భారతీయుడు సీక్వెల్ సిద్ధం..!

papanasam-tamil-movie-kamal-hassan-pics-00189
Spread the love

భారతీయుడు’ అప్పట్లో జాతీయ నటుడు కమల్ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సంచలన విజయం సాధించడమే కాకుండా, ప్రేక్షకుల్ని ఆలోచింపచేసింది. దేశంలో వున్న లంచగొండితనాన్ని రూపుమాపడానికి భారతీయుడు చేసే పోరాటం బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది. ప్రస్తుతం దీనికి సీక్వెల్ తెరకెక్కించేందుకు సన్నాహాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం కమల్ హాసన్ ‘విశ్వరూపం-2’, ‘శభాష్ నాయుడు’ సినిమాలతో బిజీగా వున్నారు. మరోవైపు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. కమల్‌హాసన్‌తో మళ్లీ భారతీయుడు-2’ చిత్రాన్ని తీయడానికి శంకర్ ప్రయత్నాలు మొదలుపెట్టాడట. ప్రస్తుతం రజనీకాంత్‌తో ‘రోబో-2.0’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న ఆయన తదుపరి చిత్రం భారతీయుడు-2’ తెరకెక్కిస్తాడని వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్‌రాజు నిర్మించనున్నట్లు సమాచారం. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కే ఈ సినిమాకి సంబంధించిన ప్రయత్నాలను దిల్‌రాజు మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. ఈ చిత్రం వచ్చే ఏడాది సెట్స్‌పైకి వచ్చే అవకాశాలున్నట్టు సమాచారం. ప్రస్తుతం వున్న పరిస్థితుల్లో ‘్భరతీయుడు’ లాంటి సందేశాత్మక చిత్రాలు రావడం ఎంతైనా అవసరం వుంది. మరి ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక వివరాలు వెలువడే వరకు ఆగాల్సిందే.






Related News

kotla suryaprakash

జగన్ గూటికి కోట్ల: ముహూర్తం సిద్ధం

Spread the loveకర్నూలు ఎంపీ సీటుపై క్లారిటీ రావడంతో మాజీ కేంద్ర మంత్రి వైసీపీ వైపు మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికేRead More

Jagan-Plenary

యాత్రను అడ్డుకుంటే జగన్ కే మేలు!

Spread the loveవైఎస్ జగన్ పాదయాత్రకు రంగం సిద్ధం అయ్యింది. మరో పక్షం రోజుల్లో ఆయన రాష్ట్రమంతా కాలినడకన చుట్టిRead More

 • కొత్త అవతారంలో హీరో
 • 60ఏళ్ల నటుడితో నమిత ప్రేమాయణం
 • పీకల్లోతు ప్రేమలో రాయ్ లక్ష్మీ
 • తాప్సీ రెండో ఇల్లు..
 • డేటింగ్ కి సై అంటున్న బ్యూటీ
 • అజ్ఞాతవాసిగా మారాలనుకుంటున్న పవర్‌స్టార్‌..!
 • భారతీయుడు సీక్వెల్ సిద్ధం..!
 • పవన్ కల్యాణ్ కోసం ఉదయభాను..
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *