Main Menu

సెల‌బ్రిటీల‌కు బీజేపీ టికెట్లు

Spread the love

వ‌చ్చే సాధార‌ణ ఎన్నిక‌ల‌కు బీజేపీ స‌న్నాహాలు చేస్తోంది. ప‌లువురు సెల‌బ్రిటీల మీద క‌న్నేస్తోంది. మ‌రోసారి అదికారం నిలబెట్టుకోవ‌డ‌మే ల‌క్ష్యంగా సాగుతోంది. అందులో భాగంగా ప‌లువురు కొత్త స్టార్ల‌ను తెర‌మీద‌కు తెస్తోంది. బాలీవుడ్ తార‌ల‌తో పాటు క్రికెట్ వీరుల‌ను కూడా ముందు పీఠిన పెట్టాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు తెలుస్తోంది.

అందులో భాగంగా ఇప్పటికే పూణే పార్ల‌మెంట్ సీటుని బాలీవుడ్ బ్యూటీ మాధురీ దీక్షిత్ కి ఖాయం చేసిన‌ట్టు చెబుతున్నారు. ఇప్ప‌టికే అమిత్ షా వెళ్లి మాధురీ దీక్షిత్ తో భేటీ అయ్యారు. ఆమెను వ‌చ్చే ఎన్నిక‌ల్లో బ‌రిలో దింపేందుకు అంగీక‌రింప‌జేసిన‌ట్టు తెలుస్తోంది. అంతేగాకుండా మ‌రో బెంగాలీ న‌టి, ప్ర‌స్తుతం రాజ్య‌స‌భ ఎంపీగా ఉన్న రూపా గంగూలీని కూడా లోక్ స‌భ బ‌రిలో దింపేందుకు స‌న్నాహాలు చేస్తోంది ప‌శ్చి మ‌బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ పార్ల‌మెంట్ కి పోటీ చేయ‌బోతున్న త‌రుణంలో ఆమె మీద రూపాగంగూలీని రంగంలో దింపాల‌ని బీజేపీ నిర్ణ‌యించుకుంది.

వారితో పాటుగా మాజీ క్రికెట‌ర్లు , ఢిల్లీ డ్యాషింగ్ బ్యాట్స్ మెన్లు వీరేంద్ర సెహ్వాగ్, గౌత‌మ్ గంభీర్ ని కూడా బ‌రిలో దింపాల‌ని క‌మ‌లం నేత‌లు కృత‌నిశ్ఛ‌యంతో ఉన్న‌ట్టు చెబుతున్నారు. ఢిల్లీలోని రెండు కీల‌క నియోజ‌క‌వ‌ర్గాల్లో సీనియ‌ర్ల స్థానంలో వీరిద్ద‌ర‌ని పోటీకి దింపే యోచ‌న‌లో కాషాయ‌ద‌ళ పెద్ద‌లున్న‌ట్టు స‌మాచారం. ఇప్ప‌టికే గంభీర్ త‌న రిటైర్మెంట్ ప్ర‌క‌టించి, వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీకి సిద్ధ‌మ‌వుతున్నట్టు స్ప‌ష్ట‌మ‌వుతోంది. దాంతో ప‌లువురు సెల‌బ్రిటీల గ్లామ‌ర్ ని ఉప‌యోగించుకునే పనిలో మోడీ షా ఉన్నట్టు భావించవ‌చ్చ‌ని ప‌రిశీల‌కులు భావిస్తున్నారు.






Related News

ద‌గ్గుబాటి వార‌సుడికి అనుకోని అడ్డంకి!

Spread the loveవ‌చ్చే సాధార‌ణ ఎన్నిక‌ల‌కు ముందు వైసీపీలో చేర‌డానికి ద‌గ్గుబాటి కుటుంబం నిర్ణ‌యానికి వ‌చ్చింది. అయితే త‌న వార‌సుడినిRead More

జ‌న‌సేన ప్ర‌చారాస్త్రంగా విన‌య విధేయ రామ‌?

Spread the loveరామ్ చ‌ర‌ణ్, బోయ‌పాటి కాంబినేష‌న్ లో తొలి మువీ రిలీజ్ కి సిద్ధ‌మ‌య్యింది. సంక్రాంతికి ప్రేక్ష‌కుల ముందుకుRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *