Main Menu

కొత్త దారిలో కోడెల

Spread the love
  • 3
    Shares

ఏపీ అసెంబ్లీకి స్పీకర్ వ్యవహరిస్తున్న కోడెల శివ ప్రసాద్ రావు రూటు మారుస్తున్నారు. కొత్త బాటలో సాగబోతున్నారు. అందుకు తగ్గట్టుగా సన్నాహాలు చేసుకుంటున్నట్టు కనిపిస్తోంది. వచ్చే ఎన్నికల కోసం ముందస్తు సన్నాహాల్లో భాగంగా ఆయన తనయుడి కోసం తన సీటు త్యాగం చేసే ఆలోచనకు వచ్చినట్టు తెలుస్తోంది. అదే సమయంలో ఆయన హస్తిన వైపు చూస్తున్నట్టు ప్రచారం సాగుతోంది.

అరుసార్లు శాసనసభకు ఎన్నికైన డాక్టర్ కోడెల వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో నర్సరావుపేట పార్లమెంటు సభ్యుడిగా పోటీచేసి పార్లమెంటులో అడుగిడాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. తనయుడు డాక్టర్ శివరామ్‌ కోసం నర్సరావుపేట లేక సత్తెనపల్లి నియోజకవర్గం సీట్లను ఆయన కోరుతున్నారు. దీనికి అటు అధిష్టానం, ఇటు కేడర్ నుంచి సానుకూల స్పందన లభిస్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే అధినేత చంద్రబాబు నాయుడు ఈ విషయమై ఓ నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ విడుదల కాగానే తండ్రి, తనయుల అభ్యర్థిత్వాలను ప్రకటిస్తారని కోడెల వర్గం కోడై కూస్తోంది.

2014 ఎన్నికల్లో సత్తెనపల్లి నుంచి పోటీచేసి గెలుపొందిన డాక్టర్ కోడెల శివప్రసాదరావు అటు నర్సరావుపేట, సత్తెనపల్లి నియోజకవర్గాపై ద్రుష్టి సారించారు. రెండూ చోట్ల తన మార్క్ రాజకీయాలు నడిపారు. ఈ రెండింటిలో ఏదో ఒక అసెంబ్లీ సీటు తమకు కేటాయించాలని ఆయన కోరుతున్నారు. అయితే నర్సారావుపేట కోడెల తనయుడికి కేటాయించబోతున్నట్టు సమాచారం. రాయపాటి సాంబశివరావు కూడా వారసుడి కోసం పార్లమెంట్ సీటు వదిలేస్తే ఆయన స్థానంలో కోడెల నర్సారావుపేట ఎంపీ సీటుకి బరిలో ఉండే అవకాశం కనిపిస్తోంది.






Related News

డైరెక్ట‌ర్ ర‌వితేజ‌..హీరో క‌ళ్యాణ్ రామ్!

Spread the love3Sharesరవితేజ కెరీర్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా ప్రారంభమైన విషయం విదితమే. హీరోగా రాణిస్తూ అగ్ర నటుల్లో ఒకరిగా నిలిచినRead More

ఆలియా కే ఆర్ఆర్ఆర్

Spread the love1Shareబాలీవుడ్ బ్యూటీ ఎంట్రీ ఖాయం అయ్యింది. గ‌తంలోనే ప‌లు సినిమాల‌లో అనుకున్న‌ప్ప‌టికీ ఆటంకాలు వ‌చ్చాయి. కానీ ఇప్పుడుRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *