రాజ్య‌స‌భ కోసం బీజేపీకి వైసీపీ తాయిలాలు…!

YSR cong prabhakar reddy_0_0
Spread the love

ఆస‌క్తిక‌ర క‌థ‌నాలు వ‌స్తున్నాయి. రాజ్య‌స‌భ ఎన్నిక‌ల నేప‌థ్యంలో కొత్త సంబంధాలు తెర‌మీద‌కు వ‌స్తున్నాయి. ముఖ్యంగా మూడు సీట్ల రాజ్య‌స‌భ ఎన్నిక‌ల్లో వైసీపీ గ‌ట్టి క‌స‌ర‌త్తులు చేస్తున్న‌ట్టు క‌నిపిస్తోంది. అందులో భాగంగానే బ‌డా పారిశ్రామిక‌వేత్త‌ను తెర‌మీద‌కు తెచ్చింది. మూడేళ్ల క్రితం త‌న‌ను కాన్న‌ది నాయ‌కుడిని మ‌ళ్లీ కండువా క‌ప్పి రాజ్య‌స‌భ సీటు ఇవ్వ‌డం ద్వారా జ‌గ‌న్ వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించార‌నే అభిప్రాయం బ‌ల‌ప‌డుతోంది. ముఖ్యంగా కేంద్రంలో చ‌క్రం తిప్ప‌గ‌ల ఏపీకి చెందిన క‌మ‌లం పార్టీ కీల‌క‌నేత ద్వారా క‌థ న‌డిపిస్తున్నార‌ని తెలుస్తోంది. ప్ర‌స్తుతం క్రియాశీల‌క రాజ‌కీయాల‌కు దూరంగా ఉన్న‌ప్ప‌టికీ, నెల్లూరు జిల్లాలోని స‌ద‌రు నేత ట్ర‌స్ట్ కి దాదాపుగా 25 కోట్ల రూపాయ‌ల భారీ న‌జారానా వైసీపీ అభ్య‌ర్థి అందించిన‌ట్టు ప్రచారం సాగుతోంది. తద్వారా చంద్ర‌బాబు ఆశ‌ల‌కు గండికొట్టి, వైసీపీ విజ‌యానికి ఆటంకం లేకుండా చూసుకోవాల‌నే య‌త్నంలో బీజేపీకి తాయిలాలు అందించిన‌ట్టు చెబుతున్నారు.

వాస్త‌వానికి ప్ర‌స్తుతం విర‌మించుకున్న‌ప్ప‌టికీ తొలుత మూడో అభ్య‌ర్థి కోసం చంద్ర‌బాబు క‌స‌ర‌త్తు చేశారు. త‌ద్వారా వైసీపీకి చెక్ పెట్టాల‌ని చూశారు. గుంటూరు జిల్లాకి చెందిన ముస్తాఫా వంటి ఎమ్మెల్యేల‌ను లొంగ‌దీసుకునే ప్ర‌య‌త్నం కూడా జ‌రిగింది రాయ‌పాటి సాంబ‌శివ‌రావు కారులో వ‌చ్చి సీఎంతో ముస్తాఫా ఏకాంత చ‌ర్చ‌ల‌కు దిగ‌డం అందులో భాగ‌మేన‌ని భావించారు. ఒక్క ఎమ్మెల్యేని ఆక‌ర్షిస్తే క‌థ అడ్డం తిరిగుతుంద‌ని టీడీపీ అధినేత ఆశించారు. అందుకు త‌గ్గ‌ట్టుగా పావులు క‌దిపారు. కానీ అనూహ్యంగా బీజేపీ చేజారిపోవ‌డంతో ఆశ‌లకు గండిప‌డింది. మూడో అభ్య‌ర్థి ఆలోచ‌న ఉప‌సంహ‌రించుకోవాల్సి వ‌చ్చింది. ఇప్పుడు ఇద్ద‌రు ఎంపిక చేయ‌డం కోస‌మే పెద్ద క‌స‌ర‌త్తు చేయాల్సి వ‌స్తోంది.

తెర‌వెనుక జ‌రిగిన ప‌రిణామాల ప్ర‌కారం బీజేపీ తో తెగ‌తెంపుల‌కు సిద్ధ‌ప‌డిన‌ప్ప‌టికీ, ఎన్డీయేలో కొన‌సాగుతున్న‌ట్టు ప్ర‌క‌టించ‌డం వెనుక అస‌లు కార‌ణం కూడా రాజ్య‌స‌భ ఎన్నిక‌లేన‌ని చాలామంది భావిస్తున్నారు. అయితే బీజేపీని వైసీపీ మ‌రో రూటులో మేనేజ్ చేసింద‌నే వాద‌న ఇప్పుడు బ‌య‌ట‌కు రావ‌డం ఆస‌క్తిగా మారింది. నెల్లూరు జిల్లాకే చెందిన భారీ కాంట్రాక్ట‌ర్ వేమిరెడ్డి ప్ర‌భాక‌ర్ రెడ్డి ద్వారా హ‌స్తిన‌లో బీజేపీ పెద్ద‌ల‌ను సంతృప్తి ప‌రిచే ప్ర‌య‌త్నం జ‌రిగింద‌ని చెబుతున్నారు. ఎన్నిక‌లు జ‌రిగితే 44మంది ఎమ్మెల్యేల‌ను చేజారిపోకుండా కాపాడుకోవ‌డానికి ప‌డే శ్ర‌మ క‌న్నా ఇది సులువైన మార్గంగా ఎంచుకున్న‌ట్టు క‌నిపిస్తోంది. త‌ద్వారా టీడీపీ ఆశ‌ల‌పై నీళ్లు జ‌ల్లి, వైసీపీకి ఉప‌శ‌మ‌నం సాధించిన‌ట్టు చెబుతున్నారు. అదే స‌మ‌యంలో బీజేపీ, వైసీపీ మ‌ధ్య కొత్త బంధానికి రాజ్య‌స‌భ ఎన్నిక‌లు దోహ‌దం చేశాయ‌నే అభిప్రాయం కూడా బ‌ల‌ప‌డుతోంది. ఏమ‌యినా ఏపీ రాజ‌కీయాల్లో కొత్త స‌మీక‌ర‌ణాల‌కు రాజ్య‌స‌భ ఎన్నిక‌ల నుంచే బీజం ప‌డుతుంద‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది.


Related News

Rangasthalam_5745

రంగ‌స్థ‌లం స్టోరీ లీక్..

Spread the love1Shareమెగా ప‌వ‌ర్ స్టార్ రామ‌చ‌ర‌ణ్ లేటెస్ట్ మువీ సినిమా రిలీజ్ కి సిద్దం అయ్యింది. వ‌చ్చే వారిRead More

janasena pawan kalyan

ప‌వ‌న్ త‌డ‌బాటు..

Spread the loveజ‌న‌సేనాని త‌డ‌బ‌డుతున్నారు. త‌ప్ప‌ట‌డుగులు వేస్తూ రాజ‌కీయంగా కొంత గంద‌ర‌గోళంలో ఉన్న‌ట్టు క‌నిపిస్తున్నారు. దాంతో ప‌వ‌న్ తీరు చాలామందినిRead More

 • బాల‌య్య హీరోయిన్ పెళ్లి చేసేసుకుంది..
 • ముంద‌స్తు ముప్పు త‌ప్పంది…!
 • రాజ‌కీయాల్లో కీల‌కం కాబోతున్న హీరోయిన్
 • రాజ్య‌స‌భ కోసం బీజేపీకి వైసీపీ తాయిలాలు…!
 • మంత్రి ప‌దవుల కోసం మొద‌ల‌యిన లాబీయింగ్
 • వైసీపీ వ్యూహాత్మ‌క త‌ప్పిద‌మేనా?
 • ఎమ్మెల్యేల‌ను త‌ర‌లిస్తున్న జ‌గ‌న్
 • హాట్ ల‌వ‌ర్స్ బ్రేక‌ప్..!
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *