Main Menu

బాబు మీద గురిపెట్టి ఏపీకి మ‌ళ్లీ అన్యాయం..!

Spread the love

రాక రాక వ‌చ్చారు. కానీ ఏదో చేస్తార‌ని ఆశించిన వాళ్ల‌ను నిరాశ‌లో ముంచారు. ఏదో ఒక హామీ ఇవ్వ‌క‌పోతారా అని భావించిన వాళ్ల‌కు కూడా మింగుడుప‌డ‌ని రీతిలో ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ వ్య‌వ‌హ‌రించారు. దాంతో గుంటూరు స‌భ ద్వారా ఏపీకి ఏదో ఒక ప్ర‌యోజ‌నం ద‌క్కుతుంద‌ని చెప్పిన బీజేపీ నేత‌ల మాట‌లు ఆచ‌ర‌ణ‌లో రుజువు కాలేదు.

అయితే అదే స‌మ‌యంలో మోడీ పూర్తిగా చంద్ర‌బాబుకి స‌మాధానం చెప్ప‌డానికి, ఛాలెంజ్ చేయ‌డానికే స‌మ‌య‌మంతా కేటాయించ‌డం విశేషంగా చెప్ప‌వ‌చ్చు. చంద్ర‌బాబు, నారా లోకేష్ మీద మోడీ చేసిన వ్యాఖ్య‌ల‌ను బ‌ట్టి త్వ‌ర‌లో ఏపీ ప్ర‌భుత్వ వ్య‌వ‌హారాల మీద విచార‌ణ‌కు మోడీ స‌న్నాహాలు చేస్తున్న‌ట్టు సందేహిస్తున్నారు. ముఖ్యంగా పోల‌వ‌రం, అమ‌రావ‌తి వంటి వివిధ ప్ర‌భుత్వ స‌హాయం మీద లెక్క‌లు అడిగితే చంద్ర‌బాబుకి నొప్పి పుట్టిందంటూ మోడీ కామెంట్ చేసిన తీరు ఇప్పుడు విశేషంగా క‌నిపిస్తోంది.

త్వ‌ర‌లోనే ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వ వ్య‌వ‌హారాల‌పై కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ‌లు రంగంలో దిగినా ఆశ్చ‌ర్య‌ప‌డాల్సిన ప‌నిలేద‌ని అంచ‌నాలు వేస్తున్నారు. అందుకు త‌గ్గ‌ట్టుగానే చంద్ర‌బాబు త‌న‌యుడి పేరుని మోడీ ప్ర‌స్తావించ‌డాన్ని గుర్తు చేస్తున్నారు. అదే స‌మ‌యంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌జ‌ల ఆశ‌ల‌కు మాత్రం నీళ్లు వ‌ద‌లిన‌ట్టు క‌నిపిస్తోంది. మోడీ ఏపీ వాసుల ఆశ‌ల‌కు ప్రాధాన్య‌త‌నివ్వ‌కుండా రాజ‌కీయ కోణంలోనే వ్య‌వ‌హ‌రిస్తున్న‌ట్టు క‌నిపిస్తోంది. ఇది అత్య‌ధికుల‌ను నిరాశ‌ప‌రిచే అంశ‌మే కాకుండా, మోడీ ప‌ట్ల ఉన్న వ్య‌తిరేక‌త మ‌రింత పెంచేందుకు కార‌ణం అవుతోంది.






Leave a Reply

Your email address will not be published. Required fields are marked *