బాల‌య్య‌ను డోంట్ కేర్ అంటున్న డైరెక్ట‌ర్..!?

krish_balayya1455474368
Spread the love

న‌ట‌ర‌త్న నందమూరి బాలకృష్ణ శ‌త‌చిత్రం `గౌతమిపుత్ర శాతకర్ణి`. శ‌ర‌వేగంగా షూటింగ్ సాగుతోంది. జార్జియాలో భారీ హంగుల మ‌ధ్య సినిమా చిత్రీక‌ర‌ణ సాగుతోంది. సినిమా షూటింగ్ తో పాటు గ్రాఫిక్స్ వ‌ర్క్ కూడా ఏక‌కాలంలో సాగిస్తున్నారు. ఈ చారిత్ర‌క చిత్రంలో భారీ తారాగ‌ణం న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. అదేస్థాయిలో గ్రాఫిక్ వ‌ర్క్ ఉంటుంద‌ని స‌మాచారం. అయితే సినిమా విష‌యంలో బాల‌య్య మాట‌ను డైరెక్ట‌ర్ క్రిష్ కేర్ చేయ‌డం లేద‌న్న ప్ర‌చారం టాలీవుడ్ వ‌ర్గాల్లో సాగుతోంది.

స‌హ‌జంగా త‌న సినిమాల విష‌యంలో చాలామంది సీనియ‌ర్ హీరోల మాదిరిగానే బాల‌కృష్ణ జోక్యం కూడా ఎక్కువ‌గానే ఉంటుంద‌న్న‌ది అంద‌రికీ తెలిసిన స‌త్యం. అయితే క్రియేటివ్ డైరెక్ట‌ర్ గా గుర్తింపు సాధించిన క్రిష్ మాత్రం ఆ విష‌యంలో బాల‌య్య‌కు ప్రాధాన్య‌త ఇవ్వ‌క‌పోవ‌డం ఇప్పుడు అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. `గౌతమిపుత్ర శాతకర్ణి`. ఈ మూవీ కాష్ట్యూమ్స్ విషయంలో బాలయ్య జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే ద‌ర్శ‌కుడు మాత్రం దానికి భిన్నంగా స్పందించిన‌ట్టు స‌మాచారం. క్యాస్టూమ్స్ భారీ ఖ‌రీదులో కాకుండా చూడాల‌న్న నిర్ణ‌యానికి క్రిష్ వ‌చ్చిన‌ట్టు స‌మాచారం. అందుకే కాస్ట్యూమ్స్ డిజైన‌ర్ విష‌యంలో ఇద్ద‌రి మ‌ధ్య కొంత గ్యాప్ వ‌చ్చింద‌ని ప్ర‌చారం

అయితే చివ‌ర‌కు కథలో రియాలిటీ కోసం, కాష్ట్యూమ్స్ పై ప్రత్యేకమైన శ్రద్ధా ఉండాలనుకున్నక్రిష్…బాలయ్య నిర్ణయాన్ని కాదని…ఇందుకోసం దేవదాస్, జోథా అక్భర్ వంటి చిత్రాలకు పనిచేసిన కాస్ట్యూమ్ డిజైనర్ నీతూ లుల్లా ని తీసుకున్నారు. మొదటి షెడ్యూల్ నుండి నీతూ లుల్లా ఉన్నప్పటికీ…తన సలహాలని మాత్రమే వీరు తీసుకునేవారు.

కానీ ఇప్పుడు నీతూ లుల్లా `గౌతమిపుత్ర శాతకర్ణి` మూవీకి పూర్తి స్థాయిలో పని చేస్తున్నారు. ముఖ్యంగా బాలయ్య కోసం ప్రత్యేకమైన డిజైన్స్ ని నితూ లుల్లా డిజైన్స్ చేశారు. దీంతో బాలయ్య మొదట్లో క్రిష్ పై కొంత కోప్పడ్డప్పటికీ..తరువాత నితూ లుల్లా డిజైన్స్ ని చూసి ఇంప్రెస్ అయ్యాడంట. మొత్తంగా బాల‌య్య మాట కాద‌న్న క్రిష్ చివ‌ర‌కు త‌న నిర్ణ‌యం అమ‌లు చేయించుకోవ‌డం విశేషం.


Related News

Mass-Maharaja-Ravi-Teja-new-film-titled-Nela-Ticket

నేలటికెట్ లో చిరంజీవి మువీ

Spread the loveఆశ్చర్యకరమే అయినా ప్రస్తుతం ఇదో హాట్ టాపిక్ అవుతోంది. రవితేజ లేటెస్ట్ మువీ నేలటికెట్ సినిమాలో పలుRead More

apcabinet

మంత్రులు మారిపోతున్నారు..!

Spread the loveఏపీలో క్యాబినెట్ లో పలువురు మంత్రులు మారబోతున్నట్టు తెలుస్తోంది. దానికి తగ్గట్టుగా సీఎం కసరత్తు కూడా ప్రారంభించినట్టుRead More

 • చిరుతో శివ!
 • చంద్రబాబుకి సన్నిహితుడి షాక్
 • ఏపీ ఎన్నికలపై ఆసక్తికర సర్వే
 • పునరాలోచనలో పురందేశ్వరి!
 • వైసీపీతో మంత్రి మంత‌నాలు?
 • అభ్య‌ర్థుల‌ను మార్చేస్తున్న వైసీపీ!
 • శ్రీరెడ్డికి భారీ ఛాన్స్
 • ప‌వ‌న్ ఎఫెక్ట్: బాబు స‌న్నిహితుడిపై వేటు?
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *