పవన్ ఫ్యాన్స్ లో జోష్ తగ్గుతోందా…? రివ్యూ

janasena
Spread the love

అనూహ్యంగా పవర్ స్టార్ ఇమేజ్ మీద ఇప్పుడు చర్చ మొదలయ్యింది. చాలాకాలం తర్వాత ప్రజల్లోకి వచ్చిన పవన్ కల్యాణ్ కి ప్రజా స్పందన చూసిన తర్వాత ఇదో ఆసక్తికర అంశంగా మారుతోంది. ఉత్తరాంధ్ర ప్రధాన నగరం విశాఖ నుంచి మొదలుకుని దక్షిణాంధ్రలోని ఒంగోలు వరకూ సాగిన ఆయన పర్యటన పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతుంది. సహజంగానే సినీ స్టార్లు క్రౌడ్ ఫుల్లర్లుగా ఉంటారు. స్టార్ హీరో వస్తున్నారని తెలిస్తే చాలు అభిమానులు పోటెత్తుతారు. పెద్ద సంఖ్యలో గుమికూడతారు. గతంలో పవన్ కల్యాణ్ విషయంలో కూడా అదే జరిగింది. చిరంజీవికయితే చెప్పనవసరం లేదు.

కానీ తాజాగా పవన్ కల్యాణ్ పర్యటనలో పోటెత్తిన అభిమానం కనిపించలేదు. కొందరు వీరాభిమానుల అతి అవేశం అన్ని చోట్లా స్పష్టంగా కనిపించింది. నాలుగు రోజుల పర్యటనను పరిశీలిస్తే విశాఖ నుంచి మొదలుకుని ఒంగోలు వరకూ కొందరు ఫ్యాన్స్ అతిగా ప్రవర్తించిన అన్ని చోట్లా కనిపించింది. అది పోలీసులకు కొంత తలనొప్పిగా మారింది. రాజమహేంద్రవరంలో అయితే ముగ్గురు కానిస్టేబుళ్లు, ఒక అభిమాని గాయపడే పరిస్థితిని తీసుకొచ్చింది.

ఇక అభిమానుల వెల్లువ గమనిస్తే విశాఖ, ఒంగోలు ప్రాంతాల్లో ఫర్వాలేదనిపించినా రాజమండ్రి,విజయవాడలో కొంత పేలవంగా కనిపించింది. విశాఖలో బహిరంగంగా నిర్వహించిన ధర్నా కావడంతో కొన్ని కార్మికసంఘాల ప్రతినిధులు కూడా రావడంతో సభా ప్రాంగణంలో సుమారు ఆరేడు వేల మంది కనిపించారు. అదే రాజమండ్రి వచ్చేసరికి సీన్ మారిపోయింది.చివరకు పవన్ కల్యాణ్ బస చేసిన హోటల్ నుంచి బయటకొచ్చిన సమయంలో కేవలం రెండు మూడొందల మంది మినహా హాటల్ దగ్గర కనిపించలేదంటే ప రిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇక రాజమండ్రి నుంచి పోలవరం వెళ్లే మార్గం మధ్యలో కాపు సామాజికవర్గం ప్రధానంగా ఉండే గ్రామాలు ఉండడంతో 40 కిలోమీటర్ల పొడవునా నాలుగైదు చోట్లయినా పవన్ ని అడ్డుకుంటారని, కారు నుంచి పైకి వచ్చి అభివాదం చేసిన తర్వాత మాత్రమే ముందుకెళ్లనిచ్చే పరిస్థితి వస్తుందని భావించారు. కానీ తీరా చూస్తే కొవ్వూరులో వంద మంది రోడ్డు మీద నిలబడడం మినహా మరో చోట అలాంటి సీన్ కనిపించలేదు. ఇక పోలవరం ప్రాజెక్ట్ వద్ద కూడా అంతా కలిపి మూడొందలకు మించకపోవడం జనసేన నేతలను ఆలోచనలో పడేసింది. అందుకు రాజమండ్రి సభలో హాల్ పూర్తిగా నిండకపోవడం కూడా విచిత్రంగా కనిపించింది.

విజయవాడలో కూడా అదే పరిస్థితి. మంగళగిరి సైట్ వద్ద వేల సంఖ్యలో అభిమానులు వస్తారన్న అంచనాలతో పోలీసులు పెద్ద సంఖ్యలో మోహరించారు. పోలీసు, మీడియా హడావిడే ఎక్కువగా కనిపించింది. ఇక సమన్వయకర్తల సమావేశంలో కొంత ఫర్వాలేదనిపించినా పవన్ కల్యాణ్ లాంటి స్టార్ హీరోకి రావాల్సిన స్థాయిలో అభిమానులు కనిపించలేదు. ఎంపిక చేసిన వారే అని చెప్పినా ఇలాంటి సినిమా హీరోల వరకూ వచ్చేసరికి సీన్ మారిపోవాల్సి ఉంటుంది. అయినా అలాంటి పరిస్థితి కనిపించలేదు. ఒంగోలులో అయితే కొంత ఫర్వాలేదనిపించింది.

అయితే ఇప్పుడు జనసేన నేతల్లో కొంత కలవరం కలిగించే అంశం. గోదావరి జిల్లాల స్పందన. ఉభయగోదావరి జిల్లాలకు కలిపి ఏర్పాటు చేసిన సమావేశానికి స్పందన గానీ, బయట ఫ్యాన్స్ సందోహం గానీ కనిపించకపోవడంతో పరిశీలకుల్లో కొత్త చర్చకు తెరలేసింది. గతంతో పోలిస్తే పవన్ ఇమేజ్ డ్యామేజ్ అయ్యిందనే వారు కూడా కనిపిస్తున్నారు.


Related News

anushka

ప్రభాస్ సినిమా సెట్లో అనుష్క

Spread the loveరెబల్ స్టార్ ప్రభాస్, జేజమ్మ అనుష్క మధ్య వ్యవహారాలు రోజురోజుకి ఆసక్తిగా మారుతున్నాయి. వారి సాన్నిహిత్యం మరింతRead More

nitya menon

నిత్యామీనన్ లిప్ లాక్ ఎవరితో తెలుసా

Spread the loveవినూత్న పాత్రలతో ముందుకెళ్తూ తనదైన సహజ నటనతో ఆకట్టుకునే మలయాళ కుట్టీ నిత్యమీనన్ మరో విభిన్నపాత్రలో కనిపించనుందట.Read More

 • తల్లి అవుతున్న కాజల్
 • ఉమ్మడి ప్రయోజనాల కోసమే కేసీఆర్, పవన్ భేటీ
 • హీరోయిన్ దొరికిపోయింది…
 • హీరోగారమ్మాయి డేటింగ్ వ్యవహారం..
 • కన్నతల్లిని ఖాతరు చేయని శ్రుతి హాసన్?
 • కొత్త రూపంలో బన్నీ
 • రేసు నుంచి రవితేజ అవుట్
 • తారక్, చెర్రీ మువీకి తార ఆమె..
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *