భూమా గెలిచినా కోర్టులో నిలవదా

nandyala tdp bhuma559876_125077887983633159_n
Spread the love

నంద్యాలలో కొత్త చర్చ తెరమీదకు వచ్చింది. అత్యంత ప్రతిష్టాత్మకంగా మారిన నంద్యాల ఎన్నికల్లో టీడీపీ, వైసీపీ హోరా హోరీగా తలపడ్డాయి. ప్రజల తీర్పు ప్రస్తుతం ఈవీఎంలలో ఉంది. మరికొన్ని గంటల్లో ప్రజల ముందుకు రాబోతోంది. కానీ ఈలోగానే మరో కీలకాంశం ముందుకొచ్చింది. నంద్యాల ఎన్నికల్లో గెలిచినప్పటికీ భూమా బ్రహ్మానందరెడ్డి ఆ ఆనందం నిలచే అవకాశం లేదనే ప్రచారం ఊపందుకుంది. ఎన్నికల నిబంధనావళి ప్రకారం ఆయన ఎన్నికను సవాల్ చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. దాంతో ఆయన ఎన్నిక విషయం కూడా వివాదంగా మారబోతోందని ప్రచారం చేస్తున్నారు.

వాస్తవానికి నంద్యాల ఉప ఎన్నికల్లో నోటిఫికేషన్ సందర్భంగా ఎన్నికల వ్యయం మీద పలు రకాల పరిశీలనలుంటాయి. తాజాగా ఈసీ నిబంధనల ప్రకారం ఎన్నికల ఖర్చు విషయంలో అభ్యర్థులు పలు జాగ్రత్తలు పాటించాల్సి ఉంది. అందులోనూ ప్రచారానికి వచ్చే నేతల విషయంలో పూర్తి వివరాలను ఈసీకి అందించాలి. అయితే ఆ విషయంలో భూమా బ్యాచ్ జాప్యం చేసిందనే ప్రచారం సాగుతోంది. చంద్రబాబు, బాలయ్య, వేణుమాధవ్ వంటి వారు ప్రచారం నిర్వహించారు. అయినా వారికి సంబంధించిన సమాచారం పూర్తి సమాచారం సకాలంలో అందించలేదన్న చర్చ మొదలయ్యింది.

ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్‌ 77 ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్యే సీటుకు పోటీ చేస్తున్న అభ్యర్థి ఎన్నికల ప్రచారానికి గరిష్టంగా రూ.28 లక్షలు ఖర్చు చేయొచ్చు. అభ్యర్థి తరఫు ప్రచారం నిర్వహించే వారి ప్రచారానికి అయ్యే ఖర్చుకు, అభ్యర్థి తన ప్రచారానికి చేసే ఖర్చుకు ఎలాంటి సంబంధం ఉండదు. అయితే, అభ్యర్థి తరఫు ఎవరెవరు ప్రచారం నిర్వహిస్తారో.. వారందరి పేర్లను ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదలైన వారంలోగా ఎన్నికల కమిషన్‌కు అందించాల్సివుంటుంది.

నిబంధనల ప్రకారం రెండు వారాల ముందుంగా ఇవ్వాల్సిన క్యాంపెయినర్ల జాబితా రెండు వారాల తర్వాత ఈసీకి ఇవ్వడం విశేషంగా మారింది. ప్రచారం నిర్వహించిన స్టార్‌ క్యాంపెయినర్ల ఖర్చులను కూడా భూమా బ్రహ్మానంద రెడ్డి ఎన్నికల ఖర్చు కింద ఈసీ లెక్కయనుంది. ఎన్నికల్లో చేసిన ఖర్చు రూ.28 లక్షలు దాటినట్లయితే.. ఒక వేళ నంద్యాలలో భూమా బ్రహ్మానంద రెడ్డి విజయం సాధించినా దాన్ని సవాలు చేస్తూ కోర్టుకు వెళ్లే అవకాశం ఉంటుంది. సహజంగానే ఈ నేతల ఖర్చంతా ఆ జాబితాలో చేరితే పరిమితిని మించిపోయే ప్రమాదం స్పష్టంగా ఉందని సమాచారం. అయితే నిజంగా అలా జరుగుతుందా అన్నది చర్చనీయాంశమే.


Related News

chiru saira

మెగా మువీలో పవర్ స్టార్!

Spread the loveనిజంగా ఇది మెగా ఫ్యాన్స్‌కు షాకిచ్చే విషయమే. అంతేకాదు మెగా ఫ్యాన్స్‌కు పెద్దగా పండగ లాంటి న్యూస్..Read More

julie 2

ఆ సినిమా నగ్మాకి వ్యతిరేకంగానా?

Spread the loveతాజాగా ఓ సినిమా వ్యవహారం చర్చనీయాంశం అవుతోంది. ముఖ్యంగా సీనియర్ నటి, ప్రస్తుతం కాంగ్రెస్ నేతగా ఉన్నRead More

 • అఖిలప్రియకు కౌంట్ డౌన్
 • వైవీ సుబ్బారెడ్డి అవుట్..
 • త్రివిక్రమ్ తో ఎన్టీఆర్ తగాదా..
 • హీరోయిన్ అవుతున్న హీరోగారమ్మాయి…
 • మహేష్ 27లో మళ్లీ ఆ దర్శకుడితో…
 • సన్నీలియోన్ తో సప్తగిరి పెళ్లి..!
 • రామ్ చరణ్ కి థర్డ్ ప్లేస్
 • పొట్టిదనం జగన్ కి పేరు తెస్తుందా?
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *