Main Menu

టీడీపీ అధ్య‌క్షుడిగా రెడ్డి గారు..!

tdp
Spread the love

ఏపీ టీడీపీలో అనూహ్య నిర్ణ‌యాలు త‌ప్ప‌వ‌నిపిస్తోంది. ఇప్ప‌టికే మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌, ఎమ్మెల్సీ ప‌ద‌వుల పంపిణీలో సామాజికంగా రెడ్ల‌కు అత్య‌ధిక ప్రాధాన్య‌త ద‌క్కింది. చంద్ర‌బాబులో వ‌చ్చిన మార్పున‌కు అది సంకేతంగా ఉంది. ఇక ఇప్పుడు తాజాగా మ‌రో అనూహ్య నిర్ణ‌యం ఖాయ‌మ‌నే వాద‌న ఉంది. తెలుగుదేశం పార్టీ అధ్య‌క్ష ప‌ద‌విని ఓ జంపింగ్ నేత‌కు క‌ట్టుబెట్ట‌డం ఖాయంగా ఉంది. ఇప్ప‌టికే ఏపీ టీడీపీ అధ్య‌క్షుడిగా ఉన్న కిమిడి క‌ళా వెంక‌ట్రావు మూడు నెల‌ల క్రితం మంత్రి ప‌ద‌వి ద‌క్కించుకున్నారు. ఆయ‌న కూడా జంపింగ్ నాయ‌కుడే కావ‌డం గ‌మ‌నార్హం. 2009లో ఆయ‌న పీఆర్పీ త‌రుపున ఎచ్చెర్ల నుంచి పోటీ చేసి ప‌రాజ‌యం పాల‌య్యారు. మ‌ళ్లీ 2014 ఎన్నిక‌ల‌కు ముందు టీడీపీలో చేరారు. ఆత‌ర్వాత ఏకంగా ఏపీ టీడీపీ అధ్యక్ష బాధ్య‌త‌లు కూడా ద‌క్కించుకున్నారు.

ఇక ఇప్పుడు తాజా ప‌రిణామాల‌తో జ‌గ‌న్ ని ఎదుర్కోవాలంటే చంద్ర‌బాబు రెడ్డి మంత్రం జ‌పించ‌క త‌ప్ప‌ద‌నే వాద‌న వినిపిస్తోంది. అందుకే ఆయ‌న మ‌రోసారి రెడ్ల‌కు ప‌ట్టం క‌ట్టే ప్ర‌య‌త్నంలో ఉన్నార‌ని తెలుస్తోంది. వాస్త‌వానికి తెలుగుదేశం అధికారంలో ఉన్న‌ప్ప‌టికీ తీవ్ర అవ‌స్థ‌లు ప‌డుతోంది. ఇంటా , బ‌య‌టా స‌మ‌స్య‌లు ఎదుర్కొంటోంది. పార్టీలో ఐక్య‌త దాదాపు క‌నుమ‌రుగ‌వుతోంది. అనేక జిల్లాలో గ్రూపుల మ‌ధ్య వివాదాలు పెరుగుతున్నాయి. తాజాగా వాటికితోడుగా కేంద్రం స‌హ‌కారం అడుగంటుతోంది. ఏపీ ఆర్థిక ప‌రిస్థితి అంతంత‌మాత్రంగానే ఉంది. రాజకీయంగా ప్ర‌త్య‌ర్థులు ఎదురుదాడితో ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే మిత్ర‌ప‌క్షం మొండిచేయితో నిరాశ ప‌రుస్తోంది. ఈ స్థితిలో వ‌చ్చే ఎన్నిక‌ల స‌న్నాహాల్లో భాగంగా తెలుగుదేశం ఏపీ శాఖ అధ్య‌క్ష ప‌ద‌విని ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డికి క‌ట్ట‌బెట్ట‌బోతున్న‌ట్టు ప్రచారం సాగుతోంది.

నెల్లూరు జిల్లాకు చెందిన ఆనం బ్ర‌ద‌ర్స్ ఏడాది క్రితం సైకిలెక్కారు. కాంగ్రెస్ లో కీల‌కంగా వ్య‌వ‌హ‌రించిన బ్ర‌ద‌ర్స్ ఇద్ద‌రికీ త‌గిన గుర్తింపు రావ‌డం లేద‌ని మ‌నోవేధ‌న‌తో ఉన్నారు. ఆత్మ‌కూరు ఇన్ఛార్జ్ గా ఉన్న రామ‌నారాయ‌ణ‌రెడ్డితో పాటు వివేకానంద‌రెడ్డి కూడా ఎమ్మెల్సీ ప‌ద‌వి ఆశించినా రెండుమార్లు చేజారిపోయింది. దాంతో చంద్ర‌బాబు మీద గుర్రుగా ఉన్నారు. నారాయ‌ణ మాట‌లు న‌మ్మి టీడీపీలో చేర‌డం ద్వారా నిలువునా మునిగిపోయామ‌ని ఇప్ప‌టికే వివేకానంద‌రెడ్డి వాపోతున్నారు. ఇక రామానారాయ‌ణ రెడ్డి ప‌రిస్థితి కూడా అంత స‌ఖ్యంగా లేదు. ఆత్మ‌కూరులో ఆయ‌న‌కు పొగ‌బెట్ట‌డానికి టీడీపీ వ‌ర్గాలే ప్ర‌య‌త్నిస్తుండ‌డంతో ఆయ‌న‌కు చికాకుగా మారింది. ఈ నేప‌థ్యంలో రామ‌నారాయ‌ణ‌రెడ్డిని ఏపీ టీడీపీ అధ్య‌క్ష స్థానంలో కూర్చోబెట్ట‌డం ద్వారా వారిని సంతృప్తి ప‌ర‌చ‌డ‌మే కాకుండా జ‌గ‌న్ ని రెడ్ల‌తో ఎదురుదాడి ద్వారా ఎదుర్కోవ‌చ్చ‌నే అంచ‌నాల‌కు వ‌చ్చిన‌ట్టు చెబుతున్నారు.

అయినా అదంత సులువు కాద‌ని టీడీపీ వ‌ర్గాలు భావిస్తున్నారు. ఆనం బ్ర‌ద‌ర్స్ కి అంద‌ల‌మిచ్చి తమ నెత్తిన పెడ‌తామంటే సోమిరెడ్డి స‌హా నారాయ‌ణ కూడా అంగీక‌రించే అవ‌కాశం లేదు. అదే స‌మ‌యంలో టీడీపీలో చాలాకాలంగా ఆనం బ్ర‌ద‌ర్స్ వ‌ల్ల ఇబ్బందులు ఎదుర్కోన్న నేత‌లెవ‌రూ సుముఖ‌త వ్య‌క్తం చేసే ఛాన్స్ లేదు. దాంతో ఆనం బ్ర‌ద‌ర్స్ కి అవ‌కాశం అంటూ సాగుతున్న ప్ర‌చారం కార్య‌రూపం దాల్చ‌డం అనుకున్నంత సులువు కాదు. మ‌రి చంద్ర‌బాబు ఏం చేస్తారో చూడాలి. గ‌తంలో ఏపీసీసీ చీఫ్ గా ప్ర‌య‌త్నించి ఆనం రామ్ నారాయ‌ణ‌రెడ్డి విఫ‌ల‌మ‌య్యారు. ఇప్పుడు ఏపీ టీడీపీ బాధ్య‌త‌లు స్వీక‌రిస్తే మాత్రం ఆశ్చ‌ర్య‌మే అవుతుంది.


Related News

sunitha

రేణూ దేశాయ్ బాట‌లో సింగ‌ర్ సునీత‌

Spread the loveప్ర‌స్తుతం టాలీవుడ్ లో పున‌ర్వివాహాల సీజ‌న్ వ‌చ్చిన‌ట్టు క‌నిపిస్తోంది. ప‌లువురు సినీ ప్ర‌ముఖులు రెండో పెళ్లిళ్ల‌కు సిద్ధ‌మ‌వుతున్నారు.Read More

Actor-Vishal-Krishna-Photo-Gallery-0gybl07

శ్రీరెడ్డికి విశాల్ ఝ‌ల‌క్

Spread the loveకోలీవుడ్ స్టార్, హీరో విశాల్ షాకింగ్ నిర్ణ‌యం తీసుకున్నారు. ముఖ్యంగా శ్రీరెడ్డి వ్య‌వ‌హారంలో ఆయ‌న సీరియ‌స్ గాRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *