Main Menu

సుకుమార్ రంగ‌స్థ‌లానికి కులం రంగులు…

Spread the love

సుకుమార్ సినిమా స‌క్సెస్ టాక్ తెచ్చుకుంది. దాదాపుగా అంద‌రూ సినిమా బాగుంద‌నే అభిప్రాయం వ్య‌క్తం చేస్తున్నారు. కానీ కత్తి మ‌హేష్ వంటి వారు మాత్రం రంగ‌స్థ‌లం సినిమా మీద పెద‌వి విరుస్తున్నారు. సినిమా క‌థ‌నం బాగోలేద‌ని, క‌థ పాత‌దేన‌ని, పాట‌లు సినిమాలో ఆక‌ట్టుకోలేద‌ని ఇంకా అనేక‌నేక కామెంట్స్ చేస్తున్నారు. అందుకు తోడు పాత‌క‌థ‌నే మ‌ళ్లీ వండి వార్చేశారంటు విమ‌ర్శిస్తున్నారు.

అదే స‌మ‌యంలో సుకుమార్ సినిమా గురించి మ‌రో వాద‌న వినిపిస్తోంది. ముఖ్యంగా గోదావ‌రి జిల్లాల నేప‌థ్యంలో సినిమా సాగింది. యాస కూడా ఆ ప్రాంతం వారిదే కావ‌డం విశేషం. అందులోనూ సుకుమార్ సొంత ప్రాంతం కోన‌సీమ వాస‌న స్ప‌ష్టంగా క‌నిపించింది. అలాంటి స‌మ‌యంలో కోన‌సీమ‌లో క్షత్రియ‌, శెట్టిబ‌లిజ‌, కాపు సామాజిక‌వ‌ర్గాల మ‌ధ్య వైరుధ్యాలు సినిమాలు కొంత ఎలివేట్ చేయ‌డం వెనుక కార‌ణాలు అర్థం కావ‌డం లేద‌ని కొంద‌రు వ్యాఖ్యానిస్తున్నారు. సుకుమార్ , రామ్ చ‌ర‌ణ్ ఇద్ద‌రూ కాపు కుల‌స్తులు కాగా, వారు మ‌రో సామాజికత‌ర‌గ‌తి క‌థ‌లో సాగ‌డం మాత్రం విశేష‌మే.

ముఖ్యంగా సినిమాలో హీరో పేరు చెల్లుబోయిన చిట్టిబాబుగా ప‌దే ప‌దే పేర్కొన్నారు. కానీ వాస్త‌వానికి సినిమా పేరు చిట్టిబాబు అంటే స‌రిపోయిన‌ప్ప‌టికీ, చెల్లుబోయిన పేరుని ప్ర‌స్తావించ‌డం ద్వారా శెట్టిబ‌లిజ కులాన్ని ముందుకు తెచ్చార‌ని అంటున్నారు. అదే స‌మ‌యంలో సినిమాలో స‌ర్పంచ్ ప‌ద‌వికి పోటీ చేసిన స‌మ‌యంలో రామ్ చ‌ర‌ణ్ , ఆది పినిశెట్టి సాగించే ప్ర‌చారంలో మ‌త్స్య‌కారుల‌ను క‌లిసిన‌ట్టు వ‌ల‌లు, ర‌జ‌కుల‌ను క‌లిసిన‌ట్టు బ‌ట్టలుత‌క‌డం వంటి స‌న్నివేశాలు క‌ల్పించ‌డం ద్వారా సామాజిక నేప‌థ్యం మీద దృష్టి పెట్టిన‌ట్టుంద‌ని భావిస్తున్నారు. అదే స‌మ‌యంలో విల‌న్ పాత్రధారి జ‌గ‌ప‌తిబాబు పేరును ఫ‌ణీంధ్ర భూప‌తికి పేర్కొన‌డ‌మే కాకుండా, క్ష‌త్రియ నేప‌థ్యాన్ని తెలియ‌జెప్పేలా ప్రారంభ స‌న్నివేశంలో ష‌ర్ట్ లేకుండా, న‌డుముకి త్రెడ్ క‌నిపించేలా చేసిన‌ట్టు భావిస్తున్నారు. విల‌న్ చుట్టూ ఉన్న‌వారిలో కూడా రాజుగారు అంటూ చెప్ప‌డం ద్వారా ఆ వ‌ర్గాన్ని ప్ర‌స్ఫుట‌మ‌య్యేలా సుకుమార్ ప్ర‌య‌త్నించార‌ని విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.

ఇక సినిమాలో ఆచంట వెంక‌ట‌ర‌త్నం గారి ఇల్లు ఎక్క‌డా అని ప్ర‌స్తావించ‌డం ద్వారా కోన‌సీమ‌లో ఆచంట ఇంటి పేరుతో ఉన్న కాపుల‌ను గుర్తు చేసిన‌ట్టుంద‌ని భావిస్తున్నారు. మొత్తంగా కులాల ప్ర‌స్తావ‌న తీసుకురావ‌డం వెనుక సుకుమార్ కి వేరే కార‌ణాలు ఉండి ఉంటాయ‌నే వారు కూడా లేక‌పోలేదు. జ‌రిగిన క‌థ‌ను సినిమా రూపంలో తెచ్చిన‌ట్టు భావిస్తున్న త‌రుణంలో త‌న స్వ‌గ్రామంలో క్ష‌త్రియుల‌తో ఉన్న వైరుధ్యాన్ని తెర‌మీద ప్ర‌ద‌ర్శించిన‌ట్టుగా ఉంద‌ని కొంద‌రు అనుమానిస్తున్నారు.


Related News

డైరెక్ట‌ర్ ర‌వితేజ‌..హీరో క‌ళ్యాణ్ రామ్!

Spread the loveరవితేజ కెరీర్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా ప్రారంభమైన విషయం విదితమే. హీరోగా రాణిస్తూ అగ్ర నటుల్లో ఒకరిగా నిలిచినRead More

ఆలియా కే ఆర్ఆర్ఆర్

Spread the loveబాలీవుడ్ బ్యూటీ ఎంట్రీ ఖాయం అయ్యింది. గ‌తంలోనే ప‌లు సినిమాల‌లో అనుకున్న‌ప్ప‌టికీ ఆటంకాలు వ‌చ్చాయి. కానీ ఇప్పుడుRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *