డం అనివార్యంగా మారుతోంది.

అదే స‌మ‌యంలో ముర‌ళీమోహ‌న్ పోటీకి దూరంగా ఉండ‌డానికి కార‌ణాల‌పై ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. రాజ‌కీయంగా ప‌రిస్థితి సానుకూలంగా లేక‌పోవ‌డంతోనే ఇలాంటి నిర్ణ‌యం తీసుకున్న‌ట్టుగా కొంద‌రు భావిస్తున్నారు.అ యితే వ్యాపార ప‌రిస్థితుల రీత్యా పోటీకి దూరంగా ఉండి, త‌న సంస్థ‌ల కోసం ఆయ‌న సిద్ధ‌మ‌వుతున్న‌ట్టుగా తెలుస్తోంది. ఏమ‌యినా ఇది ఆస‌క్తిక‌ర నిర్ణ‌యంగానే భావించాలి. నిజంగా ముర‌ళీమోహ‌న్ పోటీకి దూరంగా ఉంటే ఇది టీడీపీకి కొంత స‌మ‌స్య‌గా మారే అవ‌కాశం ఉంటుంద‌న‌డంలో సందేహం లేదు.






Related News

డైరెక్ట‌ర్ ర‌వితేజ‌..హీరో క‌ళ్యాణ్ రామ్!

Spread the love3Sharesరవితేజ కెరీర్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా ప్రారంభమైన విషయం విదితమే. హీరోగా రాణిస్తూ అగ్ర నటుల్లో ఒకరిగా నిలిచినRead More

ఆలియా కే ఆర్ఆర్ఆర్

Spread the love1Shareబాలీవుడ్ బ్యూటీ ఎంట్రీ ఖాయం అయ్యింది. గ‌తంలోనే ప‌లు సినిమాల‌లో అనుకున్న‌ప్ప‌టికీ ఆటంకాలు వ‌చ్చాయి. కానీ ఇప్పుడుRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *