మ‌ళ్లీ చంద్ర‌బాబు వెన‌క‌డుగు…

cbn
Spread the love

ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు మ‌రోసారి వెన‌క‌డుగు వేశారు. ఆయ‌న ప్ర‌క‌టించిన దానికి భిన్నంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఏపీ ప్ర‌యోజ‌నాల విష‌యంలో కేంద్రంతో పోరాడ‌డానికి అఖిల‌ప‌క్ష స‌మావేశం ఏర్పాటు చేస్తాన‌ని నిన్న పోల‌వ‌రంలో ప్ర‌క‌టించిన చంద్ర‌బాబు 24గంట‌లు గ‌డ‌వ‌క‌ముందే మ‌రో తీరులో వ్య‌వ‌హ‌రించారు. తాజాగా టీడీపీ స‌మ‌న్వ‌య‌క‌మిటీ భేటీ త‌ర్వాత అధికారికంగా ప్ర‌క‌టించిన దాని ప్ర‌కారం ఏపీలో అఖిల‌ప‌క్ష భేటీ జ‌రిగే అవ‌కాశం క‌నిపించ‌డం లేదు. కేవ‌లం అఖిల‌సంఘాల భేటీకి మాత్ర‌మే కేంద్రం సై అంటోంది. త‌ద్వారా రాజ‌కీయ పార్టీల‌ను మాత్ర‌మే కాకుండా ఇత‌ర సంఘాలు, ఎన్జీవోల స‌హా ఉద్యోగ సంఘాల ప్ర‌తినిధులు అనేక‌మందిని ఆహ్వానించే అవ‌కాశం క‌నిపిస్తోంది. త‌ద్వారా అఖిల‌ప‌క్ష పార్టీల స‌మావేశం స్థానంలో వివిధ సంఘాల భేటీకి స‌న్న‌ద్ధ‌మ‌వుతున్న‌ట్టు తెలుస్తోంది.

వాస్త‌వానికి ప్ర‌స్తుతం ఏపీ ప్ర‌యోజ‌నాలు నెర‌వేరాలంటే కేంద్రంతో రాజ‌కీయ పోరాటం అత్య‌వ‌స‌రం. దానికి త‌గ్గ‌ట్టుగానే రాజీనామాలు, అవిశ్వాసం అంటూ రాజ‌కీయ ఎత్తుల చుట్టూ చ‌ర్చ సాగుతోంది. కానీ చంద్ర‌బాబు మాత్రం రాజ‌కీయంగా ఎదుర్కోవ‌డానికి సిద్ధంగా ఉన్న‌ట్టు క‌నిపించ‌డం లేదు. దాని ఫ‌లితంగా రాజ‌కీయ పార్టీల స్థానంలో ఇత‌ర సంఘాల‌ను ఆహ్వానిస్తున్నారు. కార్యాచ‌ర‌ణకు సిద్ద‌మంటూ చెబుతున్నారు. వాస్త‌వానికి రాజ‌కీయ పార్టీల‌ను ఆహ్వానిస్తే ఏపీలో బ‌లం లేక‌పోయినా కాంగ్రెస్ కేంద్రంలో ప్ర‌తిప‌క్షంలో ఉంది కాబ‌ట్టి పిల‌వాల్సి ఉంటుంది. వారి మ‌ద్ధ‌తు తీసుకుంటే పార్ల‌మెంట్ లో ఏపీ ప్ర‌యోజ‌నాల కోసం సాగే పోరాటంలో కొంత ఉప‌యోగం ఉంటుంది. సీపీఎం వంటి పార్టీల బ‌లం కూడా అదే రీతిలో తోడ్ప‌డుతుంది. కానీ చంద్ర‌బాబు మాత్రం రాజ‌కీయ పార్టీల‌కు బ‌దులుగా ప్ర‌జా సంఘాల‌ను పిల‌వాల‌ని భావించ‌డం ఏపీ ఆశ‌ల‌కు ఏమాత్రం ప్ర‌యోజ‌నం చేకూరుస్తుంద‌నే చ‌ర్చ మొద‌ల‌వుతోంది. గ‌తంలో కూడా స‌మైక్యాంధ్ర ఉద్య‌మంలో రాజ‌కీయాల‌కు అతీతంగా ప్ర‌జాసంఘాల పేరుతో సాగించిన ఉద్య‌మాల ప్ర‌భావం ఏమేర‌కు ఫ‌లించింద‌నే దానిపై భిన్నాభిప్రాయాలున్నాయి.

అయితే చంద్ర‌బాబు నిర్ణ‌యం వెనుక కార‌ణాల‌పై ప‌లు అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. రాజకీయ పార్టీల‌ను ఆహ్వానిస్తే దాదాపుగా అన్ని పార్టీలు టీడీపీ తీరు మీద దుయ్య‌బ‌ట్ట‌డం ఖాయంగా ఉంది. దాంతో పార్టీల దాడి నుంచి త‌ప్పించుకోవ‌డంలో భాగంగా అఖిల‌సంఘాల పేరుతో స‌మావేశానికి పిలుస్తున్నార‌ని ప‌లువురు భావిస్తున్నారు. దానివ‌ల్ల ఫ‌లితాలు ఏమేర‌క‌నే దాని మీద కూడా చాలామంది పెద‌వి విరుస్తున్నారు.


Related News

Rangasthalam_5745

రంగ‌స్థ‌లం స్టోరీ లీక్..

Spread the love1Shareమెగా ప‌వ‌ర్ స్టార్ రామ‌చ‌ర‌ణ్ లేటెస్ట్ మువీ సినిమా రిలీజ్ కి సిద్దం అయ్యింది. వ‌చ్చే వారిRead More

janasena pawan kalyan

ప‌వ‌న్ త‌డ‌బాటు..

Spread the loveజ‌న‌సేనాని త‌డ‌బ‌డుతున్నారు. త‌ప్ప‌ట‌డుగులు వేస్తూ రాజ‌కీయంగా కొంత గంద‌ర‌గోళంలో ఉన్న‌ట్టు క‌నిపిస్తున్నారు. దాంతో ప‌వ‌న్ తీరు చాలామందినిRead More

 • బాల‌య్య హీరోయిన్ పెళ్లి చేసేసుకుంది..
 • ముంద‌స్తు ముప్పు త‌ప్పంది…!
 • రాజ‌కీయాల్లో కీల‌కం కాబోతున్న హీరోయిన్
 • రాజ్య‌స‌భ కోసం బీజేపీకి వైసీపీ తాయిలాలు…!
 • మంత్రి ప‌దవుల కోసం మొద‌ల‌యిన లాబీయింగ్
 • వైసీపీ వ్యూహాత్మ‌క త‌ప్పిద‌మేనా?
 • ఎమ్మెల్యేల‌ను త‌ర‌లిస్తున్న జ‌గ‌న్
 • హాట్ ల‌వ‌ర్స్ బ్రేక‌ప్..!
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *