Main Menu

జేసీ రాజీనామాలో నిజమెంత?

Spread the love

సంచలనాలకు పెట్టింది పేరుగా కనిపించే టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి తాజాగా రాజీనామా ప్రకటన చేయడం. ఆ తర్వాత మాట మార్చడం అందరినీ ఆశ్చర్యపరుస్తాయనుకోవడం అనుమానమే. ఎందుకంటే జేసీ రాజీనామా ప్రకటన చేయగానే చాలామంది సందేహాలు వ్యక్తం చేశారు. కేవలం సాగునీరు కోసమే ఎంపీ రాజీనామా చేస్తున్నట్టు చెప్పడం, అది కూడా సోమవారం చేస్తాననడం సందేహాలకు తావిచ్చింది. ఎవరైనా రాజీనామా చేయాలనుకుంటే చేస్తారు..లేదంటే చేస్తామని చెబుతారు. కానీ తాను మాత్రం సోమవారం రాజీనామా చేస్తున్నట్టు గురువారం ప్రకటించడం జేసీ మాటల మతలబు ఇట్టే అర్థమవుతుంది.

ఆ తర్వాత చంద్రబాబు తన అనుచర మంత్రులను రంగంలో దింపినట్టు, దానికి జేసీ దిగివచ్చినట్టు మళ్లీ కథనాల పరంపర కనిపించింది. అసలు జేసీ దివాకర్ రెడ్డి నిజంగానే చాగల్లు రిజర్వాయర్ కోసమే రాజీనామా అస్త్రం సంధిస్తానని చెప్పారా అంటే నిస్సందేహంగా కాదని చెప్పవచ్చు. ఎందుకంటే ఆయన గతంలో సుదీర్ఘకాలం కాంగ్రెస్ లో ఉన్నప్పుడు గానీ, ఇప్పుడు టీడీపీ ఎంపీ ఉన్న మూడేళ్ల కాలంలో గానీ పెద్దగా రైతాంగం సమస్యలను పట్టించుకున్నట్టు కనిపించలేదు. నిత్యం అనంతపురం ఎమ్మెల్యేతో విబేధాలు, ఇతర విషయాల్లోనే జేసీ పేరు వినిపించింది. అలాంటిది ఇప్పుడు సాగునీరు కోసమే జేసీ రాజీనామా చేస్తాననడం, ఆయన ప్రకటనతో నీటిపారుదల శాఖలో కదలిక వచ్చినట్టు చెప్పుకోవడం వెనుక స్కెచ్ ఉందనే వారు కూడా ఉన్నారు.

నిజానికి జేసీ చాలామార్లు చంద్రబాబు తీరును కూడా బహిరంగంగానే తప్పుబట్టారు. అదే సమయంలో మావాడు జగన్ అంటూ సామాజిక కోణంలో మాట్లాడుతూ సీఎం అయ్యే ఛాన్స్ లేవంటూ కూడా వ్యాఖ్యానించారు. అంతేగాకుండా నేరుగా పులివెందులలోనే జగన్ మీద పరుషంగా వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబును మెప్పించారు. అయితే ఇప్పుడు రాజీనామా ప్రకటన వెనుక అసలు కారణం ఆయన అల్లుడి వ్యవహారం ఉందని చెబుతున్నారు. ఎమ్మెల్సీగా ఉన్న దీపక్ రెడ్డి హైదరాబాద్ భూకబ్జా వ్యవహారాల్లో కూరుకుపోయారు. ఆయన కేసుల విషయంలో తగిన సహకారం లభించకపోవడంతోనే జేసీ ఇలాంటి ప్రకటన చేసి ఉంటారని భావిస్తున్నారు. దానికి సంబందించిన హామీ రావడంతో కొంత వెనక్కి తగ్గిఉంటారని ఓ సెక్షన్ లో అబిప్రాయం వినిపిస్తోంది.

అయితే అసలు కారణాలు ఎలా ఉన్నప్పటికీ అనంతపురంలో జేసీ ప్రకటన కలకలం రేగింది.






Related News

టీడీపీ నుంచి వంగ‌వీటి రాధాకి ఆఫ‌ర్!

Spread the loveవైసీపీలో విజ‌య‌వాడ వ్య‌వ‌హారం గ‌రం గ‌రం అవుతోంది. సెంట్ర‌ల్ నుంచి మొద‌ల‌య్యి తూర్పుని కూడా తాకింది. వంగ‌వీటిRead More

జ‌గ‌న్ గుట్టు బాబుకి చిక్కిన‌ట్టేనా..!

Spread the loveఏపీలో విప‌క్ష నేత అధికారం కోసం వ్యూహ‌ర‌చ‌న చేస్తున్నారు. అందుకు త‌గ్గ‌ట్టుగా ప‌లువురు పొలిటిక‌ల్ స్ట్రాట‌జిస్టుల‌తో చ‌ర్చ‌లుRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *