హీరోయిన్ దొరికిపోయింది…

tiger-disha-mos_050516013518
Spread the love

వరుణ్ తేజ్ హీరోయిన్ దొరికిపోయింది. చాటుమాటుగా చక్కబెడుతున్న వ్యవహారాలు బట్టబయలయ్యాయి. దాంతో బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ ప్రేమ వ్యవహారం హాట్ టాపిక్ అయ్యింది. కింగ్ ఫిష‌ర్ క్యాలెండ‌ర్ టు బాలీవుడ్, బాలీవుడ్ టు టాలీవుడ్ ఈ అమ్మ‌డి ప‌య‌నం గురించి తెలిసిందే. తెలుగులో లోఫ‌ర్ ఆశించిన ఫ‌లితాన్ని ఇవ్వ‌క‌పోయినా బాలీవుడ్‌లో మాత్రం కెరీర్ ప‌రంగా సంతృప్తిగానే ఉంది. బ్లాక్‌బ‌స్ట‌ర్లు కొట్టేయ‌క‌పోయినా అవ‌కాశాల‌కేం కొద‌వ లేద‌క్క‌డ‌. ఇక సినిమాల‌తో కంటే దిశా ప‌టానీ పేరు ఎఫైర్ల‌తోనే మార్మోగిపోతోంది. అక్క‌డ మార్ష‌ల్ ఆర్ట్స్ హీరో టైగ‌ర్ ష్రాఫ్‌తో ప్రేమాయ‌ణం సాగిస్తూ నిరంత‌రం వార్త‌ల్లో నిలుస్తోంది. ఈ జంట ఎవ‌రికీ అంతుచిక్క‌కుండా షికార్లు చేస్తోంది.

తాజాగా వేరొక సంద‌ర్భంలో ఇలా సీక్రెట్‌గా విదేశాల‌కు వెళ్లిపోతూ విమానాశ్ర‌యంలో దొరికిపోయారు. ఒక‌రికి తెలియ‌కుండా ఒక‌రు విదేశాలు వెళుతున్న‌ట్టు, కొత్త సంవ‌త్స‌రం వేడుక‌ల కోస‌మే ఈ ప‌య‌నం అన్న‌ట్టు బిల్డ‌ప్ ఇచ్చే ప్ర‌య‌త్నం చేసి చివ‌రికి దొరికిపోయారు. ఎలానూ పాత సంవ‌త్స‌రానికి బాయ్ బాయ్ చెప్పేసి కొత్త సంవ‌త్స‌రానికి వెల్‌కం చెప్పాలంటే విదేశాల్లో సెల‌బ్రేష‌న్ అయితేనే బావుంటుంద‌ని ప్లాన్ వేసుకున్న ఈ ప్రేమ జంట .. విదేశీయానానికి ప్లాన్ చేశారు. అయితే ఎవ‌రికి వారు విమానాశ్ర‌యానికి విడివిడిగా వ‌చ్చి అక్క‌డ గుట్టు చ‌ప్పుడు కాకుండా విమానం ఎక్కేయాల‌ని ప్లాన్ వేశారు. కానీ ఆ ప్లాన్ బెడిసికొట్టింది. ఎందుకంటే అప్ప‌టికే అక్క‌డ ర‌ణ‌వీర్ సింగ్ లాంటి హీరో కూడా విదేశీయానం కోసం ప్లాన్డ్‌గా ఉన్నాడు. ప్ర‌స్తుతం ఆ ఫోటోలు నెట్లో వైర‌ల్ అవుతున్నాయి. దిశా ప‌టానీ – టైగ‌ర్ జంట ఓ సినిమాలో న‌టించిన సంగ‌తి తెలిసిందే. ఆ క్ర‌మంలోనే దిశా టైగ‌ర్ ఫ్యామిలీకి బాగా ద‌గ్గ‌రైంది. టైగ‌ర్ ష్రాఫ్ సోద‌రి కృష్ణా ష్రాఫ్ దిశాకి బాగా క్లోజ్‌ఫ్రెండ్‌. ఇక టైగ‌ర్ మ‌మ్మీ అయేషా దిశాని ఎంతో గారాబం చేస్తూ చూసుకుంటోందిట‌. పైకి ప్రేమ‌వ్య‌వ‌హారం చెప్ప‌క‌పోయినా, ఆ జంట మ‌ధ్య చాలా మ్యాట‌ర్ ర‌న్ అవుతున్న సంగ‌తి ఇరు ఫ్యామిలీస్‌లోనూ తెలుసు. అయితే కెరీర్ ప‌రంగా ఇంకా ఆరంభంలోనే ఉన్నారు కాబట్టి అన‌వ‌స‌ర ప‌బ్లిసిటీ కోరుకోవ‌డం లేదుట‌. అందుకే ఈ చాటు మాటు తిప్ప‌ల‌న్నీ!


Related News

anushka

ప్రభాస్ సినిమా సెట్లో అనుష్క

Spread the loveరెబల్ స్టార్ ప్రభాస్, జేజమ్మ అనుష్క మధ్య వ్యవహారాలు రోజురోజుకి ఆసక్తిగా మారుతున్నాయి. వారి సాన్నిహిత్యం మరింతRead More

nitya menon

నిత్యామీనన్ లిప్ లాక్ ఎవరితో తెలుసా

Spread the loveవినూత్న పాత్రలతో ముందుకెళ్తూ తనదైన సహజ నటనతో ఆకట్టుకునే మలయాళ కుట్టీ నిత్యమీనన్ మరో విభిన్నపాత్రలో కనిపించనుందట.Read More

 • తల్లి అవుతున్న కాజల్
 • ఉమ్మడి ప్రయోజనాల కోసమే కేసీఆర్, పవన్ భేటీ
 • హీరోయిన్ దొరికిపోయింది…
 • హీరోగారమ్మాయి డేటింగ్ వ్యవహారం..
 • కన్నతల్లిని ఖాతరు చేయని శ్రుతి హాసన్?
 • కొత్త రూపంలో బన్నీ
 • రేసు నుంచి రవితేజ అవుట్
 • తారక్, చెర్రీ మువీకి తార ఆమె..
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *