Main Menu

బాబుకి మింగుడుప‌డ‌ని ఆమంచి ఎత్తులు

Spread the love

ఆమంచి కృష్ణ‌మోహ‌న్ .ఈచీరాల ఎమ్మెల్యే ఇప్పుడు మ‌ళ్లీ హాట్ టాపిక్ అయ్యారు. సెంట‌ర్ పాయింట్ అయ్యారు. ఏపీ రాజ‌కీయాల్లో ఆయ‌న కీల‌కంగా మార‌బోతున్న‌ట్టు క‌నిపిస్తోంది. ఆయ‌న నిర్ణ‌యం పెను ప్ర‌భావం చూప‌డం ఖాయ‌మ‌నే అంచ‌నాలు పెరుగుతున్నాయి. దాంతో ఈ వ్య‌వ‌హారం చ‌ర్చ‌నీయాంశం అవుతోంది.

ఆయ‌న వైసీపీలో చేరేందుకు నిర్ణ‌యించుకుని, అనుచ‌రుల అబిప్రాయాలు తెలుసుకుని, త‌న మ‌న‌సులో మాట బ‌య‌ట‌పెట్టిన త‌ర్వాత కూడా టీడీపీ బుజ్జ‌గించే ప్ర‌య‌త్నాలు ఆప‌లేదు. మంత్రి శిద్ధా రాఘ‌వ‌రావు అయ‌న్ని చ‌ల్లార్చే య‌త్నం చేశారు. చివ‌ర‌కు సీఎంని క‌లిసేందుకు ఒప్పించారు. కానీ ఆయ‌న చంద్ర‌బాబుని క‌లిసేందుకు అంగీక‌రించారు గానీ పార్టీలో కొన‌సాగేందుకు మాత్రం స‌సేమీరా అన‌డం సంచ‌ల‌నంగా మారింది. మ‌ఖ్యంగా చాలామంది నేత‌లు పార్టీ మారాల‌నుకున్న త‌ర్వాత మొఖం చాటేస్తారు. అలాంటి వాళ్ల‌కు భిన్నంగా ఆమంచి నేరుగా చంద్ర‌బాబు ముందే త‌న మ‌న‌సులో మాట చెప్ప‌డం విశేషంగా ఉన్న‌ట్టు ప‌లువురు భావిస్తున్నారు

ఇక పార్టీ మారేందుకు ఆమంచి నిర్ణ‌యం తీసుకుంటే అది టీడీపీ కి కొంత త‌ల‌నొప్పిగా త‌యార‌వుతుంది. అయితే అంత‌కుమించి ఆమంచి తో పాటుగా మ‌రికొంద‌రు నేత‌లు స‌న్న‌ద్ధ‌మ‌యితే మాత్రం మ‌రింత స‌మ‌స్య‌గా మారుతుంది. ముఖ్యంగా తోట త్రిమూర్తులు వ్య‌వ‌హారం ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశం అవుతోంది. ప్ర‌స్తుతం కుమారుడి పెళ్లి ప‌నుల్లో ఉన్న తోట త్రిమూర్తుల‌తో ప‌నిగ‌ట్టుకుని వెళ్లి ఆమంచి భేటీ కావ‌డం అనూహ్యంగానే క‌నిపిస్తోంది. ఆమంచి త‌న రూటులోకి త్రిమూర్తులుని తెచ్చుకునే య‌త్నంలో ఉన్నార‌ని, అందుకే అంత దూరం వెళ్లార‌ని అంతా భావిస్తున్నారు.

దాంతో టీడీపీ శిబిరం మ‌రింత అప్ర‌మ‌త్తం కావాల్సి వ‌స్తోంది. ఆమంచితో ట‌చ్ లో ఉన్న వారంద‌రిపై నిఘా పెట్టిన‌ట్టు క‌నిపిస్తోంది. ఆమంచి చివ‌ర‌కు ఎలాంటి నిర్ణ‌యం తీసుకున్న‌ప్ప‌టికీ దాని కార‌ణంగా పెను న‌ష్టం జ‌ర‌గ‌కుండా చూసుకోవాల‌నే ల‌క్ష్యంతో టీడీపీ నాయ‌క‌త్వం ఉన్న‌ట్టు క‌నిపిస్తోంది. ఏం జ‌రుగుతుందో చూడాలి.






Related News

డైరెక్ట‌ర్ ర‌వితేజ‌..హీరో క‌ళ్యాణ్ రామ్!

Spread the loveరవితేజ కెరీర్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా ప్రారంభమైన విషయం విదితమే. హీరోగా రాణిస్తూ అగ్ర నటుల్లో ఒకరిగా నిలిచినRead More

ఆలియా కే ఆర్ఆర్ఆర్

Spread the loveబాలీవుడ్ బ్యూటీ ఎంట్రీ ఖాయం అయ్యింది. గ‌తంలోనే ప‌లు సినిమాల‌లో అనుకున్న‌ప్ప‌టికీ ఆటంకాలు వ‌చ్చాయి. కానీ ఇప్పుడుRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *