Main Menu

గంటా క్లీన్ చిట్ వెనుక అస‌లు కార‌ణం అదేనా?

Spread the love

గంటా శ్రీనివాస‌రావుకి భూ దందా విష‌యంలో స‌ర్కారు నియ‌మించిన ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందం క్లీన్ చిట్ ఇవ్వ‌డం చ‌ర్చ‌నీయాంశం అవుతోంది గంటా శ్రీనివాస‌రావు మాత్రం త‌న నిజాయితీకి ఇది నిద‌ర్శ‌నంగా చెప్పుకుంటున్నారు. నిష్ప‌క్ష‌పాతంగా సాగిన విచార‌ణ‌తో తానేంటో నిరూపితం అయ్యింద‌ని చెప్పుకుంటున్నారు. త‌న ఆస్తులు పెరిగాయని చెబుతున్న ప్ర‌చారంలో వాస్త‌వం లేదంటూ చెప్పుకొచ్చారు. అన‌కాప‌ల్లి ఎంపీ అయిన‌ప్పుడు ఎంత జీతం ఉందో ఇప్పుడు కూడా అంతేన‌ని ఆయ‌న వివ‌రించారు.

అయితే తాజా క్లీన్ చిట్ వెనుక అస‌లు క‌థ వేరుగా ఉంద‌నే ప్ర‌చారం సాగుతోంది. ముఖ్యంగా టీడీపీ వ్య‌వ‌హారాల్లో కీల‌కంగా మారిన చిన‌బాబు కార‌ణంగానే గంటా శ్రీనివాస‌రావు చేతికి మ‌ట్టి అంట‌కుండా బ‌య‌ట‌ప‌డ్డార‌ని చెబుతున్నారు. అందుకు భారీగా ఖ‌ర్చ‌య్యి ఉంటుంద‌ని కూడా అనుమానిస్తున్నారు. అదేస‌మ‌యంలో త‌న‌కు క్లీన్ చిట్ ఇవ్వాల్సిందేనంటూ నెల రోజుల క్రితం ఆయ‌న టీడీపీ మీద అల‌క‌బూనిన విష‌యం అంద‌రూ గుర్తు చేస్తున్నారు.

ఆ సంద‌ర్భంగా రాయ‌బారం న‌డిపిన డిప్యూటీ సీఎం చిన‌రాజ‌ప్ప ఈ విష‌యంలో హామీ ఇచ్చిన త‌ర్వాతే గంటా సంతృప్తి చెందార‌ని అప్ప‌ట్లో సాగిన చ‌ర్చ‌కు త‌గ్గ‌ట్టుగానే తాజా ప‌రిణామాలున్న‌ట్టుగా చెబుతున్నారు. ఏమ‌యినా విశాఖ భూక‌బ్జాల్లో అధికార పార్టీ పెద్ద‌ల పాత్ర లేకుండా విప‌క్ష నేత‌లే చేశార‌ని అన‌డం ప‌ట్ల సాగ‌ర‌న‌గ‌ర వాసుల్లో విస్మ‌యం క‌నిపిస్తోంది.






Leave a Reply

Your email address will not be published. Required fields are marked *