సందిగ్ధంలో జ‌న‌సేనాని..!

chandrababu pawan
Spread the love

ఆయ‌న ఒక మాట చెప్ప‌డం..ఆ త‌ర్వాత మ‌ర‌చిపోవ‌డం చాలా స‌హ‌జంగా మారిపోతోందా అనే అభిప్రాయం అభిమానుల్లో క‌నిపిస్తోంది. ఇప్ప‌టికే ప‌లు విష‌యాల్లో పీకే చెప్పిన దానికి భిన్నంగా ప‌రిణామాలున్నాయి. తాజాగా నంద్యాల ఉప ఎన్నిక‌ల విష‌యంలోనూ ప‌వ‌న్ క‌ల్యాణ్ తీరు అలానే ఉంద‌నే అభిప్రాయం క‌నిపిస్తోంది. వాస్త‌వానికి వారం క్రితం చంద్ర‌బాబుని క‌లిసిన నేప‌థ్యంలో నంద్యాల‌లో టీడీపీకి ప‌వ‌న్ క‌ల్యాణ్ మ‌ద్ధ‌తు ప్ర‌క‌టించే అవ‌కాశం ఉంటుంద‌ని భావించారు. దానికి త‌గ్గ‌ట్టుగానే ఉద్దానం పేరుతో ఆయ‌న ప్ర‌త్యేక విమానంలో అమ‌రావ‌తి వెళ్లిన‌ప్ప‌టికీ అక్క‌డ హార్వ‌ర్డ్ నుంచి వ‌చ్చిన నిపుణుల‌ను, త‌న‌ను వెంట‌బెట్టుకుని వెళ్ళిన కామినేని శ్రీనివాస్ ని ప‌క్క‌న పెట్టి ఏకాంత స‌మావేశాల‌కు సిద్ద‌మ‌య్యారు. చంద్ర‌బాబుతో భేటీలో కీల‌కాంశాలు చ‌ర్చించిన‌ట్టు అంతా భావించారు. ఆ త‌ర్వాత మీడియా స‌మావేశంలో ప‌వ‌న్ క‌ల్యాణ్ కూడా ప‌లు విష‌యాల‌ను ప్ర‌స్తావించారు.

అదే స‌మ‌యంలో నంద్యాల ఉప ఎన్నిక‌ల్లో జ‌న‌సేన వైఖ‌రి మీద మీడియా ప్ర‌తినిధులు ప్ర‌శ్నించారు. దానికి జవాబుగా రెండు రోజుల్లో త‌న నిర్ణ‌యం ప్ర‌క‌టిస్తాన‌ని ప‌వ‌న్ తెలిపారు. కానీ ఇప్పుడు మూడు రెళ్లు రోజులు గడిచిపోయాయి. నంద్యాల ఉప ఎన్నిక‌ల వేడి రాజుకుంది. అధికార ప‌క్షం స‌కల అస్త్రాలతో స‌న్న‌ద్ధ‌మ‌య్యింది. విప‌క్షం కూడా నైతికంగా పైచేయి కోసం ప్ర‌య‌త్నిస్తోంది. భారీ స‌భ ద్వారా స్టామినా చాటింది. జ‌గ‌న్ కాల్పుల మాట‌ల‌తో స‌మ‌స్య‌లు కొనితెచ్చుకుంది కూడా. ఇలా రెండు ప్ర‌ధాన పార్టీలు దూకుడుగా ఉన్న స‌మ‌యంలో జ‌న‌సేనాని త‌న నిర్ణ‌యం ప్ర‌క‌టించ‌డంలో జాప్యం చేస్తుండ‌డం చాలామందిని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. వాస్త‌వంగా చంద్ర‌బాబుతో స‌మావేశ‌మ‌యిన నాడే పీకే వైఖ‌రి ప్ర‌క‌టించే అవ‌కాశం ఉంద‌ని టీడీపీ నేత‌లు ఆశించారు. జ‌న‌సేన అండ‌తో నంద్యాల‌లో తాము జ‌య‌కేత‌నం ఎగుర‌వేస్తామ‌ని అంచ‌నా వేస్తున్నారు. ప‌వ‌న్ క‌ల్యాణ్ నుంచి ప్ర‌క‌ట‌న వేస్తే ప‌రిణామాలు మార‌తాయ‌ని లెక్క‌లేస్తోంది. ఒక‌దేశ‌లో ప‌వ‌న్ క‌ల్యాణ్ నేరుగా ప్ర‌చారానికి దించాల‌ని టీడీపీ అధినేత కూడా ప్ర‌య‌త్నం చేసిన త‌రుణంలో అదే జ‌రిగితే ఫ‌లితాలు త‌మ‌వైపు మొగ్గు చూపుతాయ‌ని అంచ‌నా వేశారు.

అయినా ప‌వ‌న్ క‌ల్యాణ్ మాత్రం త‌న వైఖ‌రిని ప్ర‌క‌టించ‌డంలో తాత్సార్యం చేస్తుండ‌డానికి కార‌ణాల‌పై ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. తాజాగా నంద్యాల‌లో జ‌రిగిన ప‌రిణామాల‌ను ఆయ‌న ప‌రిశీలిస్తున్న‌ట్టు అనుచ‌రుల అభిప్రాయం. నంద్యాల‌లో ఉప ఎన్నిక‌ల సంద‌ర్భంగా టీడీపీకి సానుకూల‌త ఉండాల్సి ఉన్న‌ప్ప‌టికీ అక్క‌డ ప‌రిస్థితి దానికి భిన్నంగా ఉండ‌డం ఆయ‌న్ని సందిగ్ధ‌త‌లోకి నెట్టింద‌ని అంటున్నారు. హోరాహోరీ పోరు క‌నిపిస్తుండ‌డం, కొన్ని అంశాల‌లో వైసీపీ ముందంజ‌లో ఉండ‌డంతో జ‌న‌సేనాని పున‌రాలోచ‌న చేస్తున్నారా అనే అనుమానం కూడా వ్య‌క్తం చేస్తున్నారు. ఎలానూ ఉప ఎన్నిక‌లే కాబ‌ట్టి ఇప్పుడే తాను ప్ర‌క‌ట‌న చేయ‌డం వ‌ల్ల ప్ర‌యోజ‌నం క‌న్నా న‌ష్ట‌మే ఎక్కువ‌నే అభిప్రాయం వ‌స్తుందా అంటూ స‌న్నిహితుల‌తో ఆయ‌న చ‌ర్చ‌లు జ‌రుపుతున్నార‌ని ప్ర‌చారం సాగుతోంది. అదే స‌మ‌యంలో నంద్యాల‌లో 28వేల ఓట్ల వ‌ర‌కూ బలిజ సామాజిక‌వ‌ర్గం ఉన్న‌ప్ప‌టికీ, ఇటీవ‌ల రిజ‌ర్వేష‌న్లు స‌హా ప‌లు కార‌ణాల‌తో ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త తీవ్రంగా ఉంద‌నే నివేదికలు ఉండ‌డ‌మే కాకుండా, ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం సైతం ప్ర‌చారానికి రావ‌డానికి సంసిద్ధంగా ఉన్నార‌న్న ప్ర‌చారం కూడా ప‌వ‌న్ మీద ప్ర‌భావం చూపిన‌ట్టు క‌నిపిస్తోంది. మొత్తంగా కార‌ణాలేమ‌యినా నంద్యాల విష‌యంలో ఆచితూచి వ్య‌వ‌హ‌రించేలా జ‌న‌సేనాని ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఏం చేస్తే బాగుంటుంద‌నే రీతిలో త‌న శ్రేయోభిలాషుల‌యిన వివిధ వ‌ర్గాల‌తో చ‌ర్చ‌లు చేస్తున్నారు. చివ‌ర‌కు ఎలా స్పందిస్తారో చూడాలి.


Related News

Rangasthalam_5745

రంగ‌స్థ‌లం స్టోరీ లీక్..

Spread the loveమెగా ప‌వ‌ర్ స్టార్ రామ‌చ‌ర‌ణ్ లేటెస్ట్ మువీ సినిమా రిలీజ్ కి సిద్దం అయ్యింది. వ‌చ్చే వారిRead More

janasena pawan kalyan

ప‌వ‌న్ త‌డ‌బాటు..

Spread the loveజ‌న‌సేనాని త‌డ‌బ‌డుతున్నారు. త‌ప్ప‌ట‌డుగులు వేస్తూ రాజ‌కీయంగా కొంత గంద‌ర‌గోళంలో ఉన్న‌ట్టు క‌నిపిస్తున్నారు. దాంతో ప‌వ‌న్ తీరు చాలామందినిRead More

 • బాల‌య్య హీరోయిన్ పెళ్లి చేసేసుకుంది..
 • ముంద‌స్తు ముప్పు త‌ప్పంది…!
 • రాజ‌కీయాల్లో కీల‌కం కాబోతున్న హీరోయిన్
 • రాజ్య‌స‌భ కోసం బీజేపీకి వైసీపీ తాయిలాలు…!
 • మంత్రి ప‌దవుల కోసం మొద‌ల‌యిన లాబీయింగ్
 • వైసీపీ వ్యూహాత్మ‌క త‌ప్పిద‌మేనా?
 • ఎమ్మెల్యేల‌ను త‌ర‌లిస్తున్న జ‌గ‌న్
 • హాట్ ల‌వ‌ర్స్ బ్రేక‌ప్..!
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *