వైసీపీతో మంత్రి మంత‌నాలు?

Vijayasai-Reddy
Spread the love

ఏపీలో ప‌లువురు ఎమ్మెల్యేలు మాతో ట‌చ్ లో ఉన్నార‌ని వైసీపీ ప్ర‌క‌టించింది. టీడీపీ ఎంపీలు త‌మ‌వైపు రావ‌డానికి సిద్ధ‌ప‌డుతున్నారంటూ వైసీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి సంకేతాలు ఇచ్చేశారు. దాంతో ఈ వ్య‌వ‌హారం ఆస‌క్తిగా మారింది. ఇప్ప‌టికే జ‌న‌సేనాని కూడా ఇలాంటి కామెంట్స్ చేశారు. ఇప్పుడు విజ‌య‌సాయిరెడ్డి చేశారు. అయితే తాజాగా విశాఖ‌లో విజ‌య‌సాయిరెడ్డితో ఓ కీల‌క మంత్రి త‌రుపున చ‌ర్చ‌లు సాగిన‌ట్టు ప్రచారం మొద‌ల‌య్యింది. ఇప్ప‌టికే ప‌లు పార్టీలు మారిన స‌ద‌రు మంత్రి తాజాగా టీడీపీలో ముఖ్య భూమిక పోషిస్తున్నారు. ఆయ‌న బంధువ‌ర్గం కూడా టీడీపీలోనే ఉన్నారు. దాంతో ఆయ‌న‌కు ప్రాధాన్య‌త ద‌క్కుతున్న‌ట్టు క‌నిపిస్తోంది. కానీ ఆయ‌న మాత్రం వ‌చ్చే ఎన్నిక‌ల నేప‌థ్యంలో ముంద‌స్తు జాగ్ర‌త్త‌లు అవ‌స‌ర‌మ‌ని భావిస్తున్న‌ట్టు తెలుస్తోంది.

దానికి త‌గ్గ‌ట్టుగానే మంత్రి స‌మీప బంధువు ఒక‌రు నేరుగా విజ‌య‌సాయిరెడ్డితో భేటీ కావ‌డం విశేషంగా క‌నిపిస్తోంది. విశాఖ జిల్లా రాజ‌కీయాల్లో ఇదో పెద్ద మార్పున‌కు దారితీస్తుంద‌ని చెప్ప‌వ‌చ్చు. అయితే కొద్దికాలం క్రితం విశాఖ‌లో భూక‌బ్జాల మీద పెద్ద స్థాయిలో ఆందోళ‌న‌లు నిర్వ‌హించిన వైసీపీ తాము అధికారంలోకి రాగానే లోకేష్, చంద్ర‌బాబు స‌హా బాధ్యులంద‌రిపైనా చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని ప్ర‌క‌టించింది. దాంతో ఈ వ్య‌వ‌హారంలో భాగ‌స్వామిగా ఉన్న నేత‌ల తాలుకా వ్య‌వ‌హారంపై చ‌ర్చ జ‌రిగి ఉంటుంద‌ని భావిస్తున్నారు. అయితే అస‌లు వ్య‌వ‌హారం మాత్రం పార్టీ ఫిరాయించే ఆలోచ‌న నుంచే పుట్టి ఉంటుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. కార‌ణాలు ఏమ‌యినా స‌ద‌రు మంత్రి వ్య‌వ‌హారాల‌ను చ‌క్క‌బెట్టే కీల‌క నేత‌, నేరుగా ప్ర‌తిప‌క్ష ప్ర‌తినిధితో చ‌ర్చ‌లు సాగించ‌డం మాత్రం సంచ‌ల‌నం అవుతోంది.


Related News

Vijayasai-Reddy

వైసీపీతో మంత్రి మంత‌నాలు?

Spread the loveఏపీలో ప‌లువురు ఎమ్మెల్యేలు మాతో ట‌చ్ లో ఉన్నార‌ని వైసీపీ ప్ర‌క‌టించింది. టీడీపీ ఎంపీలు త‌మ‌వైపు రావ‌డానికిRead More

jagan ys

అభ్య‌ర్థుల‌ను మార్చేస్తున్న వైసీపీ!

Spread the loveఏపీ ప్ర‌తిప‌క్ష పార్టీకి అభ్య‌ర్థులు కావాలి. వ‌చ్చే ఎన్నిక‌ల్లో కొత్త నేత‌లు అత్య‌వ‌స‌రం. అందుకు త‌గ్గ‌ట్టుగా వేటRead More

 • శ్రీరెడ్డికి భారీ ఛాన్స్
 • ప‌వ‌న్ ఎఫెక్ట్: బాబు స‌న్నిహితుడిపై వేటు?
 • స్వ‌రం మార్చేస్తున్న స‌మంత‌
 • సుకుమార్ రంగ‌స్థ‌లానికి కులం రంగులు…
 • క‌ర్ణాట‌క బ‌రిలో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌
 • జ‌న‌సేన‌లో తొలి వికెట్ ప‌డిందా..?
 • జేడీ మ‌రో జేపీ అవుతారా..?
 • రంగ‌స్థ‌లం స్టోరీ లీక్..
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *