Main Menu

జేడీ మ‌రో జేపీ అవుతారా..?

Spread the love

జేడీ రాజకీయ ఆరంగేట్రంపై ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. ఆయ‌న రాక ప‌లువురికి క‌ల‌వ‌రం క‌లిగిస్తోంది. ముఖ్యంగా తెలుగుదేశం నేత‌ల‌కు ఆయ‌న కంట‌గింపు మారుతున్న‌ట్టు క‌నిపిస్తోంది. స‌హ‌జంగానే జేడీ ల‌క్ష్మీనారాయణ పేరు చెప్ప‌గానే వైసీపీ శ్రేణులు ద్వేషిస్తాయి. జ‌గ‌న్ అభిమానులు ఒంటికాలిమీద లేస్తారు. ఇప్పుడు టీడీపీ వ‌ర్గాలు కూడా అదే రీతిలో వ్య‌వ‌హ‌రించ‌బోతున్న‌ట్టు క‌నిపిస్తోంది. తాజాగా టీడీపీ అనుకూల మీడియాలో వ‌స్తున్న క‌థ‌నాలు అందుకు నిద‌ర్శ‌నంగా చెప్ప‌వ‌చ్చు. గ‌తంలో చంద్ర‌బాబుతో స‌న్నిహితంగా మెలిగినంత‌కాలం ప‌వ‌న్ క‌ళ్యాణ్ ని ప‌ల్లెత్తు మాట కూడా అన‌ని మీడియా ఇప్పుడు స్వ‌రం మార్చేసింది. మెజార్టీ మీడియాలో ఆయ‌న వ్య‌తిరేక క‌థ‌నాల వెల్లువ మొద‌ల‌వుతోంది. ప‌వ‌న్ వ్యాఖ్య‌ల మీద‌, వ్య‌వ‌హారం మీద‌, చివ‌ర‌కు జ‌న‌సేన భ‌విత‌వ్యం మీద కూడా సందేహాలు వ్య‌క్తం చేస్తూ వార్త‌లు రాస్తున్నారు. త‌ద్వారా టీడీపీకి వ్య‌తిరేకంగా ఉండేవారి ప‌ట్ల ఆ వ‌ర్గ‌పు మీడియా వ్య‌వ‌హారం ఎలా ఉంటుందో చాటుతున్నారు. త్వ‌ర‌లో జేడీ కూడా అందుకు మిన‌హాయింపు కాద‌ని చెప్ప‌వ‌చ్చు. ఇప్ప‌టికే కాపు సామాజిక‌వ‌ర్గానికి చెందిన జేడీ అంటూ క‌థ‌నాలు మొద‌ల‌య్యాయి. పైగా గ‌డిచిన ఎన్నిక‌ల్లోనే రాజ‌కీయాల్లోకి రావాల‌నుకున్నారంటూ ఏబీఎన్ రాధాకృష్ణ చాలాకాలంగా దాచిన వాస్త‌వాన్ని ఇప్పుడు బ‌య‌ట‌పెట్టారు. అప్ప‌ట్లో జేడీ రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కోసం ప‌నిచేస్తున్నార‌ని వైసీపీ నేత‌లు చేసిన వ్యాఖ్య‌ల్లో నిజం ఉంద‌ని తాజాగా అంగీక‌రించి ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.

అయితే జేడీ పూర్తిగా క‌మ‌లం క‌నుస‌న్న‌ల్లో అడుగులు వేసే ఆలోచ‌న‌కు వ‌చ్చేశార‌ని అంతా భావిస్తున్నారు. టీడీపీ శిబిరం కూడా అదే లెక్క‌ల్లో ఉంది. అదే వాస్త‌వం అయితే ఏపీలో క‌మ‌ల‌మే క‌కావికలం అయిపోయిన ద‌శ‌లో జేడీ వ‌చ్చిన‌ప్ప‌టికీ ఆపార్టీ కోలుకునే అవ‌కాశం లేదు. పైగా క‌మ‌లాన్ని న‌మ్ముకుని జేడీ కూడా ఉన్న ప‌రువు కోల్పోయే ప్ర‌మాదం ఉంద‌ని ప‌లువురి భావ‌న‌. గ‌తంలో జేపీ కూడా సొంత పార్టీ పేరుతో ఐఏఎస్ నుంచి పొలిటిక్స్ లో వ‌చ్చి చ‌తికిల‌ప‌డ్డారు. వ్య‌క్తిగా ఆయ‌న‌కు ఎంతో కొంత గౌర‌వం ఉన్న‌ప్ప‌టికీ రాజ‌కీయ నాయ‌కుడిగా ఆయ‌న్ని జ‌నం విశ్వ‌సించే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు. ఇక జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ కూడా అదే కోవ‌లో చేరిపోవ‌డం ఖాయ‌మ‌ని ప‌రిశీల‌కుల అభిప్రాయం. అయితే జేపీ సొంత పార్టీ కాబ‌ట్టి కొంత స‌మ‌స్య‌లు వ‌చ్చిన‌ప్ప‌టికీ జేడీ ఓ జాతీయ పార్టీని న‌మ్ముకోవ‌డం వెనుక అస‌లు కార‌ణాల్లో జేపీ అనుభ‌వం కూడా ప‌రిగ‌ణ‌లోకి తీసుకోవ‌డ‌మేన‌న్న‌ది వారి అంచ‌నా. ఏపీలో బోల్తా ప‌డిన‌ప్ప‌టికీ రామ్ మాధ‌వ్, జీవీఎల్ న‌ర‌సింహ‌రావు వంటి వారి మాదిరిగా త‌న‌కు కూడా కేంద్రంలో మంచి అవ‌కాశాలుంటాయ‌నే ధీమాతో జేడీ ఉన్నారని చెబుతున్నారు. క‌నీసం కిర‌ణ్ బేడీలా ఓ రాష్ట్ర గవ‌ర్న‌ర్ గిరీ అయినా ద‌క్క‌క‌పోతుందా అన్న అభిప్రాయానికి వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది.

ఏమ‌యినా జాతీయ రాజ‌కీయాల్లో ప్ర‌భావాలు, ఫ‌లితాలు ఎలా ఉన్న‌ప్ప‌టికీ ఏపీలో మాత్రం జేడీ కి వ్య‌తిరేకంగా క‌థ‌నాలు ఖాయం అని చెప్ప‌వ‌చ్చు. వాట‌న్నింటినీ ఎదుర్కొంటూ రాజ‌కీయంగా ముందుకు సాగ‌డం అంత స‌లువు కాదు. కానీ జేడీని చూపించి ప‌వ‌న్ ని క‌మ‌లం తో పొత్తుకి సిద్ధం చేస్తున్న‌ట్టు చెప్ప‌వ‌చ్చు. అదే జ‌రిగితే ప‌వ‌న్ ఆవేశం, జేడీ ఆలోచ‌న ఉప‌యోగ‌ప‌డతాయ‌న్నది జ‌న‌సేన అభిమానుల ఆలోచ‌న‌గా ఉంది. చివ‌ర‌కు ఏం జ‌రిగినా జేడీ, ప‌వ‌న్ లు మాత్రం మీడియా దాడికి ఎదురీద‌క త‌ప్ప‌దు.


Related News

డైరెక్ట‌ర్ ర‌వితేజ‌..హీరో క‌ళ్యాణ్ రామ్!

Spread the loveరవితేజ కెరీర్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా ప్రారంభమైన విషయం విదితమే. హీరోగా రాణిస్తూ అగ్ర నటుల్లో ఒకరిగా నిలిచినRead More

ఆలియా కే ఆర్ఆర్ఆర్

Spread the loveబాలీవుడ్ బ్యూటీ ఎంట్రీ ఖాయం అయ్యింది. గ‌తంలోనే ప‌లు సినిమాల‌లో అనుకున్న‌ప్ప‌టికీ ఆటంకాలు వ‌చ్చాయి. కానీ ఇప్పుడుRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *