టీడీపీలో ట్విస్ట్: గంగులకు అడ్డంకి

akhila priya
Spread the love

నంద్యాలలో టీడీపీ వ్యవహారం నయా రూపం తీసుకుంది. గంగుల ప్రతాప్ రెడ్డి చేరుతున్నారన్న ప్రచారంతో తెలుగుదేశం వ్యవహారాలు గరం గరం గా మారుతున్నాయి. ముఖ్యంగా సుదీర్ఘకాలంగా గంగుల, భూమా కుటుంబాల వైరంగా ఉన్న ప్రాంతంలో తాజాగా గంగుల ప్రతాప్ రెడ్డిని టీడీపీలో చేర్చుకోవడంపై మంత్రి అఖిల ప్రియ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. గంగుల ప్రతాప్ రెడ్డి వల్ల టీడీపీకి ఎటువంటి ఉపయోగం లేదంటూ వ్యాఖ్యానిస్తున్నారు. వారం రోజుల్లో ఎన్నికలు ఉండగా ఇప్పుడు ఆయనొచ్చి చేసేదేముంటుందని నిలదీస్తున్నారు. గంగుల రాక తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తూనే తన వర్గాన్ని ఎలా కాపాడుకోవాలో తెలుసని వ్యాఖ్యానించారు. గంగుల చేరిక విషయంలో చంద్రబాబు అన్నీ ఆలోచించాల్సి ఉంటుందని వ్యాఖ్యానించడం విశేషం.

మరోవైపు గంగుల ప్రతాప్ రెడ్డి మాత్రం ఈ వ్యాఖ్యలపై మాట్లాడుతూ భూమా అఖిల వ్యాఖ్యలను తప్పుబట్టారు. ఆమెకు ఆందోళన అవసరం లేదన్నారు. ఒకనాడు భూమాతో విబేధాలున్నప్పటికీ ఇప్పుడు సమస్యలు లేవన్నారు. తాను కూడా భూమా కుటుంబం విజయం కోసం పనిచేస్తానని తెలిపారు. అయినప్పటికీ అఖిల ప్రియ మాత్రం గంగుల రాకను అంగీకరించడం లేదని తాజా ప్రకటన స్పష్టం చేస్తోంది. దాంతో ఈ వ్యవహారం తెలుగుదేశంలో ప్రకంపనలు పుట్టించే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే రెండు రోజులుగా గంగుల టీడీపీలో చేరిక జాప్యం అవుతోంది. రెండు రోజులుగా టీడీపీతో కలుస్తున్నా చేరిక మాత్రం ఆలశ్యం అయ్యింది. దాంతో ఎటుమళ్లుతుంది..దాని ప్రభావం నంద్యాలలో ఎలా ఉంటుందన్నది చర్చనీయాంశమే.

ఇప్పటికే ఏవీ సుబ్బారెడ్డి, అఖిల ప్రియ మధ్య విబేధాలు కొనసాగుతున్నాయి. తాజాగా గంగుల రాకను కూడా ఆమె అడ్డుకోలేకపోతే నంద్యాల టీడీపీ విబేధాలు మరింత పెరిగే అవకాశం ఉంది. ఇక తాజాగా చంద్రబాబు అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. కొన్ని రోజులుగా దూరం పెట్టిన నారా లోకేష్ ని మళ్లీ తెరమీదకు తీసుకొచ్చారు. అయితే కేవలం పర్యవేక్షణ బాధ్యతను మాత్రమే అప్పగించడం విశేషం. ఇక కాకినాడ ఎన్నికల బాధ్యతను ప్రత్తిపాటి పుల్లారావుకి అప్పగించారు.


Related News

anasuya

అనసూయ మెగాహీరోకి మేనత్తనట!

Spread the loveతెలుగు యాంకర్లు ఇప్పుడు ఒకప్పటిలా మాములుగా లేరు. ముఖ్యంగా ఈ మధ్య కొన్ని రియాలిటీ షోల ద్వారాRead More

Premam-Heroine-Sai-Pallavi-Leaked-Images-from-Rain-Songs-in-Telugu-Movie-Fidaa-with-Varun-Tej

ఆ హీరోయిన్ పేరు చెప్పగానే బాబోయ్ అంటున్న హీరో

Spread the loveప్రేమమ్ లో మలర్ పాత్రతో మళయాళంలో… ఫిదా సినిమాలో భానుమతి పాత్రతో తెలుగులో సాయి పల్లవి ప్రేక్షకులనుRead More

 • జేసీ రాజీనామాలో నిజమెంత?
 • బయట కలుద్దామని ఒత్తిడి చేశాడంటున్న హీరోయిన్
 • పీకే ఫిక్సయినట్టే..!
 • రకుల్ ని అలా చూడగానే..!
 • విశాల్ పోరాటం ఫ‌లించేనా?
 • ఎన్టీఆర్ కి కోటిమంది అయిపోయారు..!
 • త్రిష దూకేసింది..!
 • హాట్ బ్యూటీకి మహిళా కమిషన్ షాక్
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *