Main Menu

త్రివిక్ర‌మ్ కి బ‌న్నీ హ్యాండిస్తున్న‌ట్టేనా?

Spread the love

త్రివిక్రమ్‌తో అల్లు అర్జున్‌ పంతొమ్మిదవ చిత్రం ఖరారయిన సంగతి తెలిసిందే. అయితే దీనిని మొదలు పెట్టడానికి అల్లు అర్జున్‌ మీన మేషాలు లెక్క పెడుతున్నాడు. ఏడాది కాలంగా షూటింగ్‌ అంటూ చేయని అల్లు అర్జున్‌ ఇప్పుడు కూడా త్రివిక్రమ్‌ సినిమాపై కాకుండా ఇరవయ్యవ చిత్రంగా చేస్తానన్న సుకుమార్‌ చిత్రం గురించి ఎక్సయిట్‌ అవుతున్నాడట. త్రివిక్రమ్‌తో కంటే ఈమధ్య సుకుమార్‌తోనే ఎక్కువ సమయం చర్చిస్తున్నాడట.

షూటింగ్‌ మొదలు పెడదామని త్రివిక్రమ్‌ ఎంత చెబుతున్నా ఏదో కారణం చెప్పి వాయిదా వేస్తున్నాడని, ఒకవేళ సుకుమార్‌ కనుక జూన్‌లోగా కథ సిద్ధం చేస్తానంటే త్రివిక్రమ్‌కి హ్యాండ్‌ ఇచ్చినా ఇస్తాడని గుసగుసలాడుకుంటున్నారు. ఆలస్యం ఎలాగో అయింది కనుక ఇప్పుడొచ్చే చిత్రం చాలా స్పెషల్‌గా వుండాలని అల్లు అర్జున్‌ భావిస్తున్నాడట. అలాంటి లక్షణాలు త్రివిక్రమ్‌ కథలో కంటే సుకుమార్‌ కథలో ఎక్కువ వున్నాయని అల్లు అర్జున్‌ అటు మొగ్గుతున్నాడనే గాసిప్స్‌ వినిపిస్తున్నాయి. ఏప్రిల్‌ వచ్చినా ఇంకా షూటింగ్‌ డేట్‌ అనౌన్స్‌ కాకపోవడంతో ఏప్రిల్‌ 8న అల్లు అర్జున్‌ బర్త్‌డేకి త్రివిక్రమ్‌ సినిమా వుంటుందా లేదా అనేది తేలిపోతుందని అంటున్నారు.






Related News

ప్రేమ- పెళ్లి- విడాకులు- మ‌ళ్లీ పెళ్లి

Spread the loveకొంతకాలం కిందట అధికారికంగా విడిపోయిన మలైకా ఆరోరా- అర్బాజ్ ఖాన్ లు ఇప్పుడు మళ్లీ పెళ్లికి రెడీRead More

సీనియ‌ర్ నేత‌పై జ‌గ‌న్ సీరియ‌స్..!

Spread the loveవైసీపీ నేత‌ల తీరు అధిష్టానానికి ఆగ్ర‌హం క‌లిగిస్తోంది. ముఖ్యంగా కొంద‌రు సీనియ‌ర్ నేత‌ల వ్య‌వ‌హారం జ‌గ‌న్ కిRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *