Main Menu

జ‌న‌సేన‌లో తొలి వికెట్ ప‌డిందా..?

Spread the love

ఇదే చ‌ర్చ సాగుతోంది. సంచ‌ల‌నంగా మారుతోంది. ఇంకా పూర్తిగా కార్య‌వ‌ర్గం స‌హా నిర్మాణ ఏర్పాట్లు కూడా జ‌ర‌గ‌క‌ముందే జ‌న‌సేన కి ఓ నాయ‌కుడు గుడ్ బై చెబుతున్నార‌నే వార్త ఆస‌క్తిగా మారింది. అది కూడా క‌త్తిమ‌హేష్ వెలుగులోకి తీసుకురావ‌డం ఆశ్చ‌ర్యంగా మారింది. క‌ల్యాణ్ దిలీప్ సుంక‌ర అంటూ అనూహ్యంగా జ‌న‌సేన అధికార ప్ర‌తినిధి పేరు చెప్పుకుని తెర‌మీద‌కు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. అనేక అంశాల‌లో పార్టీ నాయ‌కుల‌తో చ‌ర్చించ‌కుండానే ఆయ‌న మీడియా ముందు మాట్లాడ‌డంపై జ‌న‌సేన అధినేత సీరియ‌స్ అయ్యారు. దిలీప్ సుంక‌ర కామెంట్స్ తో త‌మ పార్టీకి సంబంధం లేద‌ని ప్ర‌క‌టించారు. ఆ త‌ర్వాత కొద్దిరోజుల పాటు ఆయ‌న్ని జ‌న‌సేన ప్ర‌తినిధిగా స్టూడియోల‌కు పిల‌వ‌కూడ‌ద‌ని కూడా వివిధ మీడియా సంస్థ‌ల‌ను కోరిన‌ట్టు ప్ర‌చారం సాగింది.

అయినా దిలీప్ సుంక‌ర మాత్రం పార్టీని వెంట‌బెట్టుకుని ఉన్నారు. ఫేస్ బుక్ లైవ్ ల‌తో జ‌న‌సేన‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ వాద‌న వినిపించ‌డానికి ప్ర‌య‌త్నించారు. కానీ హ‌ఠాత్తుగా ఆయ‌న జ‌న‌సేన‌కు గుడ్ బై చెబుతున్న‌ట్టు ఓ పోస్ట్ చేయ‌డం క‌ల‌క‌లం రేపింది. ఆయ‌నే చేశార‌ని క‌త్తి మ‌హేష్ దానిని షేర్ చేశారు. కానీ కొంద‌రు జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు మాత్రం దాన్ని తోసిపుచ్చుతున్న తీరు విశేషంగా మారింది.

ఇటీవ‌ల జ‌న‌సేన అధికార ప్ర‌తినిధుల‌ను నియ‌మించింది. 8మందికి ప‌దవులు క‌ట్ట‌బెట్టారు. అందులో ప‌ది రోజుల క్రిత‌మే బీజేపీ నుంచి వ‌చ్చి జ‌న‌సేన‌లో చేరిన నాయ‌కులు కూడా ఉన్నారు. అలాంటి వారికి అవ‌కాశాలు క‌ల్పించి త‌న‌ను విస్మ‌రించ‌డంతో దిలీప్ సుంక‌ర హ‌ర్ట్ అయిన‌ట్టు ప్ర‌చారం చేస్తున్నారు. అందుకే ఇలాంటి పోస్ట్ పెట్టి, జ‌న‌సేన అభిమానిగా కూడా ఉండ‌లేనంటూ పేర్కొన్నార‌ని చెబ‌తున్నారు. అదే స‌మ‌యంలో స్క్రీన్ షాట్ షేర్ చేసిన క‌త్తి మ‌హేష్ వాద‌న‌కు భిన్నంగా దిలీప్ సుంక‌ర వాల్ మీద శ్రీరామ న‌వ‌మి త‌ర్వాత పోస్టులే క‌నిపించ‌డం లేదు. దాంతో ఈ వ్య‌వ‌హారం ఆస‌క్తిగా మారింది. ఇదో రాజ‌కీయ ఎత్తుగ‌డా అనే అనుమానం కూడా బ‌ల‌ప‌డుతోంది.

కత్తి మహేశ్ ట్వీట్ ఇదీ..క‌త్తి మ‌హేష్ ట్వీట్ నిజ‌మైతే జ‌న‌సేన‌లో తొలి వికెట్ ప‌డిన‌ట్టుగానే భావించాల్సి ఉంటుంది.
kalyan-dileep-sunkara


Related News

డైరెక్ట‌ర్ ర‌వితేజ‌..హీరో క‌ళ్యాణ్ రామ్!

Spread the loveరవితేజ కెరీర్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా ప్రారంభమైన విషయం విదితమే. హీరోగా రాణిస్తూ అగ్ర నటుల్లో ఒకరిగా నిలిచినRead More

ఆలియా కే ఆర్ఆర్ఆర్

Spread the loveబాలీవుడ్ బ్యూటీ ఎంట్రీ ఖాయం అయ్యింది. గ‌తంలోనే ప‌లు సినిమాల‌లో అనుకున్న‌ప్ప‌టికీ ఆటంకాలు వ‌చ్చాయి. కానీ ఇప్పుడుRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *