Main Menu

బాబు వ‌ద్ద బాల‌య్య‌కు అవ‌మానం..!

Spread the love

ఏపీ సీఎం చంద్ర‌బాబు నిర్ణ‌యం ఆయ‌న వియ్యంకుడు, హిందూపూర్ ఎమ్మెల్యేకి రుచించ‌డం లేదు. దాంతో ఆయ‌న త‌న‌కు అవ‌మానం జ‌రిగిన‌ట్టు భావిస్తున్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ప్ర‌తిష్టాత్మ‌క‌మైన వ్య‌వ‌హారంలో త‌న‌మాట కాద‌న్నందుకు ఆయ‌న చిన్న‌బుచ్చుకున్న‌ట్టు చెబుతున్నారు. విజయవాడలో కనకదుర్గగుడి ఈవో నియామక వ్యవహారం ఇప్పుడు బాబు, బాల‌య్య మ‌ధ్య కొత్త విబేధాల‌కు తావిస్తోంద‌ని స‌మాచారం. దుర్గ‌గుడి ఈవో వ్య‌వ‌హారంలో స్వ‌యంగా బాల‌కృష్ణ చేసిన ప్ర‌తిపాద‌న‌ను ప‌క్కన పెట్టేయ‌డంతో ఆయ‌న అసంతృప్తి మిగిల్చింద‌ని టీడీపీ వ‌ర్గాల్లో ప్ర‌చారం సాగుతోంది.

ఏపీలో తిరుమల తర్వాత అంత ప్రాధాన్యం ఉన్న దేవ‌స్థానం విజ‌య‌వాడదే కావ‌డంతో అక్క‌డ ఎగ్జిక్యూటివ్ ఆఫీస‌ర్ వ్య‌వ‌హారం అంద‌రిలో ఆస‌క్తి రేపింది. దాంతో జాయింట్ కమిషనర్ స్థాయిలో పనిచేస్తూ, తనకు కావలసిన ఒక అధికారికి కనకదుర్గ గుడి ఈఓగా పోస్టింగు ఇవ్వాలని బాలకృష్ణ కోరినట్లు సమాచారం. అయితే, ఈ విషయంలో చంద్ర‌బాబు మాత్రం బాలకృష్ణ సిఫార్సును పట్టించుకోకపోవ‌డం విశేషం. త‌న‌కు సుప‌రిచితుడైన సీసీఎల్‌ఏలో పనిచేసిన ఐఏఎస్ అధికారి సూర్యకుమారిని నియమించడం ద్వారా చంద్ర‌బాబు నేర‌గా బాల‌య్య‌కు షాకిచ్చారు. ఇప్ప‌టి వ‌ర‌కూ నాన్ ఐఏఎస్ అధికారులు మాత్ర‌మే ఈవో పోస్ట్ నిర్వ‌హించ‌గా ఇప్పుడు మాత్రం బాబు దానికి విరుద్ధంగా నిర్ణ‌యం తీసుకోవ‌డ‌మే బాల‌కృష్ణ‌కు మింగుడుప‌డ‌డం లేద‌ని తెలుస్తోంది. ఇప్ప‌టికే కొంద‌రు స‌న్నిహితుల వ‌ద్ద త‌న అసంతృప్తిని వెళ్ల‌గ‌క్కిన బాల‌య్య ఏం చేస్తార‌న్న‌ది ఆస‌క్తిగా మారింది. కానీ ప్ర‌స్తుత రాజ‌కీయాల్లో వియ్యంకుడి మాట‌ను పాటించాల్సిందే త‌ప్ప ఈ నంద‌మూరి వార‌సుడికి మ‌రో దారి లేద‌న్న అభిప్రాయం వినిపిస్తోంది.






Related News

బాబు మీద గురిపెట్టి ఏపీకి మ‌ళ్లీ అన్యాయం..!

Spread the loveరాక రాక వ‌చ్చారు. కానీ ఏదో చేస్తార‌ని ఆశించిన వాళ్ల‌ను నిరాశ‌లో ముంచారు. ఏదో ఒక హామీRead More

బాబుకి మింగుడుప‌డ‌ని ఆమంచి ఎత్తులు

Spread the loveఆమంచి కృష్ణ‌మోహ‌న్ .ఈచీరాల ఎమ్మెల్యే ఇప్పుడు మ‌ళ్లీ హాట్ టాపిక్ అయ్యారు. సెంట‌ర్ పాయింట్ అయ్యారు. ఏపీRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *