Main Menu

వ్యభిచార గృహంలో విద్యాబాలన్‌…

vidya
Spread the love

బాలీవుడ్‌ నటి విద్యాబాలన్‌ గత రెండేళ్ళ కాలంలో సాదించిన అనూహ్య విజయాలగురించి మనకు తెలిసిందె.ఆమె వినూత్న తరహాలో కథల్ని ఎంచుకుని వీటికి జీవం పోస్తూ విజయాల దిసగా సాగుతోంది.ఈ క్రమంలో ‘డర్టీ పిక్చర్‌’, ‘కహానీ’, ‘కహానీ-2’ వంటి చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మెప్పించిన బాలీవుడ్‌ నటి విద్యాబాలన్‌ నటిస్తున్న తర్వాతి చిత్రం ‘బేగం జాన్‌’. ఇందులో ఆమె వ్యభిచార గృహ నిర్వాహకురాలి పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలోని ఓ స్టిల్‌ ప్రస్తుతం ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతోంది. ఇందులో విద్యా హుక్కా తాగుతూ కనిపించిన తీరు చిత్రంపై అంచనాలు పెంచుతోంది. బెంగాలీ దర్శకుడు శ్రీజిత్‌ ముఖర్జీ బాలీవుడ్‌లో తెరకెక్కిస్తున్న తొలి సినిమా ఇది. బెంగాలీలో ‘రాజ్‌కహిని’ పేరుతో శ్రీజిత్‌ తెరకెక్కించిన ఈ చిత్రం ప్రశంసలు అందుకుంది.
ఈ చిత్రంలో నసీరుద్దీన్‌ షా, రాజేశ్‌ శర్మ, గౌహర్‌ఖాన్‌, పల్లవీ శారద ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. మార్చిలో ‘బేగం జాన్‌’ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.






Related News

sunitha

రేణూ దేశాయ్ బాట‌లో సింగ‌ర్ సునీత‌

Spread the loveప్ర‌స్తుతం టాలీవుడ్ లో పున‌ర్వివాహాల సీజ‌న్ వ‌చ్చిన‌ట్టు క‌నిపిస్తోంది. ప‌లువురు సినీ ప్ర‌ముఖులు రెండో పెళ్లిళ్ల‌కు సిద్ధ‌మ‌వుతున్నారు.Read More

Actor-Vishal-Krishna-Photo-Gallery-0gybl07

శ్రీరెడ్డికి విశాల్ ఝ‌ల‌క్

Spread the loveకోలీవుడ్ స్టార్, హీరో విశాల్ షాకింగ్ నిర్ణ‌యం తీసుకున్నారు. ముఖ్యంగా శ్రీరెడ్డి వ్య‌వ‌హారంలో ఆయ‌న సీరియ‌స్ గాRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *