జగన్ కి ఝలక్!

GOWTHAM REDDY
Spread the love

జగన్ కి ఝలక్ కి తప్పేలా లేదు. సన్నిహితుడు, బంధువుగా భావించి అందలం ఇస్తే హఠాత్తుగా హ్యాండివ్వబోతున్నట్టు సమాచారం. ఇప్పటికే రాజధాని రాజకీయం రంజుగా మార్చేసిన నాయకుడు ఇప్పుడు మరో అడుగువేసే ప్రయత్నంలో ఉన్నట్టు ప్రచారం సాగుతోంది. దాంతో వైసీపీ శ్రేణుల్లో చర్చనీయాంశం అవుతోంది. బెజవాడ రాజకీయాల్లో మరో మలుపు ఖాయంగా ఉంది. వైసీపీ కార్మిక విభాగం రాష్ట్ర అధ్యక్షుడు గౌతమ్ రెడ్డి ఇప్పుడు జగన్ కి గుడ్ బై చెప్పే యోచనలో ఉణ్నట్టు ప్రచారం సాగుతోంది. త్వరలోనే ఆయన కమలం గూటిలో కొలువు దీరబోతున్నట్టు చెబుతున్నారు.

వాస్తవానికి గౌతమ్ రెడ్డి విజయవాడలో సీనియర్ రాజకీయ నాయకుడిగానే చెప్పాలి. వరుసగా పలుమార్లు కార్పోరేటర్ గా గెలిచిన అనుభవం గౌతమ్ రెడ్డిది. అంతకుముందు ఏఐఎస్ఎఫ్ నాయకుడిగా పనిచేశారు. ఆతర్వాత సీపీఐ నేతగా నగర ప్రజలకు సుపరిచితుడే. కానీ తర్వాత వైఎస్ కాలంలో కాంగ్రెస్ లోకి, అక్కడి నుంచి వైసీపీలోకి చేరి గడిచిన ఎన్నికల్లో సెంట్రల్ నియోజకవర్గం నుంచి బరిలో దిగారు. బొండా ఉమా చేతిలో ఓటమి పాలయ్యారు. అయితే ఇప్పుడు హఠాత్తుగా రంగా మీద వ్యాఖ్యలు చేసి కలకలం రేపడమే కాకుండా, పార్టీ నుంచి సస్ఫెండ్ అయ్యారు. మరోవైపు వంగవీటి రాధా తీవ్రస్థాయిలో స్పందించడంతో పార్టీని రోడ్డు పాలుచేసినట్టయ్యింది.

వీటి వెనుక గౌతమ్ రెడ్డికి పక్కా వ్యూహం ఉందనే చర్చ సాగుతోంది. త్వరలో పార్టీ మారడానికి తగ్గట్టుగా ఇప్పటికే కన్నా లక్ష్మీనారాయణ సహా పలువురు బీజేపీ నేతలతో గౌతమ్ రెడ్డి చర్చలు జరిపినట్టు చెబుతున్నారు. బీజేపీలో చేరి వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే వ్యూహంలో ఆయన ఉన్నారు. కానీ టీడీపీ, బీజేపీ పొత్తు కొనసాగడం అనివార్యంగా ఉన్న ప్రస్తుత తరుణంలో గౌతమ్ రెడ్డి కలలు పండడం అంత సులువు కాదు. అయినా బీజేపీ నేతలు హామీ ఇస్తుండడంతో గౌతమ్ రెడ్డి అటు మొగ్గు చూపే అవకాశాలున్నాయంటున్నారు. విజయవాడ నగరంలో ఓ సీటు బీజేపీకిస్తారు కాబట్టి, గతంలో పోటీ చేసిన వెస్ట్ కాకుండా ఈసారి సెంట్రల్ సీటు కోసం పట్టుబట్టి, దానిని గౌతమ్ రెడ్డికి కేటాయిస్తారని కొందరు అంచనాలతో ఉన్నారు.

ఈ నేపథ్యంలోనే గౌతమ్ రెడ్డి వైసీపీ శిబిరాన్ని వివాదాల్లోకి నెట్టి, తన భవిష్యత్తుకు మార్గం వేసుకుంటున్నట్టు కనిపిస్తోంది. అదే సమయంలో జగన్ కి అత్యంత విశ్వాసపాత్రుడిగా, కుటుంబ సన్నిహితుడిగా పేరు పొందినప్పటికీ చివరకు జగన్ కి దూరం కావడానికి పెద్దగా సమయం పట్టదనే చెబుతున్నారు. అదే జరిగితే జగన్ కి మరో తలనొప్పి వ్యవహారమే అవుతుందనడంలో సందేహం లేదు.


Related News

kamineni

క‌మ‌లానికి కామినేని గుడ్ బై

Spread the loveఏపీలో బీజేపీ ఇద్ద‌రు మంత్రులు చెరోదారిలో సాగుతున్నారు. రాష్ట్రంలో బీజేపీని బ‌ద్నాం చేయ‌డానికి టీడీపీ ప్ర‌య‌త్నిస్తున్న‌ప్ప‌టికీ మంత్రిRead More

cbn

మ‌ళ్లీ చంద్ర‌బాబు వెన‌క‌డుగు…

Spread the loveఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు మ‌రోసారి వెన‌క‌డుగు వేశారు. ఆయ‌న ప్ర‌క‌టించిన దానికి భిన్నంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఏపీRead More

 • నీర‌వ్ కోసం మోడీ చేసిన మేలు తెలుసా…?
 • బీజేపీ బంధంపై టీడీపీలో విబేధాలు
 • శ్రియ పెళ్లికూతురవుతోంది..
 • ఎన్టీఆర్ కి నో చెప్పిన నిత్యామీనన్
 • టాలీవుడ్ స్టార్ ప్రేమలో రకుల్?
 • మోడి మెలిక: బాబు కినుక!
 • పోర్న్ స్టార్లపై పూనమ్ కౌర్ సంచలన వ్యాఖ్యలు
 • ప్రభాస్ సినిమా సెట్లో అనుష్క
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *