Main Menu

నంద్యాల ఎన్నిక‌ల్లో ముద్ర‌గ‌డ …!

mudragada-and-wife
Spread the love

పాద‌యాత్ర‌ను అడ్డుకోవ‌డంతో ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం ర‌గిలిపోతున్నారు. కాపు జాతిని అణ‌చివేస్తున్నారంటూ చంద్ర‌బాబు మీద విరుచుకుప‌డుతున్నారు. అదే స‌మ‌యంలో ఇటీవ‌ల ఆయ‌న దూకుడు పెంచారు. 2019లో చంద్ర‌బాబుకి ముగింపు ఖాయ‌మ‌ని ఇప్ప‌టికే హెచ్చ‌రించారు. దానికితోడుగా అధికారంలో క‌ల‌క‌లం ఉంటార‌ని కోమాలో ఉండి భావిస్తున్న‌ట్టు విమ‌ర్శించారు. పోలీసుల‌ను కూడా హెచ్చరించారు. 2019లో చంద్ర‌బాబు ప్ర‌భుత్వం ఓట‌మి ఖాయ‌మ‌ని హెచ్చ‌రిస్తున్నారు. ఆయ‌న‌కు తొత్తులుగా వ్య‌వ‌హ‌రించ‌వ‌ద్ద‌ని సూచిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో తాజాగా ప‌వ‌న్ మీద ఆయ‌న లేఖాస్త్రాలు సంధించారు. ఇప్ప‌టి వ‌ర‌కూ ఆయ‌న చంద్ర‌బాబుకి ప‌దుల సంఖ్య‌లో లేఖ‌లు రాశారు. ఆత‌ర్వాత కేసీఆర్ కి కితాబునిస్తూ లేఖ‌రాశారు. ఇక ఇప్పుడు ప‌వ‌న్ కు హెచ్చ‌రిక‌లు చేస్తూ బాబు వ‌ల‌లో ప‌డొద్ద‌నే సూచ‌న‌ల‌తో లేఖ రాశారు.

ఆ క్ర‌మంలోనే తాజాగా ముద్ర‌గ‌డ క‌న్ను నంద్యాల ఎన్నిక‌ల మీద ప‌డిన‌ట్టు స‌మాచారం. ఇప్ప‌టికే ప‌వ‌న్ తో ప్ర‌చారం చేయించాల‌ని టీడీపీ భావిస్తోంది. దానికి త‌గ్గ‌ట్టుగా పావులు క‌దుపుతోంది. ఈ నేప‌థ్యంలో కీల‌కంగా ఉన్న బ‌లిజ సామాజిక‌వ‌ర్గానికి జ‌రుగుతున్న అన్యాయాన్ని చాట‌డానికి తాను కూడా రంగంలో దిగే ఆలోచ‌న‌లో ముద్ర‌గ‌డ ఉన్న‌ట్టు స‌మాచారం. బ‌లిజ‌ల కోసం జ‌న‌సేనాని ముందుకుతెస్తే దానికి పోటీగా తాను ప్ర‌చారానికి సిద్ధం కావాల‌ని ముద్ర‌గ‌డ భావిస్తున్నారు. ఇప్ప‌టికే నంద్యాల‌, క‌ర్నూలు ప్రాంతంలోని బ‌లిజ నేత‌ల‌తో ఆయ‌న సంప్ర‌దింపులు ప్రారంభించారు. ప‌వ‌న్ నిర్ణ‌యాన్ని బ‌ట్టి ముద్ర‌గ‌డ వ్యూహం ఉంటుంద‌ని చెబుతున్నారు.

వాస్త‌వానికి కాపు, బ‌లిజ‌, ఒంట‌రి కులాల రిజ‌ర్వేష‌న్ల విష‌యంలో మాట త‌ప్పిన చంద్ర‌బాబు తీరును నంద్యాల‌లో ఆయ‌న ప్ర‌జ‌ల ముందుకు తీసుకురావాల‌ని భావిస్తున్న‌ట్టు క‌నిపిస్తోంది అదే స‌మ‌యంలో ఆయ‌న హామీ అమ‌లు చేయాల‌ని కోరుతున్న నేప‌థ్యంలో నిర్బంధం విధించి కాపుల‌ను అణ‌చివేయాల‌ని చేస్తున్న ప‌రిస్థితుల్లో వాట‌న్నింటినీ బ‌లిజ ఓట‌ర్ల‌కు వివ‌రించాల‌ని ఆయ‌న అంచ‌నా వేస్తున్న‌ట్టు ముద్ర‌గ‌డ వ‌ర్గీయుల వాద‌న‌గా ఉంది. దాంతో ఈ ప‌రిణామం ఆస‌క్తిదాయ‌కంగా ఉంది. నంద్యాల‌లో మైనార్టీలు, రెడ్ల త‌ర్వాత బ‌లిజ‌ల‌దే కీల‌క పాత్ర‌. అలాంటి సామాజిక‌వ‌ర్గాన్ని రెడ్ల‌తో ఉన్న వైరుధ్యం సాయంతో వినియోగించుకోవాల‌ని బాబు భావిస్తున్నారు. ఈ ప‌రిస్థితుల్లో ప‌వ‌న్ రంగంలోకి వ‌స్తార‌ని టీడీపీ అనుచ‌రులు ఆశాభావంతో క‌నిపిస్తున్నారు. అందుకే ఇప్పుడు ప‌వ‌న్ అస్త్రానికి విరుగుడుగా బాబుకి బుద్ధి చెప్పాలంటూ ముద్ర‌గ‌డ సీన్ లోకి వ‌చ్చే ఛాన్స్ ఉంద‌ని అంటున్నారు. అదే జ‌రిగితే ప‌వ‌న్, ముద్ర‌గ‌డ మ‌ధ్య ప్ర‌త్య‌క్ష పోరుగానే భావించాల్సి ఉంటుంది. సీన్ అంత‌వ‌ర‌కూ వెళుతుందా లేదా అన్న‌ది చూడాలి.


Related News

sunitha

రేణూ దేశాయ్ బాట‌లో సింగ‌ర్ సునీత‌

Spread the loveప్ర‌స్తుతం టాలీవుడ్ లో పున‌ర్వివాహాల సీజ‌న్ వ‌చ్చిన‌ట్టు క‌నిపిస్తోంది. ప‌లువురు సినీ ప్ర‌ముఖులు రెండో పెళ్లిళ్ల‌కు సిద్ధ‌మ‌వుతున్నారు.Read More

Actor-Vishal-Krishna-Photo-Gallery-0gybl07

శ్రీరెడ్డికి విశాల్ ఝ‌ల‌క్

Spread the loveకోలీవుడ్ స్టార్, హీరో విశాల్ షాకింగ్ నిర్ణ‌యం తీసుకున్నారు. ముఖ్యంగా శ్రీరెడ్డి వ్య‌వ‌హారంలో ఆయ‌న సీరియ‌స్ గాRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *