Main Menu

కొత్త రూపంలో బన్నీ

Spread the love

టాలీవుడ్ స్టయిలిష్ స్టార్ కొత్త రూపం ధరిస్తున్నాడు,. త్వరలోనే మరో రంగంలో అడుగుపెడుతున్నాడు. మామయ్య చిరంజీవి బాటలో అదిరిపోయే స్టెప్స్ తో ఫ్యాన్స్ ని అలరిస్తూ మంచి హిట్స్ కొడుతున్న అల్లు అర్జున్ త్వరలోనే ప్రొడ్యూసర్ రూపం ధరించబోతున్నాడు. నిర్మాతగా మారి సినీ నిర్మాణంలో అడుగుపెడుతున్నాడు. ఇప్పటికే రామ్ చరణ్ చిరంజీవితో 150 సిినిమా తీసి సక్సెస్ కొట్టి ఇప్పుడు సైరా అంటున్నాడు. మరోవైపు పవన్ కళ్యాణ్ కూడా సినీ నిర్మాతగా మారారు. నితిన్ తో సినిమా తీస్తున్నాడు.

తాజాగా బన్నీ కూడా అదే బ్యాచ్ లో చేరుతుండడంతో మెగా హీరోలంతా వరుసగా ప్రొడ్యూసర్స్ గా మారిపోతున్నట్టు కనిపిస్తోంది. బన్నీ తండ్రి అల్లు అర‌వింద్‌కు చెందిన గీతా ఆర్ట్స్ ఉన్నా…బ‌న్నీ త‌న పేరిట సొంత నిర్మాణ సంస్ధ‌ను ప్రారంభిచ‌నున్నాడ‌ట‌. నా పేరు సూర్య త‌ర్వాత న‌టించ‌బోయే చిత్రాల‌న్నీ బ‌న్నీ నిర్మాణ సంస్ధ‌లోనే తెర‌కెక్క‌నున్నాయి. త్వ‌ర‌లో బాక్సింగ్ నేప‌థ్యంలో అనూప్‌రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో న‌టించ‌బోయే చిత్రానికి అల్లు అర్జునే నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించ‌నున్నాడ‌ని టాక్‌. దాంతో ఈ విషయంలో ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ అవుతోంది.






Leave a Reply

Your email address will not be published. Required fields are marked *