Main Menu

ఆలియా కే ఆర్ఆర్ఆర్

Spread the love

బాలీవుడ్ బ్యూటీ ఎంట్రీ ఖాయం అయ్యింది. గ‌తంలోనే ప‌లు సినిమాల‌లో అనుకున్న‌ప్ప‌టికీ ఆటంకాలు వ‌చ్చాయి. కానీ ఇప్పుడు ప్ర‌తిష్టాత్మ‌క ఆర్ఆర్ఆర్ తో టాలీవుడ్ ఎంట్రీకి ఆలియా సిద్ధ‌మ‌వుతున్న‌ట్టు స‌మాచారం.

రాజమౌళి, ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌ కాంబినేషన్‌లో రూపొందుతోన్న మల్టీస్టారర్‌లో కథానాయికలు ఎవరు అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారిపోయింది. చాలా మంది పేరు వినిపించినా ఇప్పటి వరకూ ఎవరినీ కథానాయికగా ఖరారు చేయలేదు. ఇప్పుడు కొత్తగా బాలీవుడ్‌ హీరోయిన్‌ అలియా భట్‌, ఓ మోడల్‌ను ఈ సినిమాకి హీరోయిన్లుగా చేయించేందుకు సన్నాహాలు చేస్తున్నారట. వీళ్లనే ఖరారు చేసిన చిత్రబృందం ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.

అలియాతో పాటు బ్రిటిష్‌ మోడల్‌ ఒక ఆమె ఇందులో నటించబోతుంది. అలియా నటించేందుకు గ్రీన్‌ సిగల్‌ ఇచ్చినా ఒప్పంద పత్రాలపై సంతకాలు చేయలేదు. మోడల్‌ మాత్రం ఓకే అయిపోయింది. ఈమె ఎన్టీఆర్‌ సరసన నటించనుందట. రూ.300కోట్లతో రూపొందుతోన్న ఈ సినిమాను రూ. డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు.






Related News

డైరెక్ట‌ర్ ర‌వితేజ‌..హీరో క‌ళ్యాణ్ రామ్!

Spread the loveరవితేజ కెరీర్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా ప్రారంభమైన విషయం విదితమే. హీరోగా రాణిస్తూ అగ్ర నటుల్లో ఒకరిగా నిలిచినRead More

ఆలియా కే ఆర్ఆర్ఆర్

Spread the loveబాలీవుడ్ బ్యూటీ ఎంట్రీ ఖాయం అయ్యింది. గ‌తంలోనే ప‌లు సినిమాల‌లో అనుకున్న‌ప్ప‌టికీ ఆటంకాలు వ‌చ్చాయి. కానీ ఇప్పుడుRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *