Main Menu

ప‌వ‌న్ ఎఫెక్ట్: బాబు స‌న్నిహితుడిపై వేటు?

Spread the love

ఏపీలో మ‌రో కీల‌క‌ప‌రిణామం జ‌ర‌గోబోతోందా…చంద్ర‌బాబు స‌న్నిహితుడిగా పేరున్న అధికారిపై వేటు ప‌డుతోందా..ఇంటిలిజెన్స్ బాధ్య‌త‌లు నిర్వ‌హిస్తున్న ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావుకి స్థాన చ‌ల‌నం త‌ప్ప‌డం లేదా…ప్ర‌స్తుతం ఇదే అమ‌రావ‌తిలో హాట్ టాపిక్ అవుతోంది. ప‌త్రిక‌ల్లో క‌థ‌నాలు కూడా వ‌స్తున్నాయి. చాలాకాలంగా చంద్ర‌బాబుతో చాలా ద‌గ్గ‌ర‌గా ఉంటార‌ని ఏబీ వెంక‌టేశ్వ‌ర రావుకి పేరుంది. చివ‌ర‌కు ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం వంటి వాళ్ల‌యితే ఆయ‌న్ని తీవ్రంగా విమ‌ర్శించారు. ఏ ఐపీఎస్ అధికారిగా కాకుండా ప‌క్కా టీడీపీ నాయ‌కుడిగా వ్య‌వ‌హ‌రిస్తున్నారంటూ మండిప‌డ్డారు. అలాంటి ఏబీ వెంక‌టేశ్వ‌ర రావుకి ఇప్పుడు హ‌ఠాత్తుగా స్థాన చ‌ల‌నం అనే ప్ర‌చారం అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది.

అయితే గ‌తంలో ఓటుకు నోటు కేసు సంద‌ర్భంగా నాటి ఇంటిలిజెన్స్ చీఫ్ అనురాధ‌పై చంద్ర‌బాబు ప్ర‌భుత్వం వేటు వేసిన విష‌యాన్ని గుర్తు చేస్తున్నారు. ప్ర‌స్తుతం అదే రీతిలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ కి సంబంధించిన స‌మాచారం సేక‌ర‌ణ‌లో ఇంటిలిజెన్స్ బృందం ఇచ్చిన నివేదిక‌లు వాస్త‌వాల‌కు దూరంగా ఉండ‌డంతో సీఎం మండిప‌డుతున్నార‌ని క‌థ‌నాలు. జ‌న‌సేన ఆవిర్భావ దినోత్స‌వ స‌భ‌లో టీడీపీ తీవ్రంగా విరుచుకుప‌డ‌డే కాకుండా, లోకేష్ అవినీతి, అమ‌రావ‌తి అక్ర‌మాలు స‌హా అనేక అంశాల‌ను ప‌వ‌న్ ప్ర‌స్తావించారు. దానిని ప‌సిగ‌ట్ట‌డంలో ఇంటిలిజెన్స్ విఫ‌లం అయ్యింది.పైగా టీడీపీకి అనుకూలంగా ప‌వ‌న్ ప్ర‌సంగం ఉంటుంద‌నే రిపోర్ట్ అందిన‌ట్టు స‌మాచారం. దాంతో ప‌వ‌న్ ప్ర‌సంగం త‌ర్వాత టీడీపీ నేత‌లు ఖంగుతిన్నారు.

ఈ ప‌రిణామం చంద్ర‌బాబుకి మింగుడుప‌డ‌డం లేద‌ని ప‌లువురు చెబుతున్నారు. ప‌వ‌న్ లాంటి విశ్వాస‌పాత్రుడైన మిత్రుడిని కోల్పోయామ‌ని ఆయ‌న క‌ల‌త చెందుతున్న‌ట్టు క‌నిపిస్తోంది. వాస్త‌వానికి ముందుగా అలాంటి స‌మాచారం అంది ఉంటే బ‌హిరంగ‌స‌భ‌కు అమ‌రావ‌తి ప్రాంతంలో అనుమ‌తి విష‌యంలో పున‌రాలోచ‌న చేసే అవ‌కాశం ఉండేద‌ని భావిస్తున్నారు. కానీ రిపోర్టుల ఆధారంగా స‌భ‌కు అనుమ‌తిచ్చిన త‌ర్వాత‌, ఊహించిన దానికి భిన్నంగా దాడి జ‌ర‌గ‌డంతో ఖంగుతినాల్సి రావ‌డంతో పాల‌క‌ప‌క్షం క‌ల‌త చెందుతోంది. ఈ ప‌రిణామాల‌కు ఇంటిలిజెన్స్ వైఫ‌ల్యంగా భావించి త‌క్ష‌ణం చ‌ర్చ‌ల‌కు పూనుకోవాల‌ని ఆలోచిస్తున్న‌ట్టు క‌థ‌నాల‌ను బ‌ట్టి అర్థం అవుతోంది. అదే జ‌రిగితే ప‌వ‌న్ పుణ్యాన చంద్ర‌బాబు స‌న్నిహితుడిగా చెప్పుకునే అధికారి ప‌ద‌వికి గండం రావ‌డం విశేషంగా భావించాలి. ప్ర‌స్తుతం సాగుతున్న ఈ ప్ర‌చారం నిజంగా ఆచ‌ర‌ణ‌లోకి వ‌స్తే అది అనూహ్యంగానే చెప్పుకోవాలి. .


Related News

డైరెక్ట‌ర్ ర‌వితేజ‌..హీరో క‌ళ్యాణ్ రామ్!

Spread the loveరవితేజ కెరీర్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా ప్రారంభమైన విషయం విదితమే. హీరోగా రాణిస్తూ అగ్ర నటుల్లో ఒకరిగా నిలిచినRead More

ఆలియా కే ఆర్ఆర్ఆర్

Spread the loveబాలీవుడ్ బ్యూటీ ఎంట్రీ ఖాయం అయ్యింది. గ‌తంలోనే ప‌లు సినిమాల‌లో అనుకున్న‌ప్ప‌టికీ ఆటంకాలు వ‌చ్చాయి. కానీ ఇప్పుడుRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *