Main Menu

నంద్యాల వైసీపీ వైపే..

jagan in nandyala
Spread the love

ఒక్క ఉప ఎన్నికలు మొత్తం ఏపీని నంద్యాల వైపు మళ్లించింది. అందరి ద్రుష్టిని ఆకర్షించింది. ప్రచారహోరుతో ప్రత్యేక ఆకర్షణగా మారింది. ప్రధాన పార్టీలు రెండూ అక్కడే మోహరించడం మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది. అభ్యర్థుల ఎంపిక నుంచి అన్ని అంశాలు చర్చనీయాంశాలయ్యాయి. ఇక తుది అంకానికి చేరుకున్న ఈ సమరంలో ప్రస్తుతం ఎన్నికల అధికారుల తమ బాధ్యతను జాగ్రత్తగా నిర్వహించే పనిలో ఉన్నారు. కానీ ఏపీ పోలీసుల వ్యవహారం మాత్రం నంద్యాల పట్టణంలో ఉద్రిక్తతలకు దారితీసింది.

అవన్నీ పక్కన ఉంచితే నంద్యాల ఎన్నికల్లో ఎవరు గెలుస్తారన్న విషయంలో రాష్ట్రమంతా పెద్ద స్థాయిలో బెట్టింగ్ సాగుతోంది. కేవలం నంద్యాలలోనే కాకుండా ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకూ అన్ని జిల్లాల్లోనూ బెట్టింగ్ జోరుగా సాగుతోంది. ఈ విషయంలో మొగ్గు వైసీపీ వేపు కనిపిస్తుండడం విశేషం. బాహాటంగానే పలువురు వైసీపీ నేతలు ఛాలెంజ్ చేస్తున్నారు. కోసు పందాలకు సైతం సిద్ధమవుతున్నారు. టీడీపీ శిబిరంలో మొదట కొందరు ఆసక్తి చూపినా తాజాగా గడిచిన రెండు రోజులుగా నంద్యాలలో జరుగుతున్న పరిణామాలను గమనించి చల్లబడిపోయినట్టు తెలుస్తోంది. గడిచిన కొన్ని గంటలుగా టీడీపీ నేతలంతా నంద్యాలను వదిలిపెట్టి రాగా, వైసీపీ నేతలు ముఖ్యంగా శిల్పా గ్యాంగ్ మాత్రం మొత్తం వ్యవహారాలు చక్కబెట్టేస్తున్నట్టు ప్రచారం సాగుతోంది.

ఈ తరుణంలో టీడీపీ తరుపున పందాలకు సిద్దమైనవాళ్లు చాలామంది వెనక్కి తగ్గుతున్నట్టు సమాచారం. వాస్తవానికి తొలుత చాలామంది టీడీపీ మీద ఆశలు పెట్టుకున్నారు. ఆఖరి నిమిషంలో చంద్రబాబు పావులు కదుపుతారని, టీడీపీని ఎలాగైనా గట్టెక్కిస్తారని ఆశించారు. కానీ బాలయ్య ప్రచారం కొంత ఆశలు నీరుగార్చేయగా, ఆతర్వాత చంద్రబాబు శిల్పా సహకార్ సొసైటీ మీద చేసిన వ్యాఖ్యలు బూమరాంగ్ అయ్యాయి. అన్నింటికీ మించి టీడీపీ నేతలు గడచిిన వారం రోజులుగా పంపిణీలు జాగ్రత్తగా ముగించగా, ఆఖరి క్షణంలో వైసీపీ హవా సాగుతుండడంతో టీడీపీ శిబిరం కొంత ఢీలాపడింది.

ఈ పరిణామాలే బెట్టిగ్ వ్యవహారాల్లో వైసీపీ అనుచరులు, అభిమానుల దూకుడుగా కారణంగా మారుతున్నాయి. రేపు పోలింగ్ సరళిని బట్టి ఈ పందాలు మరింత జోరందుకునే అవకాశం ఉంది. రేపటికి స్పష్టత వచ్చే అవకాశాలు మెండుగా ఉండడంతో పందాల ఎటు మొగ్గుచూపుతాయో చూడాలి.


Related News

jd lakshminarayana

అగ‌మ్య‌గోచ‌రంగా మారిన జేడీ ప‌య‌నం

Spread the loveసీబీఐ అధికారిగా ఏపీలో మంచి ఆద‌ర‌ణ సాధించిన జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ సందిగ్ధంలో ప‌డ్డారు. త‌న రాజ‌కీయ భ‌విత‌వ్యంపైRead More

YS jagan (1)

వైసీపీకి వాళ్లంతా చేజారిన‌ట్టేనా?

Spread the love5Sharesఏపీలో ముఖాముఖీ పోరు జ‌ర‌గాల‌ని జ‌గ‌న్ ఆశించారు. దానికి త‌గ్గ‌ట్టుగా ప‌రిస్థితులు సాగిన‌ప్ప‌టికీ చివ‌రిలో ప‌లు మార్పులుRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *