Main Menu

చిరంజీవి సాహ‌సాలు

Spread the love

స్టార్‌ హీరోలు సైతం తమ అభిమానులను ఎంటర్‌టైన్‌ చేసేందుకు ఎలాంటి సాహసానికైనా సిద్ధపడుతున్నారు. ఇటీవల ‘118’ చిత్రంలోని వాటర్‌ సీక్వెన్స్‌ కోసం డీప్‌ డ్రైవ్‌ చేసి కళ్యాణ్‌రామ్‌ పెద్ద సాహసం చేశారు. తాజాగా మెగాస్టార్‌ చిరంజీవి కూడా ఈ తరహా సాహసం చేసేందుకు రెడీ అవుతున్నారు. ఆయన నటిస్తున్న ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రం కోసం అండర్‌ వాటర్‌ యాక్షన్‌ సీక్వెన్స్‌ (నీటి లోపల యుద్ధం) చేయబోతున్నారు. ఈ సినిమాలో కొన్ని అండర్‌వాటర్‌ వార్‌ సీక్వెన్స్‌లున్నాయట. వాటిని తెరకెక్కించేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. ఈ షెడ్యూల్‌ ముంబయిలో జరుగనుంది.

ఇప్పటికే టీమ్‌ ముంబయికి చేరుకుంది. ప్రత్యేకంగా డిజైన్‌ చేసిన భారీ స్విమ్మింగ్‌ పూల్‌లో ఈ యాక్షన్‌ ఘట్టాలను తెరకెక్కించబోతున్నారు. దీని కోసమై హాలీవుడ్‌ నుంచి ప్రత్యేకంగా యాక్షన్‌ టీమ్‌ను రప్పించారట. వారి సారథ్యంలో ఇప్పటికే చిరంజీవి ట్రైనింగ్‌ తీసుకుంటున్నట్టు, అందుకోసం ఫిట్‌గా తయారైనట్టు సమాచారం. సురేందర్‌రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్స్‌ కంపెనీ పతాకంపై రామ్‌చరణ్‌ నిర్మిస్తున్నారు. చిరంజీవి సరసన నయనతార కథానాయికగా నటిస్తుంది. తమన్నా, అమితాబ్‌ బచ్చన్‌, విజరు సేతుపతి, జగపతిబాబు, సుదీప్‌ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది వేసవిలో విడుదల కానుంది.






Related News

డైరెక్ట‌ర్ ర‌వితేజ‌..హీరో క‌ళ్యాణ్ రామ్!

Spread the loveరవితేజ కెరీర్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా ప్రారంభమైన విషయం విదితమే. హీరోగా రాణిస్తూ అగ్ర నటుల్లో ఒకరిగా నిలిచినRead More

ఆలియా కే ఆర్ఆర్ఆర్

Spread the loveబాలీవుడ్ బ్యూటీ ఎంట్రీ ఖాయం అయ్యింది. గ‌తంలోనే ప‌లు సినిమాల‌లో అనుకున్న‌ప్ప‌టికీ ఆటంకాలు వ‌చ్చాయి. కానీ ఇప్పుడుRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *