Main Menu

క‌మ‌లానికి కామినేని గుడ్ బై

kamineni
Spread the love

ఏపీలో బీజేపీ ఇద్ద‌రు మంత్రులు చెరోదారిలో సాగుతున్నారు. రాష్ట్రంలో బీజేపీని బ‌ద్నాం చేయ‌డానికి టీడీపీ ప్ర‌య‌త్నిస్తున్న‌ప్ప‌టికీ మంత్రి కామినేని శ్రీనివాస్ మాత్రం చంద్ర‌బాబుని ప‌ల్లెత్తు మాట అన‌డం లేదు. ఓవైపు మంత్రి మాణిక్యాల‌రావు తాము రాజీనామాల‌కు సిద్ద‌మ‌ని ప్ర‌క‌టిస్తుంటే, కామినేని మాత్రం రాజీనామా లేఖ జేబులు పెట్టుకుని తిరుగుతున్నాన‌ని చెబుతూనే, చంద్ర‌బాబుని మాత్రం ప‌ల్లెత్తు మాట అన‌డం లేదు. దాంతో బీజేపీ నేత‌లు కూడా కామినేని తీరుతో త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు.

ఏపీలో బీజేపీ, టీడీపీ మ‌ధ్య బాగా దూరం పెరిగింది. అవున‌న్నా..కాద‌న్నా ఇవాళ రేపు ఆ పార్టీల మ‌ధ్య వైరం హాట్ టాపిక్ అవుతోంది. అయినా కామినేని మాత్రం త‌మ పార్టీని విమ‌ర్శిస్తున్న టీడీపీ గురించి మాట్లాడ‌క‌పోవడం విశేషంగా మారింది. అదే స‌మ‌యంలో బీజేపీ నేత‌లంతా బ‌హిరంగంగా టీడీపీ మీద విమ‌ర్శ‌లు చేస్తున్న‌ప్ప‌టికీ మంత్రి తీరు మార‌డం లేద‌ని ప‌లువురు భావిస్తున్నారు. దాంతో బీజేపీ కి గుడ్ బై చెప్పే యోచ‌న‌లో కామినేని శ్రీనివాస్ ఉన్నార‌నే వాద‌న బ‌య‌లుదేరింది. చాలాకాలంగా చంద్ర‌బాబుతో స‌న్నిహితంగా మెలుగుతున్న కామినేని ఇక బీజేపీ, టీడీపీ బంధం చెదిరిపోతే మాత్రం త‌న దారి తాను చూసుకోవ‌డానికి త‌గ్గ‌ట్టుగా వ్యూహ‌ర‌చ‌న చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. దాంతో ఈ ప‌రిణామం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.






Related News

naidu-parakala-750

ప‌ర‌కాల రాజీనామాకు అస‌లు కార‌ణం!

Spread the loveఏపీ మీడియా స‌ల‌హాదారుడిగా ప‌ర‌కాల ప్ర‌భాక‌ర్ నాలుగేళ్ళ ప్ర‌స్థానానికి తెర‌ప‌డింది. చాలాకాలంగా ఊహాగానాలు వినిపించినా ఎట్ట‌కేల‌కు ఆయ‌నRead More

1517944665-1538

బీచ్ లో బ్యూటీ

Spread the loveజబర్దస్త్ కామెడీ షోతో వెలుగులోకి వచ్చిన హాట్ బ్యూటీ అనసూయ. తెలుగులో యాంకరింగ్ కు ఓ గ్లామర్Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *