మోడి మెలిక: బాబు కినుక!

chandrababu
Spread the love

నియోజకవర్గాల పెంపుదల వ్యవహారం ప్రత్యేక హోదా మాదిరిగానే నానుతోంది. అయితే హోదా వ్యవహారం గోదాలోకి నెట్టేసినట్టు బీజేపీ సిగ్నల్ ఇస్తుండగా, డీలిమిటేషన్ మాత్రం నాన్చుతూ వస్తోంది. పార్లమెంట్ లో సాధ్యం కాదని ప్రకటిస్తూనే బయట మిత్రపక్ష టీడీపీని ఊరిస్తోంది. అటు తెలంగాణాలో నమ్మకమైన మిత్రుడిలా మారిన కేసీఆర్ ని కూడా ఊహాల్లో ఊరేగిస్తోంది.

ఈ నేపథ్యంలో మరోసారి ఈ అంశం తెరమీదకు వచ్చింది. మోడీ సై అన్నారని సంకేతాలు వచ్చేశాయి. షా కూడా సై అంటే సిగ్నల్ పడినట్టేనని ప్రచారం సాగుతోంది. అయితే ఈ విషయంలో బీజేపీ పెట్టిన మెలిక టీడీపీని కలవరపాటుకి గురిచేస్తోంది. నియోజకవర్గాల పెంపుదలకు అంగీకరిస్తూనే పెరిగిన సీట్ల సంఖ్యకు తగ్గట్టుగా తమకు అదనపు సీట్లు కేటాయించాలని మెలికపెట్టినట్టు కథనాలు వస్తున్నాయి. 175 నుంచి 225కి సీట్లు పెంచాలంటే తమకు 75 సీట్లు కావాలని బీజేపీని షరతు పెట్టడం చర్చనీయాంశం అవుతోంది. గడిచిన ఎన్నికల్లో ఏపీలో బీజేపీకి కేవలం 12 సీట్లు మాత్రమే పోటీ చేయడానికి అవకాశం దక్కింది. అందులో నాలుగు చోట్ల గెలిచారు. ఇప్పుడు ఏకంగా 75 సీట్లు అడగడం అంటే కనీసంగా 50 కోసం పట్టుబట్టే అవకాశం ఉంది. చివరకు 40కి అంగీకరించినా ఆశ్చర్యపడాల్సిన పనిలేదు.

ఒకవేళ ఏపీలో చంద్రబాబు కూటమి మరోసారి పీఠం ఎక్కితే అప్పుడు బీజేపీకి కనీసం 20 సీట్లు వస్తాయి. అంటే ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా మారుతుంది. మరోవైపు జనసేన కి కూడా మరికొన్ని స్థానాలు కేటాయించాల్సి ఉన్న నేపథ్యంలో కొత్త ప్రభుత్వం మిత్రపక్షాల మీద ఆధారపడక తప్పని స్థితి ఏర్పడుతుంది. అది భవిష్యత్తులో బీజేపీ ఎదుగుదలకు దోహదం చేస్తుంది. అందుకే బీజేపీ అలాంటి మెలికపెట్టినట్టు చంద్రబాబు సందేహిస్తున్నారు. దాంతో నియోజకవర్గాల పెంపుదల కోసం గట్టిగా పట్టుపట్టలేక సతమతం అవుతున్నారు.

నిజంగా ఏపీలో బీజేపీ బలపడడం అంటే టీడీపీకి పునాదిగా కమ్మ సామాజికవర్గంలో చీలిక ఖాయం. తద్వారా కాపుల పార్టీగా జనసేన ముందుకు వస్తుండడం, కమ్మ వర్గంలో చీలిక ద్వారా బీజేపీ బలపడడం జరిగితే టీడీపీ పునాదులు కూలిపోతాయి. అందుకే భవిష్యత్తులో తన తనయుడిని రాజకీయంగా ఎదిగించాలనే ఆశతో ఉన్న చంద్రబాబుకి ఇవి మింగుడుపడని పరిణామాలు. దాంతో ఎటూ తేల్చుకోలేక తల్లడిల్లిపోతున్నట్టు చెబుతున్నారు. నియోజకవర్గాల పెంపుదల విషయంలో సుజనా చౌదరికి కబురు వస్తే ఏం చెప్పాలన్న దానిపై టీడీపీ నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు. దాంతో ఇన్నాళ్లుగా నియోజకవర్గాలు పెంచాలని ఆశించిన టీడీపీ ఆచితూచి అడుగులేయక తప్పని స్థితిలో పడింది.


Related News

Mass-Maharaja-Ravi-Teja-new-film-titled-Nela-Ticket

నేలటికెట్ లో చిరంజీవి మువీ

Spread the loveఆశ్చర్యకరమే అయినా ప్రస్తుతం ఇదో హాట్ టాపిక్ అవుతోంది. రవితేజ లేటెస్ట్ మువీ నేలటికెట్ సినిమాలో పలుRead More

apcabinet

మంత్రులు మారిపోతున్నారు..!

Spread the loveఏపీలో క్యాబినెట్ లో పలువురు మంత్రులు మారబోతున్నట్టు తెలుస్తోంది. దానికి తగ్గట్టుగా సీఎం కసరత్తు కూడా ప్రారంభించినట్టుRead More

 • చిరుతో శివ!
 • చంద్రబాబుకి సన్నిహితుడి షాక్
 • ఏపీ ఎన్నికలపై ఆసక్తికర సర్వే
 • పునరాలోచనలో పురందేశ్వరి!
 • వైసీపీతో మంత్రి మంత‌నాలు?
 • అభ్య‌ర్థుల‌ను మార్చేస్తున్న వైసీపీ!
 • శ్రీరెడ్డికి భారీ ఛాన్స్
 • ప‌వ‌న్ ఎఫెక్ట్: బాబు స‌న్నిహితుడిపై వేటు?
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *