ప‌వ‌న్ తీరుతో చిరు అప్ సెట్..!

chiru
Spread the love

ప‌వ‌ర్ స్టార్ వ్య‌వ‌హారం మెగాస్టార్ కి మింగుడుప‌డ‌డం లేదా…త‌మ్ముడి తీరుతో అన్న‌య్య క‌ల‌త చెందుతున్నారా…గ‌తంలోనే ఆడియో ఫంక్ష‌న్ సాక్షిగా త‌న మ‌న‌సులో మాట‌ను బ‌య‌ట‌పెట్టిన చిరంజీవి మ‌రోసారి ప్రైవేటుగా అలాంటి స‌ల‌హానే ఇచ్చారా…అప్పుడు కాద‌న్న ప‌వ‌న్ క‌ల్యాణ్..మ‌రోసారి అన్న స‌ల‌హాను పాటించేది లేద‌ని తేల్చేశారా..ఇదే ప్ర‌చారం సాగుతోంది. ప్ర‌జారాజ్యం అనుభ‌వంతో జ‌న‌సేనానికి ఇచ్చిన స‌ల‌హాను ఆయ‌న పాటించ‌క‌పోవ‌డంతో చిరంజీవి నొచ్చుకున్నార‌ని కూడా చెబుతున్నారు. దాంతో ఇద్ద‌రి మ‌ధ్య మ‌రోసారి గ్యాప్ బ‌య‌ట‌ప‌డింద‌ని టాలీవుడ్ వ‌ర్గాలు భావిస్తున్నాయి.

రాజ‌కీయాలు మ‌రోసారి కొణిదెల వారి ఇంట్లో క‌ల‌హానికి కార‌ణ‌మ‌వుతున్న‌ట్టు క‌నిపిస్తోంది, ఫుల్ టైమ్ పొలిటీషియ‌న్ గా మారుతున్న‌ట్టు పీకే చేసిన ప్ర‌క‌ట‌న చిరంజీవిని అప్ సెట్ చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. ప‌వ‌న్ తీరు గురించి బాగా తెలిసిన చిరంజీవి, ఆయ‌న వ్య‌వ‌హార‌శైలి రాజ‌కీయాల‌కు స‌రిపోద‌ని బ‌లంగా న‌మ్ముతున్న‌ట్టు ఇప్ప‌టికే స్ప‌ష్ట‌మ‌య్యింది. గ‌తంలోనే ఆయ‌న నేరుగా సూచించారు. అప్ప‌ట్లో కూడా ఫ్యామిలీ వేరు, పొలిటిక్స్ వేరు అని చెప్పిన ప‌వ‌న్ ఇప్పుడు అదే రీతిలో ముందుకెళుతున్న‌ట్టు తాజా ప్ర‌క‌ట‌నను బ‌ట్టి అర్థ‌మ‌వుతోంది. తాను అంగీక‌రించిన సినిమా పూర్తికాగానే అక్టోబ‌ర్ నుంచి ప్రజల మ‌ధ్య ఉంటాన‌ని ప‌వ‌న్ చేసిన ప్ర‌క‌ట‌న మెగా ఫ్యామిలీకి మింగుడుప‌డ‌డం లేదంటున్నారు.

ఇక అక్టోబర్ నుంచి పూర్తి సమయం రాజకీయాలకే కేటాయిస్తానని విజయవాడ సభలో ప్రకటించారు. కానీ చిరంజీవి మాత్రం సినిమాలు కొన‌సాగిస్తూ రాజ‌కీయాలు చేయాల‌ని సూచిస్తున్నారు. ప‌వ‌న్ దానికి భిన్నంగా తాను అంగీక‌రించిన సినిమా ఒక‌టుంద‌ని, ఆ ఒక‌టి రెండు సినిమాల త‌ర్వాత రాజ‌కీయాలేన‌ని తేల్చేయ‌డం క‌ల‌క‌లం రేపుతోంది. అన్న‌య్య మాట‌ను కాద‌ని త‌మ్ముడు తీసుకున్న నిర్ణ‌యంతో పెద్దాయ‌న అప్ సెట్ అయిన‌ట్టు చెబుతున్నారు. ప్ర‌జారాజ్యం పార్టీ కోసం త‌న శ్ర‌మ బూడిద‌లో పోసిన ప‌న్నీర‌య్యింద‌ని భావిస్తున్న చిరంజీవి, అదే త‌ప్పిదం పున‌రావృతం కాకూడ‌ద‌న్న ప‌ట్టుద‌ల‌తో ఉన్న‌ట్టు క‌నిపిస్తోంది. సినిమాలు చేస్తూ రాజ‌కీయాలు సాగిస్తుంటే ఎటు శ్రేయ‌స్క‌రం అయితే అటు ఉండ‌వ‌చ్చ‌న్న‌ది ఆయ‌న అభిప్రాయం. కానీ ప‌వ‌న్ మాత్రం ప్ర‌జ‌ల మ‌ధ్య ఉండ‌బోతున్నారు. ఈ ప‌రిణామాలు ఎక్క‌డికికి దారితీస్తాయో చూడాలి.


Related News

Pawan-Kalyan

పోర్న్ స్టార్లపై పూనమ్ కౌర్ సంచలన వ్యాఖ్యలు

Spread the loveప్రస్తుతం పోర్న్ స్టార్ల సందడి కనిపిస్తోంది. ఇప్పటికే సన్నీలియోన్ బాలీవుడ్ లో పాగా వేసింది. తాజాగా రామ్Read More

anushka

ప్రభాస్ సినిమా సెట్లో అనుష్క

Spread the loveరెబల్ స్టార్ ప్రభాస్, జేజమ్మ అనుష్క మధ్య వ్యవహారాలు రోజురోజుకి ఆసక్తిగా మారుతున్నాయి. వారి సాన్నిహిత్యం మరింతRead More

 • నిత్యామీనన్ లిప్ లాక్ ఎవరితో తెలుసా
 • తల్లి అవుతున్న కాజల్
 • ఉమ్మడి ప్రయోజనాల కోసమే కేసీఆర్, పవన్ భేటీ
 • హీరోయిన్ దొరికిపోయింది…
 • హీరోగారమ్మాయి డేటింగ్ వ్యవహారం..
 • కన్నతల్లిని ఖాతరు చేయని శ్రుతి హాసన్?
 • కొత్త రూపంలో బన్నీ
 • రేసు నుంచి రవితేజ అవుట్
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *