అనసూయ మెగాహీరోకి మేనత్తనట!

anasuya
Spread the love

తెలుగు యాంకర్లు ఇప్పుడు ఒకప్పటిలా మాములుగా లేరు. ముఖ్యంగా ఈ మధ్య కొన్ని రియాలిటీ షోల ద్వారా యాంకర్లు చాలా ఫెమాస్ అవుతున్నారు. కామెడీ షోలకైతే ఇక హద్దే లేదు. అప్పట్లో మాటల ప్రవాహం ఉంటే సరిపోయేది కాని.. నేటి యాంకర్లకు గ్లామరసం ఆరబోయడం అనేది పెద్ద ఎసెట్ గా మారింది. ఆ తరహాలో మోస్ట్ గ్లామర్ యాంకర్ గా గుర్తింపు తెచ్చుకున్న ముద్దుగుమ్మ అనసూయ.

వయసుతో సంబంధం లేకుండా ఈ భామ వేసే డ్రెస్సులకు ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే. అలాగే సినిమాల్లో స్పెషల్ రోల్స్ చేస్తూ.. అలరిస్తోంది. అంతేకాకుండా స్పెషల్ సాంగ్స్ లోను సూపర్ సెక్సీ అనేలా పేరు తెచ్చుకుంటోంది. అయితే ఇప్పుడు మళ్లీ అదే తరహాలో ఒక స్పెషల్ రోల్ చేస్తోంది. అది కూడా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నాటిస్తోన్న రంగస్థలం1985 సినిమాలో. ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో శరవేగంగా జరుపుకుంటోంది. అయితే అనసూయ ఈ సినిమాలో ఏ పాత్ర చేస్తోందా అని అందరూ అనుకున్నారు. బహుశా స్పెషల్ సాంగ్ లో చిందులు వేస్తుందేమో అనుకున్నారు. కానీ ఎవరు ఉహించని విధంగా రామ్ చరణ్ కి మేనత్త పాత్రలో కనిపించబోతోందని తెలుస్తోంది.

ఇంతకుముందే సోషల్ మీడియాలో పల్లెటూరి అమ్మాయిలాగా ఉండే ఒక ఫోటోని రిలీజ్ చేసింది. అయితే ఆ ఫొటోలో కేవలం తన పాదాలని మాత్రమే చూపించింది. అయితే సినిమాలో మొత్తం అమ్మడు పల్లెటూరి మహిళలా కనిపించనుందట. అనసూయ పాత్ర సరికొత్తగా ఉండనుందని తెలుస్తోంది. ఇక రామ్ చరణ్ కూడా ఈ సినిమాలో న్యూ లుక్ లో దర్శనం ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే. విలక్షణ దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా సంక్రాంతి కి రానుంది.


Related News

kotla suryaprakash

జగన్ గూటికి కోట్ల: ముహూర్తం సిద్ధం

Spread the love3Sharesకర్నూలు ఎంపీ సీటుపై క్లారిటీ రావడంతో మాజీ కేంద్ర మంత్రి వైసీపీ వైపు మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికేRead More

Jagan-Plenary

యాత్రను అడ్డుకుంటే జగన్ కే మేలు!

Spread the love8Sharesవైఎస్ జగన్ పాదయాత్రకు రంగం సిద్ధం అయ్యింది. మరో పక్షం రోజుల్లో ఆయన రాష్ట్రమంతా కాలినడకన చుట్టిRead More

 • కొత్త అవతారంలో హీరో
 • 60ఏళ్ల నటుడితో నమిత ప్రేమాయణం
 • పీకల్లోతు ప్రేమలో రాయ్ లక్ష్మీ
 • తాప్సీ రెండో ఇల్లు..
 • డేటింగ్ కి సై అంటున్న బ్యూటీ
 • అజ్ఞాతవాసిగా మారాలనుకుంటున్న పవర్‌స్టార్‌..!
 • భారతీయుడు సీక్వెల్ సిద్ధం..!
 • పవన్ కల్యాణ్ కోసం ఉదయభాను..
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *