Main Menu

య‌న‌మ‌ల అనుచ‌రుల‌పై సీబీఐ క‌న్ను!

Spread the love

ఏపీ ఆర్థిక‌మంత్రి య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు సీనియ‌ర్ నేత‌. 1983 నుంచి రాజ‌కీయాల్లో ఉన్నారు. కానీ పెద్ద‌గా అవినీతి ఆరోప‌ణ‌లు ఆయ‌న మీద లేవు. అయితే ఆయ‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం తునిలో మాత్రం య‌న‌మ‌ల సోద‌రుడు య‌న‌మ‌ల కృష్ణుడు వ్య‌వ‌హారం దానికి భిన్నంగా ఉంటుంది. ఆయ‌న కొంత దురుసుగా ఉంటార‌ని, దూకుడు ప్ర‌ద‌ర్శిస్తుంటార‌నే ప్ర‌చారం ఉంది. దాంతోనే గ‌డిచిన ఎన్నిక‌ల్లో య‌న‌మ‌ల కృష్ణుడు నేరుగా రంగంలో దిగి ప‌రాజ‌యం పాల‌య్యారు. అయినా మార్కెట్ క‌మిటీ ప‌ద‌వి పేరుతో మొత్తం పెత్త‌నం చేయ‌డం మాత్రం ఆగ‌లేద‌నే వాద‌న ఉంది.

ఇక తాజాగా య‌న‌మ‌ల సొంత మండ‌లం తొండంగిలో మ‌ఠం భూముల విష‌యంలో భారీ కుంభ‌కోణం జ‌రిగింది. ఏకంగా 160 ఎక‌రాల‌కు పైగా విలువైన భూముల‌ను త‌ప్పుడు ప‌త్రాల‌తో ప‌క్క‌దారి ప‌ట్టించారు. ఒక‌ప్పుడు పిఠాపురం రాజా వారు స‌త్రం కోసం ఇచ్చిన భూముల‌ను చాలాకాలంగా రైతులు పండించుకుంటున్నారు. కానీ రైతులకు, మ‌ఠం యాజ‌మాన్యానికి సంబంధం లేకుండా మొత్తం భూయ‌జ‌మానులంద‌రినీ మార్చేసిన‌ట్టు వెలుగులోకి వ‌చ్చింది. య‌న‌మల అనుచ‌రులంద‌రి పేర్ల‌తో ఈ భూముల‌ను కాజేసే ప్ర‌య‌త్నం చేసిన‌ట్టు బ‌ట్ట‌బ‌య‌లు అయ్యింది. రెండు నెల‌ల క్రితం తొండంగి ఇన్ఛార్జ్ త‌హాశీల్దార్ గా వ‌చ్చిన అధికారి స‌హాయంతో య‌న‌మ‌ల క‌నుస‌న్న‌ల్లోనే ఈ తంతు సాగింద‌ని ఆరోప‌ణ‌లున్నాయి. ఈ నేప‌థ్యంలోనే సుమారు 100 కోట్ల రూపాయ‌ల కుంభ‌కోణంగా దీనిని భావిస్తున్నారు.

ఈ నేప‌థ్యంలోనే తుని నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన కొంద‌రు ఈ విష‌యాన్ని సీబీఐ దృష్టికి తీసుకెళ్లిన‌ట్టు ప్ర‌చారం సాగుతోంది. భారీ కుంభ‌కోణం కాబ‌ట్టి స‌మగ్ర ద‌ర్యాప్తు చేయాల‌ని కోరుతున్నారు. కేవ‌లం మ‌ఠం భూములు మాత్ర‌మే కాకుండా అదే మండ‌లంలో మ‌రికొన్ని వంద‌ల ఎక‌రాల‌ను ఇదే రీతిలో కాజేశార‌ని ప్ర‌చారం సాగుతోంది. వాట‌న్నింటి మీద భూరికార్డుల ప‌రిశీల‌న‌కు సీబీఐ పూనుకుంటే భారీ వ్య‌వ‌హార‌మ బ‌య‌ట‌కు వ‌స్తుంద‌ని భావిస్తున్నారు. గ‌డిచిన రెండు మూడేళ్ల‌ల‌లో సాగిన ఈ తంతు పెద్ద మొత్తంలో వెలుగుచూసే అవ‌కాశం ఉందంటున్నారు.

ఇప్ప‌టికే మ‌రుగుదోడ్ల నిర్మాణంలో భారీ అవినీతి బ‌య‌ట‌ప‌డింది. ఉపాధి హామీ పేరుతో చివ‌ర‌కు శ్మ‌శాన భూముల విష‌యంలో కూడా నిధులు కాజేసిన విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. ఇప్పుడు భూ కుంభ‌కోణం. ఇలాంటి వ్య‌వ‌హారాల‌న్నింటి పైనా స‌మ‌గ్రంగా ద‌ర్యాప్తు అవ‌స‌రం అని చాలామంది కోరుతున్నారు. దాంతో సీబీఐ అధికారులు ఆరా తీసే య‌త్నంలో ఉన్నార‌ని తొండంగి, తుని వాసులు చెప్పుకుంటుండ‌డంతో య‌న‌మ‌ల అనుచ‌రులు క‌ల‌వ‌ర‌ప‌డుతున్నార‌ని భావిస్తున్నారు.






Related News

టీడీపీ నుంచి వంగ‌వీటి రాధాకి ఆఫ‌ర్!

Spread the loveవైసీపీలో విజ‌య‌వాడ వ్య‌వ‌హారం గ‌రం గ‌రం అవుతోంది. సెంట్ర‌ల్ నుంచి మొద‌ల‌య్యి తూర్పుని కూడా తాకింది. వంగ‌వీటిRead More

జ‌గ‌న్ గుట్టు బాబుకి చిక్కిన‌ట్టేనా..!

Spread the loveఏపీలో విప‌క్ష నేత అధికారం కోసం వ్యూహ‌ర‌చ‌న చేస్తున్నారు. అందుకు త‌గ్గ‌ట్టుగా ప‌లువురు పొలిటిక‌ల్ స్ట్రాట‌జిస్టుల‌తో చ‌ర్చ‌లుRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *