Main Menu

తల్లి అవుతున్న కాజల్

Spread the love

చందమామ ఇప్పుడు తల్లి అవుతోంది. నిజమా అని ఆశ్చర్యపోకండి..అది తెరమీద పాత్రలో మాత్రమే. ఒకనాటి హీరోయిన్లకు భిన్నంగా ప్రస్తుతం టాలీవుడ్ భామలు సాగుతున్న తీరుకి కాజల్ వ్యవహారం సాక్ష్యంగా ఉంది. గ్లామర్‌ పాత్రల్ని వదులుకోవడానికి, ప్రయోగాలు చేయడానికి ప్రస్తుత తరం సిద్ధంగా ఉందని ఆమె చాటుతున్నారు.

గతంలో ‘అమ్మ’గా కనిపించాలంటే హీరోయిన్లకు చాలా భయం ఉండేది. కానీ మార్పులో భాగంగా కాజల్ సిద్ధపడడం చర్చనీయాంశంగా మారింది. అందులో భఆగంగా కాజల్‌ కూడా ఇలాంటి విభిన్నమైన ప్రయాణమే చేయబోతోందని తెలుస్తోంది. తేజ దర్శకత్వంలో వెంకటేష్‌ కథానాయకుడిగా ఓ సినిమా రూపొందుతోంది. ఇందులో కథానాయికగా కాజల్‌ని ఎంచుకున్నట్టు సమాచారం. ఆమె ఇందులో ఇద్దరు పిల్లలకు తల్లిగా కనిపించబోతోందట. తేజ అంటే కాజల్‌కి ఎనలేని గౌరవం. తన తొలి చిత్రం ‘లక్ష్మీ కల్యాణం’కి తేజనే దర్శకుడు. ‘నేనే రాజు నేనే మంత్రి’తో కష్టకాలంలో ఓ విజయాన్ని అందించారు. కేవలం తేజ కోసమే కాజల్‌ ఈ సాహసం చేస్తోందని, వెంకీతో పాటు కాజల్‌ పాత్ర కూడా ధీటుగా ఉండబోతోందని తెలుస్తోంది. అన్నట్టు ఈ సినిమాకోసం కాజల్‌ తన కెరీర్‌లోనే అత్యధిక పారితోషికం తీసుకోబోతోందనే ప్రచారం సాగుతోంది.






Related News

టీడీపీ నుంచి వంగ‌వీటి రాధాకి ఆఫ‌ర్!

Spread the loveవైసీపీలో విజ‌య‌వాడ వ్య‌వ‌హారం గ‌రం గ‌రం అవుతోంది. సెంట్ర‌ల్ నుంచి మొద‌ల‌య్యి తూర్పుని కూడా తాకింది. వంగ‌వీటిRead More

జ‌గ‌న్ గుట్టు బాబుకి చిక్కిన‌ట్టేనా..!

Spread the loveఏపీలో విప‌క్ష నేత అధికారం కోసం వ్యూహ‌ర‌చ‌న చేస్తున్నారు. అందుకు త‌గ్గ‌ట్టుగా ప‌లువురు పొలిటిక‌ల్ స్ట్రాట‌జిస్టుల‌తో చ‌ర్చ‌లుRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *