Main Menu

టీడీపీ నుంచి బోయ‌పాటికి 15 కోట్లు..!

Spread the love

టాలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్ల‌లో ఒక‌రైన బోయ‌పాటి శ్రీనివాస్ కి టీడీపీతో అవినాభావ సంబంధం ఉంది. ఆది నుంచి ఆయ‌న చంద్ర‌బాబుతో స‌న్నిహితంగా ఉంటారు. అందుకు త‌గ్గ‌ట్టుగానే గ‌తంలో పుష్క‌రాల నుంచి తాజాగా ఎన్నిక‌ల ప్ర‌చారంలో కూడా ఆయ‌న కీల‌కంగా వ్య‌వ‌హ‌రించారు.

అందులో భాగంగానే తెలుగు దేశం పార్టీ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలను, చేసిన అభివృద్దిని వివరిస్తూ రూపొందించిన యాడ్స్ విష‌యంలో బోయ‌పాటిదే ప్ర‌ధాన పాత్ర‌. అలాంటి చాలా యాడ్స్‌ గత నెల రోజులుగా టీవీల్లో మారు మ్రోగి పోయాయి. అలాంటి యాడ్స్ రూప‌క‌ర్త కూడా బోయపాటి శ్రీను కావ‌డం విశేషం. ఆయన దర్శకత్వంలో ప్రతి ఒక్క యాడ్‌ కూడా సినిమా స్థాయిలో రూపొందింది. టీడీపీకి సంబంధించిన ప్రతి యాడ్‌ రూపకల్పనకు బోయపాటి ప్రత్యేక శ్రద్ద తీసుకుని రూపొందించారు.

టీడీపీతో బోయపాటి కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం యాడ్స్‌ మొత్తం నిర్వహణ ఆయనే. అంటే నటీనటుల, ఇతర విషయాలు అన్ని కలిపి బోయపాటి చూసుకోవాల్సి ఉంటుంది.ఇందుకోసం టీడీపీ 5 కోట్ల రూపాయలను బోయపాటికి ఒప్పందం ను అధికారికంగా కుదుర్చుకుంది. అయితే అనధికారికంగా మరో పది కోట్ల వరకు బోయపాటికి ముట్టినట్లుగా తెలుస్తోంది. నెల రోజుల పాటు టీడీపీ కోసం ఎన్నో యాడ్స్‌ను డిజైన్‌ చేయించినందుకు, యాడ్స్‌ షూట్‌ చేసినందుకు గాను బోయపాటి శ్రీను 15 కోట్ల రూపాయలతో పాటు, అధికారంలోకి వచ్చిన తర్వాత లాభంను కూడా పొందేలా అనధికారిక ఒప్పందం చేసుకున్నట్లుగా సమాచారం అందుతోంది. మొత్తానికి ఒక సినిమాను తీస్తే బోయపాటికి పది నుండి 12 కోట్ల వరకు వచ్చే అవకాశం ఉంది. కాని టీడీపీకి యాడ్స్‌ చేయడం వల్ల అంతకు మించిన డబ్బులు వచ్చాయి. బోయపాటి నెల రోజుల్లోనే 15 కోట్ల రూపాయలు సంపాదించాడు అంటూ టాక్‌ వినిపిస్తుంది.






Related News

ప్రేమ- పెళ్లి- విడాకులు- మ‌ళ్లీ పెళ్లి

Spread the loveకొంతకాలం కిందట అధికారికంగా విడిపోయిన మలైకా ఆరోరా- అర్బాజ్ ఖాన్ లు ఇప్పుడు మళ్లీ పెళ్లికి రెడీRead More

సీనియ‌ర్ నేత‌పై జ‌గ‌న్ సీరియ‌స్..!

Spread the loveవైసీపీ నేత‌ల తీరు అధిష్టానానికి ఆగ్ర‌హం క‌లిగిస్తోంది. ముఖ్యంగా కొంద‌రు సీనియ‌ర్ నేత‌ల వ్య‌వ‌హారం జ‌గ‌న్ కిRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *